
Mother : మాతృత్వం తర్వాత కూడా అందంగా కనిపించాలి అనుకుంటున్నారా... వీటిని ఫాలో అవ్వండి...!
Mother : మాతృత్వం అనేది ప్రతి ఒక్కరికి కూడా ఒక వరం. ప్రతి మహిళ తల్లి కావడం కోసం ఎన్నో పూజలు, వ్రతాలు చేస్తూ ఉంటారు. అయితే తల్లి అయిన తర్వాత శరీరంతో పాటుగా అందంపై కూడా ఎంతో ప్రభావం పడుతుంది. వాటిని నియంత్రించేందుకు చాలామంది ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అందులో కొంతమంది యోగాలు,ఆసనాలు చేస్తూ ఉంటారు. అలాగే ఇతర రకాల మందులు సౌందర్య లేపనాలు ఇలా చాలా వాటితో ఎన్నో ప్రయత్నాలు చేస్తూ. కానీ అవి కొంతవరకు మాత్రమే ఉపశమనాన్ని కలిగిస్తాయి. ముఖ్యంగా చెప్పాలంటే.మహిళ గర్భం దాల్చిన టైం లో సాధారణంగా కనిపించినప్పటికీ,నెలలు పెరిగే కొద్దీ క్రమక్రమంగా బరువు కూడా పెరుగుతూ ఉంటారు. దీనికి కారణం ఏంటంటే. కడుపులో ఉన్న బిడ్డ కోసం పోషకాహారం తీసుకోవడం. అలాగే వైద్యుల సలహా మేరకు ఎన్నో రకాల మందులు వాడటం…
బిడ్డ పుట్టిన తర్వాత తల్లి శరీరంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. వాటిని పట్టించుకోకపోతే లావు అవ్వటం, అందంగా కనిపించకపోవడం లాంటి సమస్యలు ఎన్నో వస్తాయి అని అంటున్నారు వైద్యులు. ముఖ్యంగా చెప్పాలంటే. అయితే తల్లికి పిల్లలు పుట్టిన తర్వాత సరైన నిద్ర అంటూ ఉండదు. ఆ తల్లి పిల్లలకు పోషిణ మరియు సంరక్షణకే టైం అంతా గడిచిపోతుంది. అలాంటి టైంలో శరీరంలో హార్మోన్లు సమతుల్యం కాకపోవటం వలన కూడా ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అని వైద్యులు అంటున్నారు. వీటిని తగ్గించేందుకు ఎన్నో సూచనలు కూడా చేస్తున్నారు గైనకాలజిస్ట్లు. క్లెన్సర్ తో ముఖాన్ని రోజుకు రెండుసార్లు తుడుచుకోవాలి. అలాగే కలబంద,యుకలిప్టస్ నూనెతో ఫేస్ ప్యాక్ చేసుకోవటం వలన కూడా ముఖం ఎంతో కాంతివంతంగా మెరవటంతో పాటు యవ్వనంగా కూడా కనిపిస్తారు.అలాగే పొట్ట భాగం, చేతులు,జబ్బలు లాంటి ప్రదేశాలలో కొవ్వు అనేది పేరుకుపోవడం వలన లావుగా కనిపిస్తారు..
Mother : మాతృత్వం తర్వాత కూడా అందంగా కనిపించాలి అనుకుంటున్నారా… వీటిని ఫాలో అవ్వండి…!
వీటన్నిటి నుండి ఉపశమనం కలిగించేందుకు వైద్యులు కొన్ని సూచనలు చేశారు. వాటిల్లో మసాజ్ ఆయిల్స్, మాయిశ్చరైజర్లను కొవ్వు ఉండే ప్రదేశాలలో ప్రతిరోజు రెండుసార్లు వాటితో మర్దన చేయాలి. అంతేకాక ఫైబర్ ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవడం, యోగ, బ్రిస్క్ వాక్,తేలికైన వ్యాయామాలు, ఇంటి పనులు చేయటం వలన ఈ కొవ్వు అనేది కరిగిపోయి తేలికగా కనిపిస్తారు అని వైద్యులు చెబుతున్నారు. వీటిని వైద్యుల సలహా తీసుకొని మాత్రమే వాడాలి. వీటిని ఎలా పడితే అలా వాడితే మొదటికే మోసం వచ్చే ప్రమాదాలు ఉన్నాయి. దీనిని కేవలం వైద్యులు చెప్పిన సలహా మేరకు మాత్రమే మీకు అందిస్తున్నాము అని గుర్తుంచుకోవాలి…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
This website uses cookies.