Home » Exclusive » Beauty Tips Face Pack For Glowing Face
Exclusive

Beauty Tips : ఒక్కసారి ఇది రాసారంటే.. నిమిషాల్లో ముఖం తెల్లగా అవ్వడం ఖాయం…!

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Updated on: October 25, 2022 2:30 pm
Advertisement

Beauty Tips : ప్రతి ఒక్కరు అందంగా ఉండాలని కోరుకుంటారు. కొందరు అందంగా తయారవ్వడానికి పార్లర్లకు వెళ్లి వేల వేల డబ్బులను వృధా చేస్తుంటారు. అయినా ముఖంలో ఎటువంటి మార్పు ఉండదు. సమయం కూడా వృధా అవుతుంది. లేనిపోని కొత్త సమస్యలు వస్తాయి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నేచురల్ గా ఐదు నిమిషాల్లో అందంగా ఇలా తయారు చేసుకోవచ్చు. ఈ ప్యాక్ ని కనుక వేసుకుంటే ముఖం అందంగా తయారవుతుంది. ఈ ప్యాక్ కోసం ముందుగా ఒక ఫ్రెష్ గా ఉన్న బీట్రూట్ తీసుకొని పైన తొక్క తీసేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. ముక్కలను మిక్సీ జార్లో వేసి నీళ్లు వేసుకోకుండా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ పేస్ట్ ను ఏదైనా గుడ్డ సహాయంతో జ్యూస్ ను వడకట్టుకోవాలి.

Advertisement

వడకట్టుకున్న జ్యూస్ ను గిన్నెలో వేసి స్టవ్ మీద పెట్టి దగ్గర అయ్యేంతవరకు మరిగించుకోవాలి. తర్వాత స్టౌ ఆఫ్ చేసి దానిలో బియ్యం పిండిని కొంచెం కొంచెంగా కలుపుకోవాలి. ఇది పేస్ట్ లా కాకుండా డ్రైగా అయ్యేంతవరకు వేసుకుంటూ కలుపుతూ ఉండాలి. తర్వాత ఈ పిండిని 24 గంటలపాటు ఆరనివ్వాలి. తర్వాత ఏదైనా గాజు సీసాలో స్టోర్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో సరిపడినంత పౌడర్ వేసుకోవాలి. దాంట్లో ఒక స్పూన్ రోజ్ వాటర్ వేసుకోవాలి. రోజ్ వాటర్ బయటి మార్కెట్లలో దొరుకుతుంది. తరువాత ఇందులో ఒక స్పూన్ అలోవెరా జెల్ వేసుకోవాలి.

Beauty tips face pack for glowing face

Advertisement

ఈ మూడింటిని బాగా కలుపుకోవాలి. మగవారు అయితే ఇలా అప్లై చేసుకోవచ్చు. ఆడవారు అయితే ఒక స్పూన్ కస్తూరి పసుపు వేసుకోవాలి. ప్యాకెట్ పసుపు అస్సలు వేసుకోకూడదు. బాగా కలుపుకొని ముఖానికి బాగా అప్లై చేసుకోవాలి. అప్లై చేసిన తర్వాత కొద్దిసేపు ఆరనిచ్చి స్మూత్ గా మసాజ్ చేయాలి. తర్వాత నీటితో కడిగేసుకోవాలి. ఇలా వారానికి ఒకసారి చేయడం వలన ముఖం అందంగా, కాంతివంతంగా తయారవుతోంది. ముఖంపై ఉంటే నల్లని మచ్చలు, పింపుల్స్, డార్క్ సర్కిల్స్ వంటి సమస్యలు తగ్గుతాయి. మీరు ఎక్కడికైనా వెళ్లేటప్పుడు ఒక ఐదు నిమిషాల ముందు ఈ ప్యాక్ అప్లై చేసుకుంటే ముఖం అందంగా, కాంతివంతంగా తయారవుతుంది.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి