
Asafoetida : చిటికెడు ఇంగువతో ఎన్ని లాభాలో తెలుసా...!
Asafoetida : ప్రతి ఒక్కరి ఇంట్లో ఇంగువ అనేది కచ్చితంగా ఉంటుంది. ఇది ఒక ఘాటైన సుగంధ ద్రవ్యం.ఇది ముద్దగాను పొడిగాను రెండు రకాలలో మనకు దొరుకుతుంది. చాలా మంది దీని వాసన కారణంగా తినటానికి ఇష్టపడరు. కానీ ఎక్కువ మంది దీనిని ఆహార రుచిని పెంచడానికి ఉపయోగిస్తారు. కానీ ఇంగువ ఆరోగ్యానికి ఎంతో మంచిది. సాంబారు, పులిహోర,రసం, పచ్చళ్ళు, అన్నిటిలోనూ ఈ ఇంగువను వాడతారు. ఈ ఇంగువ అనేది పదార్థాలు బూజు పట్టకుండా కూడా చూస్తుంది. ఇంగువను తీసుకోవటం వలన జీర్ణక్రియ అనేది మెరుగుపడుతుంది. కడుపులో ఉన్న గ్యాస్ మరియు ఎసిడిటీలను కూడా తగ్గిస్తుంది. ఇది కడుపు నొప్పి, కడుపు ఉబ్బరం లాంటి ఇతర సమస్యల నుండి కూడా ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాక జలుబు, దగ్గు సమస్యలను తగ్గించటంలో కూడా ఎంతో మేలు చేస్తుంది…
మనం రోజు తీసుకునే ఆహారములో చిటికెడు ఇంగువను తీసుకోవడం వలన ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. దీనిలో ఎన్ని ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. ఇది మన రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. మనల్ని ఎంతో ఆరోగ్యంగా కూడా ఉంచుతుంది. చిటికెడు ఇంగువ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అందువలన చాలా ఏళ్ళ గా దీనిని ఆహారంలో వాడుతున్నారు. ఇంగువను ప్రతిరోజు తీసుకోవడం వలన గ్యాస్,కడుపు ఉబ్బరం లాంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది. ఈ పొడిలో యాంటీబయోటిక్, యాంటీ వైరల్,యాంటీ ఇన్ఫ్లోమెంటరీ లక్షణాలు శ్వాసకు సంబంధించిన ఇబ్బందులను కూడా తొలగిస్తుంది. సెనగ గింజ పరిమాణంలో, బెల్లం మధ్యలో పెట్టి తీసుకున్నట్లయితే నెలసరి టైం లో వచ్చే పొత్తి కడుపు నొప్పి కూడా తగ్గిస్తుంది. కప్పు నీళ్లను బాగా మరగబెట్టి దీనిలో చిటికెడు ఇంగువ వేసి రెండు మూడు సార్లు తీసుకున్నట్లయితే తలనొప్పి కూడా మాయం అవుతుంది. సెనగ గింజంత ఇంగువను వాము బెల్లంతో కలిపి తీసుకోవటం వలన నులి పురుగుల సమస్య కూడా ఉండదు. అన్నంలో మొదటి ముద్దను నెయ్యి,వాము, ఇంగువతో కలిపి తీసుకున్నట్లయితే అజీర్తీ సమస్యలు కూడా ఉండవు. అయితే దీనిని ఎక్కువగా తీసుకోకూడదు. తీసుకున్నట్లయితే విరోచనాలకు దారితీస్తుంది.
Asafoetida : చిటికెడు ఇంగువతో ఎన్ని లాభాలో తెలుసా…!
ఇంగువ లో యాంటీ ఇన్ఫ్రామెంటరీ లక్షణాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి. ఇది మన శరీరంలో ఉన్న మంటను తగ్గించడంలో కూడా ఎంతో మేలు చేస్తుంది. కీళ్ల నొప్పుల నుండి కూడా ఎంతో ఉపశమనం కలిగిస్తుంది. ఇతర రకాల ఆరోగ్య సమస్యలను కూడా తగ్గిస్తుంది. ఇంగువలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ అనే లక్షణాలు ఉన్నాయి. ఇవి మొటిమలు ఇతర చర్మ సమస్యలను తగ్గించటంలో కూడా ఎంతో మేలు చేస్తుంది. ఇతర రకాల సూక్ష్మజీవులకు వ్యతిరేకంగా పోరాడేందుకు కూడా ఎంతో మేలు చేస్తుంది. రక్తపోటును తగ్గించడంలో కూడా ఎంతో మేలు చేస్తుంది. ఇది కార్డియో వాస్కులర్ సమస్యలను కూడా తగ్గించగలదు. ఇది రక్త ప్రసరణను కూడా సాధారణీరి స్తుంది…
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
This website uses cookies.