Tea : డయాబెటిక్ తో బాధపడుతున్నారా.. ఈ టీలు తాగండి చాలు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Tea : డయాబెటిక్ తో బాధపడుతున్నారా.. ఈ టీలు తాగండి చాలు..!

 Authored By ramu | The Telugu News | Updated on :12 April 2024,7:00 am

Tea : ఈ రోజుల్లో చాలా మంది షుగర్ వ్యాధితో అదేనండి డయాబెటిక్ తో బాధపడుతున్నారు. ఒకప్పుడు వయసు పైబడిన వారిలో మాత్రమే ఇది కనిపించేది. కానీ ఇప్పుడు మాత్రం వయసుతో సంబంధం లేకుండా చిన్న వయసు వారిలో కూడా ఇది కనిపిస్తోంది. ఒకసారి ఇది వస్తే పోదు. దాని వల్ల చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అందుకే షుగర్ పేషెంట్లు చాలా వరకు ఏది పడితే అది తినకుండా ఉండిపోతారు. అయితే షుగర్ ను కంట్రోల్ చేసుకోవడం కోసం చాలానే మందులు వాడినా పెద్దగా ప్రయోజనం ఉండదు. అయితే ఇప్పుడు కొన్ని టీలు తాగితే మంచి ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Tea : గ్రీన్ టీ

గ్రీన్ టీ వల్ల షుగర్ కంట్రోల్ అవుతుందని ఆరోగ్య నిపుణులే చెబుతున్నారు. ఎందుకంటే ఇందులో ఉండే పాలీఫెనాల్స్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి. దాంతో పాటు ఇందులో యాంటి ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి బాడీకి ఇమ్యూనిటీ పవర్ పెంచుతాయి.

Tea : దాల్చిన చెక్క టీ

దాల్చిన చెక్క లో ఉండే ప్రత్యేక లక్షణాలు కూడా షుగర్ ను కంట్రోల్ చేస్తాయి. ఇన్సులిన్, సెన్సిటివిటీని మెరుగుపరిచేందుకు సాయం చేస్తాయి. ఒకకప్పు నీటిలో దాల్చిన చెక్క ముక్క వేసి కాసుపు మరిగించుకుని.. తాగితే సరిపోతుంది.

Tea : తులసి టీ

తులసి టీతో కూడా ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. ఇందులో ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది. పైగా తులసి ఆకులు హైపోగ్లైసీమిక్ ప్రభావాలు కలిగి ఉంటాయి. ఇవి కూడా బ్లడ్ లో ఉంటే షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేస్తాయి. ఒక కప్పు నీటితో తులసి ఆకులను వేసి మరిగించుకోవాలి. ఆ తర్వాత దాన్ని వడకట్టుకుని అందులో తేనె కూడా వేసుకుని తాగవచ్చు. అలా తాగితే ఇది షుగర్ ను కంట్రోల్ చేస్తుంది.

Tea డయాబెటిక్ తో బాధపడుతున్నారా ఈ టీలు తాగండి చాలు

Tea : డయాబెటిక్ తో బాధపడుతున్నారా.. ఈ టీలు తాగండి చాలు..!

Tea : వాము టీ

వాముతో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వాముతో తయారు చేసిన టీని తాగితే షుగర్ ను బాగా కంట్రోల్ చేసుకోవచ్చు. వాము టీని తయారు చేసేందుకు ఒకకప్పు నీటితో పావు చెంచా వామువేసి కాసేపు మరిగించుకోవాలి. ఆ తర్వాత తాగితే సరిపోతుంది. వడకట్టుకుని తాగవచ్చు లేదంటే డైరెక్టుగా కూడా తాగొచ్చు.

Tea : మెంతి టీ

మెంతులతో కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది బ్లడ్ లో షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేసేందుకు బాగానే సాయం చేస్తుంది. ఒక కప్పు వేడి నీటిలో ఒక చెంచా మెంతులు వేసుకుని ఒక పది నిముషాలు బాగా మరిగించుకోవాలి. ఆ తర్వాత పక్కనపెట్టుకుని నిమ్మరసం వేసుకుని తాగితే సరిపోతుంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది