Beauty Tips : ఈ ఆకుల‌తో ఫేస్ ప్యాక్ వేసుకుంటే… ఇక పార్ల‌ర్ కి వెళ్ల‌న‌వ‌స‌రం లేదు… | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Beauty Tips : ఈ ఆకుల‌తో ఫేస్ ప్యాక్ వేసుకుంటే… ఇక పార్ల‌ర్ కి వెళ్ల‌న‌వ‌స‌రం లేదు…

 Authored By anusha | The Telugu News | Updated on :24 June 2022,3:00 pm

Beauty Tips : ఈ ఆధునిక కాలంలో జ‌నాభా రోజురోజుకి పెరుగుతూనే ఉంది. అలాగే కాలుష్యం కూడా అంత‌కు మించి పెరుగుతూనే వ‌స్తుంది. ఈ పొల్యూష‌న్ వ‌ల‌న మ‌న ముఖం న‌ల్ల‌గా మారిపోతుంది. మ‌నం వాడే కెమిక‌ల్స్ వల‌న మ‌న ముఖంపై న‌ల్ల మ‌చ్చ‌లు, మొటిమ‌లు ఇంకా ఇబ్బంది పెడుతూనే ఉంటాయి. వీటిని పోగొట్ట‌డానికి వేల వేల డ‌బ్బుల‌ను వృధా చేస్తూ, పార్ల‌ర్ చుట్టూ తిర‌గుతూ, వివిధ ర‌కాల కెమిక‌ల్స్ ను వాడుతుంటారు.అయిన ఫేస్ లో ఎటువంటి మార్పు రాదు. కానీ మంచి గ్లో రావాల‌ని వీటినే వాడుతుంటారు. వీటి వ‌ల‌న మ‌న‌కు చాలా సైడ్ ఎఫెక్ల్స్ క‌లుగుతాయి. మ‌న చుట్టూ ప‌రిస‌రాల‌లో , మ‌నం రోజు చూసే మొక్క‌ల‌తో సులువుగా మ‌న ముఖంపై ఉన్న న‌ల్ల మ‌చ్చ‌ల‌ను, మొటిమ‌ల‌ను తొల‌గించుకోవ‌చ్చు. అది ఏ మొక్క‌నో, ఏ విధంగా ముఖానికి వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం..

ముందుగా మ‌న‌కు కావ‌ల‌సిన‌ది బిళ్ల గ‌న్నేరు మొక్క యొక్క ఆకులు. ఈ మొక్క మ‌న చుట్టూ ప్ర‌క్క ప‌రిస‌రాల‌లో క‌నిపిస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఈ ఆకుల‌ను ఒక పిరికెడు తీసుకొని నీటితో బాగా శుభ్రం చేసుకోవాలి. త‌రువాత వీటిని చిన్న చిన్న ముక్క‌లుగా తుంచుకోవాలి. ఇప్పుడు వీటిని మిక్సీలో వేసుకొని, కొన్ని నీళ్ల‌ను పోసుకొని మెత్త‌గా పేస్ట్ లాగా ప‌ట్టుకోవాలి. త‌రువాత ఒక గిన్నె తీసుకొని మెత్త‌టి క్లాత్ వేసి వ‌డ‌గ‌ట్టుకోవాలి. వ‌డ‌గట్టాగ వ‌చ్చిన ర‌సాన్నిఇప్పుడు మ‌నం ఉప‌యోగించుకోవాలి. ఈ ర‌సంలో వివిధ ర‌కాల ప‌దార్ధాల‌ను వేసుకొని ఫేస్ ప్యాక్ వేసుకుంటే మ‌న ముఖం ఎటువంటి మ‌చ్చ‌లు లేకుండా తెల్ల‌గా, కాంతివంతంగా త‌యార‌వుతుంది. ఈ ర‌సంలో ఏ ప‌దార్ధాల‌ను వేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం…

Beauty Tips to face pack to remove the black dots on the face

Beauty Tips to face pack to remove the black dots on the face

ఈ ర‌సంలో రెండు స్పూన్ల ముల్తానీ మ‌ట్టిని వేసుకొని బాగా క‌లుపుకోవాలి. త‌రువాత ఇందులో నాలుగు చుక్క‌ల నిమ్మ‌ర‌సాన్ని క‌లుపుకోవాలి. దీనిని ఒక పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలా త‌యారైన మిశ్ర‌మాన్నిముఖానికి ఫేస్ ప్యాక్ లాగా వేసుకోవాలి. ఒక పావుగంట ఉంచి ఆర‌నివ్వాలి. ఆ తరువాత చ‌ల్ల‌టి నీళ్ల‌తో ముఖాన్ని శుభ్రంగా క‌డుక్కోవాలి. ఇలా నాలుగు వారాలు చేయ‌డం వ‌ల‌న మీ మొహంపై ఉన్న న‌ల్ల‌మ‌చ్చ‌లు, మొటిమ‌లు తొల‌గిపోయి ముఖం అందంగా, తెల్ల‌గా నిగ‌నిగ‌లాడుతుంది. ఈ ప్యాక్ లో మ‌నం ఉప‌యోగించిన ముల్తానీ మ‌ట్టి మ‌న ముఖానికి చ‌ల్ల‌ద‌నాన్ని ఇస్తుంది. నిమ్మ‌కాయ‌లో ఉండే విట‌మిన్ సి ముఖాన్ని ప్ర‌కాశ‌వంతంగా చేస్తుంది. ఈ బిళ్ల గ‌న్నేరు మొక్క యొక్క ఆకులు ముఖంపై ఉన్న న‌ల్ల మ‌చ్చ‌ల‌ను, మొటిమ‌ల‌ను తొల‌గించ‌డానికి బాగా స‌హాయ‌ప‌డుతుంది. క‌నుక మీ ఫేస్ తెల్ల‌గా మెర‌వాలంటే ఈ ఆకుల‌తో ఇలా చేసి చూడండి…

anusha

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది