Beauty Tips : ఈ ఆధునిక కాలంలో జనాభా రోజురోజుకి పెరుగుతూనే ఉంది. అలాగే కాలుష్యం కూడా అంతకు మించి పెరుగుతూనే వస్తుంది. ఈ పొల్యూషన్ వలన మన ముఖం నల్లగా మారిపోతుంది. మనం వాడే కెమికల్స్ వలన మన ముఖంపై నల్ల మచ్చలు, మొటిమలు ఇంకా ఇబ్బంది పెడుతూనే ఉంటాయి. వీటిని పోగొట్టడానికి వేల వేల డబ్బులను వృధా చేస్తూ, పార్లర్ చుట్టూ తిరగుతూ, వివిధ రకాల కెమికల్స్ ను వాడుతుంటారు.అయిన ఫేస్ లో ఎటువంటి మార్పు రాదు. కానీ మంచి గ్లో రావాలని వీటినే వాడుతుంటారు. వీటి వలన మనకు చాలా సైడ్ ఎఫెక్ల్స్ కలుగుతాయి. మన చుట్టూ పరిసరాలలో , మనం రోజు చూసే మొక్కలతో సులువుగా మన ముఖంపై ఉన్న నల్ల మచ్చలను, మొటిమలను తొలగించుకోవచ్చు. అది ఏ మొక్కనో, ఏ విధంగా ముఖానికి వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం..
ముందుగా మనకు కావలసినది బిళ్ల గన్నేరు మొక్క యొక్క ఆకులు. ఈ మొక్క మన చుట్టూ ప్రక్క పరిసరాలలో కనిపిస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఈ ఆకులను ఒక పిరికెడు తీసుకొని నీటితో బాగా శుభ్రం చేసుకోవాలి. తరువాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా తుంచుకోవాలి. ఇప్పుడు వీటిని మిక్సీలో వేసుకొని, కొన్ని నీళ్లను పోసుకొని మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోవాలి. తరువాత ఒక గిన్నె తీసుకొని మెత్తటి క్లాత్ వేసి వడగట్టుకోవాలి. వడగట్టాగ వచ్చిన రసాన్నిఇప్పుడు మనం ఉపయోగించుకోవాలి. ఈ రసంలో వివిధ రకాల పదార్ధాలను వేసుకొని ఫేస్ ప్యాక్ వేసుకుంటే మన ముఖం ఎటువంటి మచ్చలు లేకుండా తెల్లగా, కాంతివంతంగా తయారవుతుంది. ఈ రసంలో ఏ పదార్ధాలను వేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం…
ఈ రసంలో రెండు స్పూన్ల ముల్తానీ మట్టిని వేసుకొని బాగా కలుపుకోవాలి. తరువాత ఇందులో నాలుగు చుక్కల నిమ్మరసాన్ని కలుపుకోవాలి. దీనిని ఒక పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలా తయారైన మిశ్రమాన్నిముఖానికి ఫేస్ ప్యాక్ లాగా వేసుకోవాలి. ఒక పావుగంట ఉంచి ఆరనివ్వాలి. ఆ తరువాత చల్లటి నీళ్లతో ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా నాలుగు వారాలు చేయడం వలన మీ మొహంపై ఉన్న నల్లమచ్చలు, మొటిమలు తొలగిపోయి ముఖం అందంగా, తెల్లగా నిగనిగలాడుతుంది. ఈ ప్యాక్ లో మనం ఉపయోగించిన ముల్తానీ మట్టి మన ముఖానికి చల్లదనాన్ని ఇస్తుంది. నిమ్మకాయలో ఉండే విటమిన్ సి ముఖాన్ని ప్రకాశవంతంగా చేస్తుంది. ఈ బిళ్ల గన్నేరు మొక్క యొక్క ఆకులు ముఖంపై ఉన్న నల్ల మచ్చలను, మొటిమలను తొలగించడానికి బాగా సహాయపడుతుంది. కనుక మీ ఫేస్ తెల్లగా మెరవాలంటే ఈ ఆకులతో ఇలా చేసి చూడండి…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.