Dengue : వర్షాకాలం వచ్చింది అంటే వర్షంతో పాటు సీజనల్ వ్యాధులను కూడా తీసుకొస్తుంది. అయితే ఈ వ్యాధుల నుంచి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. దేశంలో డెంగ్యూ జ్వరం డేంజర్ బెల్ మోగిస్తుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ శాస్త్రవేత్తలు డెంగ్యూ జ్వరం వ్యాప్తిని తెలుసుకోవడానికి నమూనా పరీక్షలను నిర్వహించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పూణే నగరం నుంచి వంద నమునాలను ఎన్ఐవికి వచ్చాయి. అయితే వీరిలో 50 మందికి డెంగ్యూ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ క్రమంలోనే వైద్యులు డెంగ్యూ వైరస్ లో మొత్తం నాలుగు రకాల సెరోటైప్ లు ఉన్నాయట. NIV ప్రసారం ఎక్కువ కేసుల్లో డెంగ్యూ – 2 సర్వర్ టైప్ గా నిర్ధారణ అవుతున్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు. టెస్ట్ కోసం వస్తున్నా శాంపిల్స్ లో చాలా వరకు డెంగు పాజిటివ్ నమోదు అవుతున్నాయని అలాగే రానున్న రోజుల్లో ఈ వ్యాధి తిరిగి వ్యాపించే అవకాశం ఉందని వెల్లడించడం జరిగింది.
ఈ సందర్భంగా NIV లోని చికెన్ గున్యా మరియు డెంగ్యూ విభాగాలకు సంబంధించిన డాక్టర్ అనురాధ త్రిపాటి మాట్లాడుతూ…. గోవా ,పూనే ,తెలంగాణ, యూపీ , బీహార్ నుంచి చికెన్ గునియా డెంగ్యూ పరీక్షల కోసం ప్రతి సంవత్సరం ఎన్ఐఏ 4000 నుంచి 5000 నమూనాలను స్వీకరిస్తుంది. అయితే జూన్ నెలలో 100 శాంపిలను పరీక్షించగా అందులో 50 మందికి డెంగ్యూ వైరల్ ఫీవర్ ఉన్నట్లుగా నిర్ధారణ అయింది. ఈ ఏడాది పూనే మున్సిపల్ కార్పొరేషన్ ఆరోగ్య విభాగంలో 487 డెంగ్యూ కేసులు నమోదు అయితే అందులో 10 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అయితే పూణేతో పాటుగా దేశ రాజధాని ఢిల్లీ మరియు ఇతర రాష్ట్రాలలో కూడా డెంగ్యూ కేసులు నెమ్మదిగా నమోదు అవుతున్నాయి. ఈ పరిస్థితుల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
ఢిల్లీలోని సీనియర్ వైద్యుడు డాక్టర్ అజయ్ కుమార్ దేశంలోని పలు రాష్ట్రాల రుతుపవనాలు వచ్చాయి అని చెప్పారు. అలాగే రానున్న రోజుల్లో డెంగ్యూ కేసులు మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని దీని కారణంగా పలు ప్రాంతాలలో వర్షం నీరు నిల్వ ఉండడం వలన డెంగ్యూ ప్రమాదం ఉంది. నిలకడ ఉన్న నీటిలో డెంగ్యూ లార్వా అభివృద్ధి చెందుతుంది. ఈ దోమలు కుట్టడం ద్వారా డెంగ్యూ సోకుతుంది. అలాగే జూలై నుండి సెప్టెంబర్ వరకు డెంగ్యూ కేసులు ఎక్కువగా నమోదు అవుతాయి. వర్షం ఎంత ఎక్కువగా కురిస్తే డెంగ్యూ ముప్పు ఎక్కువగా పెరుగుతుందని అజయ్ కుమార్ ఈ సందర్భంగా తెలియజేశారు. కాబట్టి ఇలాంటి పరిస్థితులలో జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు మరింత జాగ్రత్తలు తీసుకోవాలని ఇలాంటి వారిలోనే డెంగ్యూ తీవ్రమైన లక్షణాలు ఉంటాయని తెలిపారు. అలాగే డెంగ్యూ షాక్ సిండోమ్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది. దీని వలన ముందస్తు జాగ్రత్త తీసుకోవాలని వైద్య సిబ్బంది హెచ్చరిస్తున్నారు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.