Carrot Juice : శీతాకాలంలో ఎక్కువగా దొరికే కూరగాయల్లో క్యారెట్ ఒకటి. ఈ సీజన్లో రోజు క్యారెట్ జ్యూస్ తాగితే అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు అంటున్నారు. శీతాకాలంలో హెల్తీ టేస్టీ కూరగాయలు పండ్లు ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి. వాటిలో క్యారెట్ ఒకటి. క్యారెట్ టేస్టీగా ఉండటమే కాదు. దీనిలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. క్యారెట్ లో ఏ, సి, కె విటమిన్లు ఐరన్, కాల్షియం, పొటాషియంలు ఉన్నాయి. కూల్ క్లైమేట్ లో హాట్ హాట్ క్యారెట్ హల్వా తినడం అంటే చాలామందికి ఇష్టం. అంతేకాదు క్యారెట్ తో సలాడ్స్ సూప్ లు కూడా చేసుకోవచ్చు. చలికాలంలో క్యారెట్ జ్యూస్ చేసుకుని తాగితే అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు అంటున్నారు. క్యారెట్ లోని ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. రోజు క్యారెట్ జ్యూస్ తాగితే శరీరానికి కావలసిన ఫైబర్లో 40 నుండి 50% వరకు అందుతుందని నిపుణులు అంటున్నారు. మన జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి ఫైబర్ చాలా అవసరం. ఇది మలబద్ధకాన్ని నివారించడానికి సహాయపడుతుంది. ఫైబర్ మీ ఆకలి రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. తద్వారా మీ బరువు కంట్రోల్లో ఉంటుంది. క్యారెట్లు బిటా కేరోటింగ్ పుష్కలంగా ఉంటుంది.
వీటిని మన మానవ శరీరం విటమిన్ ఏ కిందకు మార్చుకుంటుంది. ఇది శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ గా పని చేస్తుంది. ఇది ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది. అంతేకాదు వీటిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. విటమిన్స్ ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది. ఇన్ఫెక్షన్ నుంచి శరీరాన్ని రక్షిస్తుంది. శీతాకాలంలో ఎక్కువగా వేధించే జలుబు, దగ్గు, ఫ్లూ వంటి సమస్యల నుంచి రక్షిస్తుంది. ఈ సీజన్లో రోజు క్యారెట్ జ్యూస్ తాగితే ఆరోగ్యంగా ఉంటారు. మీకు అందమైన చర్మం కావాలంటే రోజు క్యారెట్ లు తాగాలని నిపుణులు అంటున్నారు. న్యూట్రియన్స్ జర్నల్లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం క్యారెట్లు విటమిన్ సి బీటా కెరోటిన్లు అధికంగా ఉంటాయి. రోజు క్యారేజ్ తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలో కంట్రోల్లో ఉంటుంది. జర్నల్ ఆఫ్ అగ్రికల్చరల్ అండ్ ఫుడ్ కెమిస్ట్రీలో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం పులియపెట్టిన క్యారెట్ రసంలో ప్రోబయోటిక్స్ ఉన్నాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.
క్యారెట్ లో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇది బ్లడ్ షుగర్స్ ను కంట్రోల్ లో ఉంచుతుంది. ఇది డయాబెటిస్ మెడిటేషన్ ఉన్నవారికి మంచి ఎంపిక క్యారెట్లు పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది హైపర్ టెన్షన్ను కంట్రోల్లో ఉంచుతుంది. పొటాషియం మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. క్యారెట్లు శరీరంలోని సోడియంను సమతుల్యం చేయడానికి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడతాయి. వీటిలో విటమిన్ ఏ సి ఎక్కువగా ఉంటుంది. రోజు క్యారెట్ తింటే కంటి సమస్యలకు సులభంగా చెక్ పెట్టవచ్చు. మీ కంటి ఆరోగ్యాన్ని రక్షించుకోవడానికి రోజు క్యారెట్ జ్యూస్ తాగండి…
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.