Brinjal : ప్రస్తుత కాలంలో ఆరోగ్యమే మహాభాగ్యంగా పాటిస్తున్నారు ప్రతి ఒక్కరూ. అయితే హెల్త్ విషయంలో కూడా నిత్యం తీసుకునే ఆహారంలో కూరగాయలు వాటిల్లో ఉండే పోషకాలు మన ఆరోగ్యాని కి ఎంత మేలు చేస్తాయి అనే విషయాలు తెలుసుకోవడం కూడా ముఖ్యమే. అయితే అన్నింటిలో వంకాయ ప్రస్తుతం ట్రెండింగ్ వెజిటేబుల్ గా మారింది అని చెప్పొచ్చు. పండ్లలో రారాజు మామిడి పండు ఎలాగో కూరగాయలో రాజు వంకాయ అని చెబుతూ ఉంటారు. అయితే ఈ వంకాయ మీద తెలుగు సినిమాలలో ఎన్నో పాటలు మరియు చాలా కవిత్వాలు కూడా ఉన్నాయి. అంత ఫేమస్ అన్నమాట ఈ వంకాయ. అలాంటి వంకాయతో ఆరోగ్యపరంగా పుష్కలమైన ప్రయోజనాలు ఉన్నాయి. ఈ వంకాయ అనేది అన్ని కూరగాయల లాగే ఒక మామూలు కూరగాయ అయినప్పటికీ చాలా మంది మాత్రం దీనిని ఎక్కువగా తినటానికి ఇష్టపడతారు. దీనిని అందరూ తినడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఈ వంకాయలు కేవలం మన దేశంలోనే కాక ప్రపంచం మొత్తం కూడా ఎక్కువగా ఇష్టపడి తింటుంటారు. అయితే చైనా, బంగ్లాదేశ్,ఫిలిప్పీన్స్ దేశ ప్రజలు మాత్రం ఈ వంకాయలను తక్కువగా తీసుకుంటూ ఉంటారు. అయితే ఇంతకు ఈ వంకాయలలో ఉండే పోషకాలు ఏమిటో చూద్దాం…
వంకాయలలో కెరోటి నాయిడ్స్ అనే పోషకాలు అధికంగా ఉన్నాయి. ఈ కెరోటినాయిడ్స్ విటమిన్ A లోపాన్ని కూడా కంట్రోల్ చేస్తుంది. కావున వంకాయలు తీసుకోవడం వలన విటమిన్ A మనకు తగినంత లభిస్తుంది అని వైద్యులు అంటున్నారు. అయితే విటమిన్ A తో కంటి చూపు కూడా ఎంతో మెరుగుపడుతుంది. అయితే నిత్యం మన ఆహారంలో ఈ వంకాయలను కనుక తీసుకున్నట్లయితే కంటి సమస్యలకు కూడా చెక్ పెట్టొచ్చు అని అంటున్నారు. అలాగే వంకాయలలో ఫైబర్ అనేది అధికంగా ఉంటుంది. అంతేకాక కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. కావున టైప్ 2 డయాబెటిస్ తో బాధపడుతున్నటువంటి వారికి దానిని తగ్గించడంలో ఎంతో మేలు చేస్తుంది.
ఈ వంకాయలలో కేలరీలు అనేవి చాలా తక్కువ పరిమాణంలో ఉంటాయి. అలాగే వీటిని తిన్న తర్వాత జీర్ణం కూడా తొందరగా అవుతుంది. అంతేకాక బాడీలో ఉన్న కొవ్వును నియంత్రించడంలో కూడా వంకాయలు కీలక పాత్ర పోషిస్తాయి. అయితే ప్రస్తుత ఒక జాగ్రత్త మాత్రం తీసుకోవాలి. ఈ వంకాయను కూర వండేటప్పుడు నూనె చాలా తక్కువ ఉపయోగించాల్సి ఉంటుంది అని వైద్యులు అంటున్నారు. దీనికి ఎక్కువ ఆయిల్ వాడటం వలన దీనిలో ఉండే పోషక విలువలు అనేవి తగ్గిపోతాయి. వీటితో పాటుగా వంకాయలను ప్రతినిత్యం తీసుకోవడం వలన ఊపిరితిత్తుల క్యాన్సర్ మరియు కడుపు క్యాన్సర్లు వచ్చే ప్రమాదం చాలావరకు ఉండదు అని వైద్య నిపుణులు అంటున్నారు. అంతేకాక ఈ వంకాయలు శరీరంలో ఉన్న విషపు వ్యర్ధాలను కూడా బయటకు పంపి ఆరోగ్యాన్ని రక్షిస్తాయి. కావున ఇన్ని అద్భుతాలు ఉన్నటువంటి ఈ వంకాయలు ఆరోగ్యకర విలువలు ఉన్న ఈ వంకాయలను మిస్ అవ్వద్దు అని అంటున్నారు…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
This website uses cookies.