Home » Health » Benefits Of Barefoot Walking
Health

Walking : ప్రతిరోజు ఉదయం చెప్పులు లేకుండా నడిస్తే… ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా…!

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Published on: September 22, 2024, 11:00 am
Advertisement

Walking : మనం ప్రతిరోజు కొద్దిసేపు చెప్పులు లేకుండా నడవడం వలన అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అంటే చెప్పులు లేకుండా నేలపై నడవడం వలన గుండె ఆరోగ్యం మరియు మానసిక ఆరోగ్యం మరియు కండరాలకు మేలు జరుగుతుంది. అయితే చెప్పులు లేకుండా నడవడాన్ని గ్రౌండింగ్ లేక ఎర్తింగ్ అని అంటారు. దీని వలన శరీరంలో పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. అయితే వీటితో పాటుగా శరీరంలో రక్త ప్రసరణను కూడా మెరుగుపరుస్తుంది. అలాగే రక్తపోటును నియంత్రించడంలో కూడా హెల్ప్ చేస్తుంది. అయితే రోజు ఉదయం 15 నుండి 20 నిమిషాల పాటు చెప్పులు లేకుండా నడవడం వలన ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఆ ప్రాంతం శుభ్రంగా మరియు సురక్షితంగా ఉంది అని నిర్ధారించుకున్న తర్వాత పచ్చని పచ్చిక బయళ్ళు మరియు బీచ్ మరియు పార్కులు లాంటి ప్రదేశాలలో చెప్పులు లేకుండా నడవడానికి ప్రయత్నించండి. ఇలా నిత్యం చేయడం వలన శరీరంలో నాడీ వ్యవస్థ కూల్ అయ్యి ఒత్తిడి అనేది తగ్గుతుంది. ఇలా చేయడం వలన ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూద్దాం…

Advertisement

Walking మెరుగైన నిద్రను అందిస్తుంది

నిద్రలేమి సమస్యతో బాధపడే వారికి చెప్పులు లేకుండా నడవడం వల్ల ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే మీకు మంచి నిద్రను కూడా ఇస్తుంది. అయితే మీరు చెప్పుల్లేకుండా నడవడం వలన మీ మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఇది మీ శరీరానికి ఎంతో విశ్రాంతిని కూడా ఇస్తుంది. అలాగే మీరు బాగా నిద్రపోవడానికి కూడా హెల్ప్ చేస్తుంది…

కంటి స్పష్టత : మీరు చెప్పులు లేకుండా నడిస్తే మీ పాదాలపై ఒత్తిడి అనేది ఏర్పడుతుంది. అప్పుడు ఇది మీ ఆప్టిక్ నరాలకి ఎంతో ఉత్తేజాన్ని ఇస్తుంది. అయితే మీరు చెప్పులు లేకుండా నడుస్తున్నప్పుడు ప్రెజర్ అనేది పాయింట్ ను ప్రేరేపించడం వలన మీ కళ్ళ యొక్క ఫోకస్ మెరుగుపడుతుంది…

Advertisement

రోగనిరోధక శక్తి : మీరు చెప్పులు లేకుండా నడవడం వలన రోగనిరోధక వ్యవస్థ ఎంతో బలంగా తయారవుతుంది. ఇది మీ శరీరాన్ని ఎన్నో రకాల వ్యాధులతో పోరాడేందుకు కూడా హెల్ప్ చేస్తుంది…

వాపును తగ్గిస్తుంది : వాపు అనేది శరీరంలోని కణాలను దెబ్బతీస్తుంది. ఇది గుండె సమస్యలు మరియు క్యాన్సర్, ఇతర రకాల సమస్యలకు కూడా దారి తీస్తుంది. అయితే మీరు చెప్పులు లేకుండా నడవడం వలన శరీరంలో ఎలక్ట్రాన్లు యాంటీ ఆక్సిడెంట్లుగా పని చేయటంలో హెల్ప్ చేస్తాయి. అలాగే ఇది మీ శరీరంలోని మంటను కూడా నియంత్రిస్తుంది…

Advertisement

Walking : ప్రతిరోజు ఉదయం చెప్పులు లేకుండా నడిస్తే… ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా…!

ఒత్తిడిని తగ్గిస్తుంది : మీరు చెప్పులు లేకుండా నడవడం వలన ఒత్తిడి కూడా తగ్గుతుంది. అలాగే మీరు చెప్పులు లేకుండా నడవడం వలన మీ మెదడుకు ఎంతో ఉత్తేజాన్ని ఇస్తుంది. అలాగే ఆందోళనను కూడా తగ్గిస్తుంది. అలాగే మీ మానసిక ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది…

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి