Ayurvedic Medicine : పిచ్చి మొక్క అని తీసి పడేయకండి… సర్వరోగ నివారిణి…?
Ayurvedic Medicine : ఈ మొక్క మనకు ఎక్కడపడితే అక్కడ కనిపిస్తూ ఉంటుంది. పిచ్చి మొక్క అని మనం తీసిపడేసే మొక్కల్లో కొన్ని ఔషధాలు గుణాలు దాగి ఉన్నాయి. వీటిని సరిగ్గా ఉపయోగిస్తే మనకు సర్వరోగ నివారిణిగా పనిచేస్తుంది. ఆయుర్వేద నిపుణుల సహాయంతో సరిగ్గా వినియోగించాలి. లేదంటే మొదటికే మోసం అవుతుంది. ప్రకృతి ఇచ్చే వన మూలికల్లో ఇది ఒక మొక్క. ఆ మొక్క పేరు తిప్పతీగ . ఈ మొక్క గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. టైం లో ఈ తిప్పతీగ బాగా వెలుగులోకి వచ్చింది. ప్రతి చోట కూడా తీగల్లాగా వ్యాపించి కనిపిస్తుంది.దీని ఆరోగ్య ప్రయోజనాలు గురించి మాత్రమే చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఆయుర్వేదం ప్రకారం దీని వినియోగించడం ద్వారా ఆరోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు అంటున్నారు నిపుణులు. వినియోగించే పద్ధతి సరిగ్గా ఉంటే గనుక అనేక రకాల వ్యాధులను నయం చేయవచ్చు.దీని ఆకులు, కాండం,కొమ్మలు అన్నీ కూడా ఔషధాల తయారీలో వినియోగిస్తారు.
Ayurvedic Medicine : పిచ్చి మొక్క అని తీసి పడేయకండి… సర్వరోగ నివారిణి…?
తిప్పతీగ ప్రకృతిని మనకు ఇచ్చిన గొప్ప వరం. శక్తివంతమైన ఔషధ గుణాలు అమోఘం. గతంలో కరోనా వచ్చిన సమయంలో దీని రసం తాగటం వల్ల ఎటువంటి ఆరోగ్య సమస్యలు రావని అందరూ ఇళ్లల్లో దీనిని ఉపయోగించడం, మొక్కని పెంచుకోవడం కూడా చేశారు. కరోనా వచ్చి పోయిన తరువాత తిప్పతీగ మొక్క గురించి చాలామందికి తెలిసింది.. క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల అనేక వ్యాధులను నివారించవచ్చు అంటున్నారు. ఔషధంగా ఉపయోగించే ముందు ఆరోగ్య సమస్యలకు మంచిదో కాదో తెలుసుకోవడం ముఖ్యం. తిప్పతీగ ఆకురసం జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది. అలాగే శరీరానికి శక్తిని అందిస్తుంది. పోషకాలను పెంచడంలో సహాయపడుతుంది. ఇది మధుమేహం, చర్మవ్యాధులు,కీళ్లవ్యాధులు, అల్సర్లు,జ్వరం వంటి ఇతర ఆరోగ్య సమస్యలను నయం చేయుటకు ప్రధాన పాత్రను పోషిస్తుంది అంటున్నారు ఆయుర్వేద నిపుణులు.
Ayurvedic Medicine తిప్పతీగ ఆరోగ్య ప్రయోజనాలు
.తిప్పతీగ శోథ నిరోధక లక్షణాలను కలిగి ఉంటుంది.తరచూ వచ్చే దగ్గు జలుబు శ్వాసకోశ సమస్యలతో పోరాడటానికి ఇది దివ్య ఔషధంలా పనిచేస్తుంది.
. ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు దివ్య ఔషధం. రక్తంలో చక్కర స్థాయిలను మెరుగుపరచడం ద్వారా డయాబెటిస్ ని నియంత్రించవచ్చు.
. అది ఆకులను తీసుకోవడం వల్ల ఆస్తమా వ్యాధి నయమవుతుంది. బిగుతుగా,దగ్గు, గురక వంటి లక్షణాలను కూడా తగ్గించగలదు.
.తిప్ప తీగ ఆకులతో చూర్ణం చేసి, దానికి బెల్లాన్ని జోడించి,రెండు కలిపి తీసుకుంటే,మలబద్ధకం వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి వివిధ వ్యాధులను నియంత్రిస్తుంది. ఇప్పటికే ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉన్నట్లయితే దీనిని తీసుకునే ముందు వైద్య నిపుణులను సంప్రదించి తీసుకుంటే ఉత్తమం.
