Hair Tips : ప్రస్తుతం జుట్టు రాలే సమస్య ఎక్కువ అయిపోతుంది. దీనిని తగ్గించుకోవడం కోసం చాలామంది మార్కెట్లో దొరికే వివిధ రకాల ఆయిల్స్ ను ఉపయోగిస్తున్నారు. కానీ వాటిలో కెమికల్స్ ఉండటం వలన అనేక సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కేవలం ఇంట్లో ఉన్న పదార్థాలతో జుట్టు రాలటాన్ని తగ్గించుకోవచ్చు. దీంతో జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది. ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి ముందుగా జుట్టుకు సరిపడా బియ్యాన్ని తీసుకోవాలి. ఈ బియ్యాన్ని రెండుసార్లు కడిగిన తర్వాత ఎసరు పెట్టిన నీటిని ఒక పొంగు వచ్చిన తర్వాత తీసుకొని ఒక సీసాలోకి పోసి రాత్రి మొత్తం పులియపెట్టుకోవాలి.
పులియబెట్టిన బియ్యపు నీళ్లలో ఒక గిన్నెలోకి తీసుకొని ఒక కప్పు నీళ్లకు ఒక స్పూన్ కొబ్బరి నూనె వేసి బాగా కలుపుకోవాలి. కొబ్బరి నూనె వద్దనుకున్న వాళ్ళు బాదం నూనె కూడా వేసుకోవచ్చు. దీన్ని ఆయిల్ హెయిర్ మీద అప్లై చేసుకునేవారు అయితే నూనె వేసుకోకపోయినా పర్వాలేదు. బాగా కలిపిన తర్వాత ఈ నీటిని ఏదైనా స్ప్రే బాటిల్లో వేసుకొని తలస్నానం చేయడానికి ముందు రాసుకోవాలి. జుట్టు కుదర్ల నుంచి చివర్ల దాకా అప్లై చేసుకొని ఐదు నుంచి పది నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి. మసాజ్ చేయడం వలన బ్లడ్ సర్కులేషన్ బాగా జరిగి జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది. అప్లై చేసిన తర్వాత ఒక గంట పాటు ఉండి తర్వాత ఏదైనా షాంపుతో తలస్నానం చేయాలి.
తలస్నానం చేసిన తర్వాత నేచురల్ ఎయిర్ కండిషన్ అప్లై చేసుకోవాలి. దీనికోసం మనం కలబంద మట్టను తీసుకొని శుభ్రంగా కడిగి అంచులను తీసేసి మధ్యలో ఉన్న జిగురు నా మిక్సీ జార్ లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని స్ట్రైనర్ సహాయంతో వడగట్టుకుని మెత్తగా ఉండే పదార్థాన్ని తీసుకోవాలి. దీనిలో విటమిన్ ఈ క్యాప్సిల్స్ వేసి బాగా కలుపుకోవాలి. తలస్నానం తర్వాత జుట్టు కుదురుల నుంచి చివర్ల దాకా అప్లై చేసి 15 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఎటువంటి హెయిర్ డ్రయర్ ఉపయోగించకూడదు. ఇలా చేయడం వలన జుట్టు చాలా సున్నితంగా సిల్కీగా తయారు అవుతుంది.
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
This website uses cookies.