Exercise : ప్రస్తుత కాలంలో ఎంతో మంది వ్యక్తులు ఫిట్నెస్ పై ఎక్కువగా మక్కువ చూపుతూ ఉంటారు. అయితే తమ శరీరాన్ని ఎంతో దృఢంగా ఉంచుకునేందుకు మరియు కండరాలను బలంగా పెంచుకోవడానికి ఎంతో కసరత్తు చేస్తూ ఉంటారు. మరికొందరు ఫిట్నెస్ కోసం వ్యాయామం చేస్తూ ఉంటారు. అంతేకాక బరువు తగ్గటానికి ప్రజలు కొంత టైం వ్యాయామం చేసేందుకు కేటాయిస్తారు. అయితే ఈ వర్కౌట్ చేయడం వెనక కారణం ఏదైనా కావచ్చు. దీని వెనక ఎంతో శారీరక శ్రమ అనేది తప్పదు. అయితే మీరు ఇప్పుడే వ్యాయామం చేయటం మొదలుపెడితే వర్కౌట్ చేసిన తర్వాత కొన్ని విషయాలను గుర్తు పెట్టుకోవడం చాలా ముఖ్యం. ఈ వ్యాయామం అనేది మిమ్మల్ని ఆరోగ్యంగా మరియు ఫిట్ గా ఉంచడంలో ఎంత హెల్ప్ చేస్తుంది. అలాగే మీరు తేలికపాటి శారీరక శ్రమతో మీ రోజును ప్రారంభిస్తే అది మీకు ఎంతో ఫిట్ గా కనిపిస్తుంది. అయితే వ్యాయామం చేసిన తర్వాత కొన్ని పనులు మాత్రం అస్సలు చేయకూడదు. అవి ఏమిటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం…
వెంటనే ఎక్కువ మొత్తంలో నీరు తాగడం : అయితే వ్యాయామం చేసిన తర్వాత శరీరం నుండి ఎక్కువ చెమట అనేది బయటకు వస్తుంది. అలాంటి పరిస్థితులలో వ్యాయామం చేసిన తరువాత ఎవరికైనా ఎంతో తీవ్రమైన దాహం అనేది వేస్తుంది. దీంతో ఒకేసారి ఎక్కువ మొత్తంలో నీళ్లు తాగటం మంచిది కాదు. ఇలా చేయటం వల్ల ఆరోగ్యనికి హాని కలుగుతుంది. అలాగే మీరు వ్యాయామం చేస్తున్న టైంలో లేక వ్యాయామం చేసిన తర్వాత వాటర్ తాగాలి అని అనుకుంటే ముందు హాయిగా కూర్చొని దీర్ఘ శ్వాస తీసుకోవాలి. తర్వాత కొంత సమయం పాటు విశ్రాంతి తీసుకోవాలి. ఆ తర్వాత మెల్లగా కొద్ది కొద్దిగా వాటర్ ను తాగాలి…
వ్యాయామం తర్వాత వెంటనే స్నానం చేయడం :వ్యాయామం చేసిన వెంటనే స్నానం చేసే వారిలో మీరు కూడా ఉన్నట్లయితే ఇది ఆరోగ్యానికి ఎంతో హాని కలిగిస్తుంది అని తెలుసుకోండి. అయితే ఎవరైనా సరే వ్యాయామం లేక ఏదైనా భారీ శారీరక శ్రమ చేసినట్లయితే కనీసం ఒక అరగంట తర్వాత అనగా శరీరం పూర్తిగా రిలాక్స్ అయిన తర్వాత స్నానం చేయాలి.
ఎక్కువ మొత్తంలో ఆహారం తినవద్దు : వ్యాయామం చేసిన వెంటనే అధికంగా ఆహారం తీసుకోవడం కూడా మంచిది కాదు. వ్యాయామం చేసిన తర్వాత కనీసం 30 నుండి 35 నిమిషాల పాటు విశ్రాంతి తీసుకున్న తర్వాతే భోజనం చేయాలి. అంతేకాక ఎక్కువ సమయం వ్యాయామం చేసిన తర్వాత శరీరంపై ఎక్కువ ఒత్తిడి కలిగించే వివిధ కార్యకలాపాలు అస్సలు చేయకూడదు. ఇలా చేయడం వలన కండరాలలో అధిక ఒత్తిడి కలుగుతుంది…
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.