Hair Tips : చాలామంది జుట్టును ఎంతో కేర్ తీసుకుంటూ ఉంటారు. దానికోసం పార్లర్లకు వెళ్లి కెరోటిన్ ట్రీట్మెంట్ లాంటివి తీసుకుంటూ ఉంటారు. ఈ ట్రీట్మెంట్ ఎనిమిది నుంచి పదివేల వరకు ఖర్చు అవుతుంది. కానీ ఈజీగా ఇట్లోనే కేవలం పది రూపాయలతో కెరోటిన్ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. దానికోసం ముందుగా ఎనిమిది బెండకాయలను తీసుకోవాలి. బెండకాయలతో ప్యాక్ చేసుకుంటే జుట్టు సిల్కీగా ప్రకాశవంతంగా తయారవుతుంది. జీవం లేకుండా ఉన్న జుట్టు కుచ్చులాగా తయారవుతుంది. ఈ ప్యాక్ కోసం ముందుగా 8 బెండకాయలు తీసుకొని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకోవాలి.
తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక బౌల్ లోకి తీసుకోవాలి. అందులో గ్లాసు నీళ్లు పోసి స్టవ్ పై పెట్టి గోరువెచ్చగా అయిన తర్వాత బెండకాయ ముక్కలను వేసి ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి. బెండకాయ ముక్కలు ఉడికిన తర్వాత దానిలో ఉండే జిగురు బయటకు వస్తుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. తర్వాత ఏదైనా క్లాత్ సహాయంతో బెండకాయ ముక్కలను వడగట్టుకోవాలి. తర్వాత ఇందులో రెండు స్పూన్ల కార్న్ ఫ్లోర్ వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని స్టవ్ మీద పెట్టి దగ్గర పడేంతవరకు ఐదు నిమిషాలపాటు కలుపుతూ ఉడికించుకోవాలి. తర్వాత స్టౌ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి.
చల్లారిన తర్వాత ఒక స్పూన్ ఆముదం వేసి బాగా కలుపుకోవాలి. ఆముదం లేకపోతే బాదం నూనె కానీ కొబ్బరి నూనె కానీ వేసుకోవచ్చు. ఈ ప్యాక్ ను పొడి జుట్టు లేదా ఆయిల్ జుట్టు మీద కూడా అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసేటప్పుడు జుట్టును చిన్న చిన్న పాయలుగా విడదీసి కుదుళ్ళ నుండి చివర్ల వరకు అప్లై చేసుకోవాలి. 40 నిమిషాల నుండి గంటపాటు ఆరనివ్వాలి. తర్వాత ఏదైనా షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా చేయడం వలన జుట్టు సిల్కీగా, మృదువుగా తయారవుతుంది. పార్లర్ కి వెళ్లి కెరోటిన్ ట్రీట్మెంట్ తీసుకున్న సరే అంత మంచి ఫలితం రాదు. పార్లర్ కి వెళ్లి అంత ఖర్చు పెట్టే బదులు ఇంట్లోనే పది రూపాయలతో ఇలా చేశారంటే మంచి రిజల్ట్ పొందుతారు. జుట్టు చాలా స్మూత్ గా తయారవుతుంది.
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
Cough And Cold : సీజన్ మారుతున్న టైమ్ లో హఠాత్తుగా జలుబు చేయడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ…
Zodiac Signs : నవగ్రహాలకు రాజుగా పిలవబడే సూర్యుడి సంచారం కారణంగా కొన్ని రాశుల వారి జీవితం ప్రభావితం అవుతూ…
IDBI JAM : ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( IDBI Bank ) వివిధ పోస్టుల కోసం…
Onion And Garlic : భారతదేశంలోని ప్రతి ఒక్కరి ఇంట్లో దాదాపుగా ఉల్లిపాయాలను వెల్లుల్లిని విరివిగా వినియోగిస్తూ ఉంటారు. అయితే…
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
This website uses cookies.