Tight Jeans : టైట్ దుస్తులు ధరించడం ఫ్యాషన్ కాదు… ఆ విష‌యంలో పెద్ద ముప్పే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Tight Jeans : టైట్ దుస్తులు ధరించడం ఫ్యాషన్ కాదు… ఆ విష‌యంలో పెద్ద ముప్పే..!

 Authored By ramu | The Telugu News | Updated on :5 August 2025,12:00 pm

ప్రధానాంశాలు:

  •  Tight Jeans : టైట్ దుస్తులు ధరించడం ఫ్యాషన్ కాదు... ఆ విష‌యంలో పెద్ద ముప్పే..!

Tight Jeans : ప్రస్తుత ఫ్యాషన్ ప్రపంచంలో, ముఖ్యంగా యువతలో, టైట్ జీన్స్‌లు, బిగుతుగా ఉండే లోదుస్తులు ధరించడం ఒక స్టైలిష్ ట్రెండ్‌గా మారింది. అయితే, ఈ అలవాటు మీ ఆరోగ్యానికి ముఖ్యంగా పురుషుల సంతానోత్పత్తి సామర్థ్యానికి ప్రమాదం కలిగించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.చాలామంది పురుషులు, తమ దుస్తుల శైలి వల్ల శరీర ఉష్ణోగ్రత పెరిగి, అది వృషణాలఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందనేదాన్ని పరిగణనలోకి తీసుకోరు.

Tight Jeans టైట్ దుస్తులు ధరించడం ఫ్యాషన్ కాదు ఆ విష‌యంలో పెద్ద ముప్పే

Tight Jeans : టైట్ దుస్తులు ధరించడం ఫ్యాషన్ కాదు… ఆ విష‌యంలో పెద్ద ముప్పే..!

Tight Jeans : ఇలా చేయ‌డం త‌ప్పు..

వృషణాలు సరిగా పనిచేయాలంటే అవి శరీర ఉష్ణోగ్రత కంటే కొద్దిగా తక్కువ ఉష్ణోగ్రతలో ఉండాలి. టైట్ బట్టలు వృషణాల చుట్టూ వేడిని ఉంచి, వాటి ఉష్ణోగ్రతను పెంచతాయి. దీని ప్రభావంగా, స్పెర్మ్ (వీర్యకణాలు) ఉత్పత్తి మందగిస్తుంది. బ్రిటన్ మరియు హార్వర్డ్ విశ్వవిద్యాలయం నిర్వహించిన అధ్యయనాల ప్రకారం, టైట్ లోదుస్తులు ధరిచే పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ సగటున 25% తగ్గే అవకాశం ఉంది. మరోవైపు, వదులుగా ఉండే లోదుస్తులు ధరించే వారిలో స్పెర్మ్ ఉత్పత్తి మెరుగ్గా ఉండే అవకాశం ఉంది.

GTB హాస్పిటల్ (ఢిల్లీ)కి చెందిన డాక్టర్ అజిత్ కుమార్ సూచించినట్లు, ల్యాప్‌టాప్‌ను ఒడిలో ఉంచి పనిచేయడం లేదా మొబైల్‌ను ప్యాంటు జేబులో పెట్టుకోవడం వలన కూడా వేడి పెరిగి వృషణాల ఆరోగ్యాన్ని ప్రభావితం చేయవచ్చు. ఇది కేవలం స్పెర్మ్ కౌంట్‌కే కాదు, కండరాల పనితీరుపైనా ప్రభావం చూపుతుంది. ఫ్యాషన్ ట్రెండ్‌ను అనుసరించడం తప్పు కాదు. కానీ, ఆరోగ్యంపై దాని ప్రభావాన్ని పట్టించుకోకపోతే, భవిష్యత్‌లో సమస్యలు తప్పవు.

Also read

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది