Black Turmeric : పసుపు అంటే కేవలం పసుపు రంగులోనే ఉంటుంది అని మనందరికీ తెలుసు. కానీ ఈ పసుపు కేవలం పసుపు రంగులోనే కాదు నలుపు రంగులో కూడా ఉంటుంది. దీనిని నల్ల పసుపు అని పిలుస్తారు. సాధారణ పసుపులో కంటే నల్ల పసుపులోనే ఎక్కువ పోషకాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఈ నల్ల పసుపు కూడా పసుపు లాగే దుంపల ఆకారంలోనే ఉంటాయి. దీనిలో కర్కుమిన్ కంటెంట్ అనేది అధికంగా ఉంటుంది. అయితే ఈ కర్కు మిన్ యాంటీ ఇన్ఫ్లమెంటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. ఈ నల్ల పసుపు అనేది వంటలలో రుచి మాత్రమే కాదు నొప్పులు, వాపులను కూడా తగ్గించటంలో ఎంతో మేలు చేస్తుంది. అలాగే చర్మ సమస్యలకు కారణం అయ్యే బ్యాక్టీరియాను కూడా నాశనం చేస్తుంది. అంతేకాక వృద్ధాప్యాన్ని తగ్గించడానికి మరియు ఆరోగ్యంగా ఉంచడానికి నల్ల పసుపు ఎంతో మేలు చేస్తుంది…
ఈ నల్ల పసుపుని తీసుకోవటం వలన మన శరీరాన్ని ఎన్నో రకాల వ్యాధుల నుండి రక్షిస్తుంది. ఈ నల్ల పసుపులో ఉన్నటువంటి కర్కుమిన్ లక్షణం క్యాన్సర్ కణాలతో పోరాడడం వలన క్యాన్సర్ కు సంబంధించిన ప్రమాదాలను నియంత్రిస్తుంది. అలాగే ఊపిరితిత్తులు, రొమ్ము, ప్రోస్టేట్, పెద్ద పేగు క్యాన్సర్ లాంటి వాటిపై ప్రభావంతంగా పనిచేస్తుంది. సాధారణంగా ఎంతో మంది మహిళలకు నెలసరి టైం లో పొత్తి కడుపు నొప్పి వస్తూ ఉంటుంది. ఇలాంటి వారికి ఈ నల్ల పసుపు ఎంతగానో మేలు చేస్తుంది. ఈ నల్ల పసుపులో ఉన్న యాంటీ ఇన్ ప్లమెంటరీ లక్షణాలు మహిళల్లో వచ్చే నెలసరి నొప్పులకు వెంటనే ఉపశమనం కలిగిస్తుంది. దీనికోసం నల్ల పసుపు పొడిని వేడి పాలలో వేసుకొని తీసుకుంటే మంచిది. ఈ నల్ల పసుపు అనేది గ్యాస్ట్రిక్ సమస్యలను కూడా నియంత్రిస్తుంది. అలాగే యాసిడ్ రీప్లేక్స్, గ్యాస్, ఉబ్బరం, ఎక్కిళ్ళు, అజీర్ణం అల్సర్లు, గ్యాస్టిక్ సమస్యలు లాంటివి దరిచేరకుండా ఉంటాయి. మీరు తీసుకునే ఆహారంలో కొద్దిగా ఈ నల్ల పసుపు పొడిని కలిపి తీసుకుంటే జీర్ణవ్యవస్థ ఎంతో మెరుగుపడుతుంది.
నల్ల పసుపు లో ఉన్న ఔషధ గుణాలు శ్వాసకోశ సమస్యతో ఇబ్బంది పడే వారికి ఔషధం లా పనిచేస్తుంది. అలాగే జలుబు, దగ్గు, ఆస్తమా లాంటి సమస్యల నుండి ఉపశమనం కలిగించే యాంటీ ఇన్ ఫ్లమెంటరీ గుణాలు అధికంగా ఉన్నాయి. సాధారణ పసుపు లాగే దీనిని కూడా మీరు వాడవచ్చు. ప్రస్తుత కాలంలో ఎంతోమంది మైగ్రేన్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. దీంతో తల వెనుక భాగంలో మరియు పక్క భాగంలో విపరీతమైన నొప్పి అనేది వస్తుంది. ఈ నల్ల పసుపు అనేది మైగ్రేన్ సమస్య నుండి కూడా ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఎంతో తాజాగా ఉన్న నల్ల పసుపును చూర్ణం లాగా చేసి నుదిటిపై పేస్టులా అప్లై చేసుకోవటం వలన నొప్పిని తగ్గిస్తుంది…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.