Tight Jeans : టైట్ దుస్తులు ధరించడం ఫ్యాషన్ కాదు... ఆ విషయంలో పెద్ద ముప్పే..!
Tight Jeans : ప్రస్తుత ఫ్యాషన్ ప్రపంచంలో, ముఖ్యంగా యువతలో, టైట్ జీన్స్‌లు, బిగుతుగా ఉండే లోదుస్తులు ధరించడం ఒక స్టైలిష్ ట్రెండ్‌గా మారింది. అయితే, ఈ అలవాటు మీ ఆరోగ్యానికి ముఖ్యంగా పురుషుల సంతానోత్పత్తి సామర్థ్యానికి ప్రమాదం కలిగించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.చాలామంది పురుషులు, తమ దుస్తుల శైలి వల్ల శరీర ఉష్ణోగ్రత పెరిగి, అది వృషణాలఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందనేదాన్ని పరిగణనలోకి తీసుకోరు.
Tight Jeans : టైట్ దుస్తులు ధరించడం ఫ్యాషన్ కాదు… ఆ విషయంలో పెద్ద ముప్పే..!
వృషణాలు సరిగా పనిచేయాలంటే అవి శరీర ఉష్ణోగ్రత కంటే కొద్దిగా తక్కువ ఉష్ణోగ్రతలో ఉండాలి. టైట్ బట్టలు వృషణాల చుట్టూ వేడిని ఉంచి, వాటి ఉష్ణోగ్రతను పెంచతాయి. దీని ప్రభావంగా, స్పెర్మ్ (వీర్యకణాలు) ఉత్పత్తి మందగిస్తుంది. బ్రిటన్ మరియు హార్వర్డ్ విశ్వవిద్యాలయం నిర్వహించిన అధ్యయనాల ప్రకారం, టైట్ లోదుస్తులు ధరిచే పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ సగటున 25% తగ్గే అవకాశం ఉంది. మరోవైపు, వదులుగా ఉండే లోదుస్తులు ధరించే వారిలో స్పెర్మ్ ఉత్పత్తి మెరుగ్గా ఉండే అవకాశం ఉంది.
GTB హాస్పిటల్ (ఢిల్లీ)కి చెందిన డాక్టర్ అజిత్ కుమార్ సూచించినట్లు, ల్యాప్‌టాప్‌ను ఒడిలో ఉంచి పనిచేయడం లేదా మొబైల్‌ను ప్యాంటు జేబులో పెట్టుకోవడం వలన కూడా వేడి పెరిగి వృషణాల ఆరోగ్యాన్ని ప్రభావితం చేయవచ్చు. ఇది కేవలం స్పెర్మ్ కౌంట్‌కే కాదు, కండరాల పనితీరుపైనా ప్రభావం చూపుతుంది. ఫ్యాషన్ ట్రెండ్‌ను అనుసరించడం తప్పు కాదు. కానీ, ఆరోగ్యంపై దాని ప్రభావాన్ని పట్టించుకోకపోతే, భవిష్యత్‌లో సమస్యలు తప్పవు.
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
Tulsi Leaves | హిందూ మతంలో పవిత్రంగా పరిగణించే తులసి చెట్టు కేవలం ఆధ్యాత్మిక కోణంలోనే కాకుండా, ఆరోగ్య పరంగా…
Garlic Peel Benefits | మన వంటగదిలో ప్రతిరోజూ వాడే వెల్లుల్లి యొక్క పేస్ట్, గుళికలే కాదు.. వెల్లుల్లి తొక్కలు…
Health Tips | వేగంగా బరువు తగ్గాలనుకునే వారు రోజులో ఎన్నో మార్గాలను ప్రయత్నిస్తుంటారు. వాటిలో టీ (చాయ్) ద్వారా బరువు…
Diwali | హర్షాతిరేకాలతో, వెలుగుల మధ్య జరుపుకునే హిందూ ధర్మంలోని మహా పర్వదినం దీపావళి మళ్లీ ముంచుకొస్తోంది. పిల్లలు, పెద్దలు అనే…
This website uses cookies.