Hair Tips : కేవలం పది రూపాయలతో ఇంట్లోనే ఈజీగా ఇలా చేయండి ..జుట్టు సిల్కీగా, స్మూత్ గా తయారవుతుంది ..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Hair Tips : కేవలం పది రూపాయలతో ఇంట్లోనే ఈజీగా ఇలా చేయండి ..జుట్టు సిల్కీగా, స్మూత్ గా తయారవుతుంది ..!

Hair Tips : చాలామంది జుట్టును ఎంతో కేర్ తీసుకుంటూ ఉంటారు. దానికోసం పార్లర్లకు వెళ్లి కెరోటిన్ ట్రీట్మెంట్ లాంటివి తీసుకుంటూ ఉంటారు. ఈ ట్రీట్మెంట్ ఎనిమిది నుంచి పదివేల వరకు ఖర్చు అవుతుంది. కానీ ఈజీగా ఇట్లోనే కేవలం పది రూపాయలతో కెరోటిన్ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. దానికోసం ముందుగా ఎనిమిది బెండకాయలను తీసుకోవాలి. బెండకాయలతో ప్యాక్ చేసుకుంటే జుట్టు సిల్కీగా ప్రకాశవంతంగా తయారవుతుంది. జీవం లేకుండా ఉన్న జుట్టు కుచ్చులాగా తయారవుతుంది. ఈ ప్యాక్ కోసం […]

 Authored By prabhas | The Telugu News | Updated on :20 November 2022,3:00 pm

Hair Tips : చాలామంది జుట్టును ఎంతో కేర్ తీసుకుంటూ ఉంటారు. దానికోసం పార్లర్లకు వెళ్లి కెరోటిన్ ట్రీట్మెంట్ లాంటివి తీసుకుంటూ ఉంటారు. ఈ ట్రీట్మెంట్ ఎనిమిది నుంచి పదివేల వరకు ఖర్చు అవుతుంది. కానీ ఈజీగా ఇట్లోనే కేవలం పది రూపాయలతో కెరోటిన్ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. దానికోసం ముందుగా ఎనిమిది బెండకాయలను తీసుకోవాలి. బెండకాయలతో ప్యాక్ చేసుకుంటే జుట్టు సిల్కీగా ప్రకాశవంతంగా తయారవుతుంది. జీవం లేకుండా ఉన్న జుట్టు కుచ్చులాగా తయారవుతుంది. ఈ ప్యాక్ కోసం ముందుగా 8 బెండకాయలు తీసుకొని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకోవాలి.

తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక బౌల్ లోకి తీసుకోవాలి. అందులో గ్లాసు నీళ్లు పోసి స్టవ్ పై పెట్టి గోరువెచ్చగా అయిన తర్వాత బెండకాయ ముక్కలను వేసి ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి. బెండకాయ ముక్కలు ఉడికిన తర్వాత దానిలో ఉండే జిగురు బయటకు వస్తుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. తర్వాత ఏదైనా క్లాత్ సహాయంతో బెండకాయ ముక్కలను వడగట్టుకోవాలి. తర్వాత ఇందులో రెండు స్పూన్ల కార్న్ ఫ్లోర్ వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని స్టవ్ మీద పెట్టి దగ్గర పడేంతవరకు ఐదు నిమిషాలపాటు కలుపుతూ ఉడికించుకోవాలి. తర్వాత స్టౌ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి.

hair tips use ladies finger hair pack hair silky and smoothly

hair tips use ladies finger hair pack hair silky and smoothly

చల్లారిన తర్వాత ఒక స్పూన్ ఆముదం వేసి బాగా కలుపుకోవాలి. ఆముదం లేకపోతే బాదం నూనె కానీ కొబ్బరి నూనె కానీ వేసుకోవచ్చు. ఈ ప్యాక్ ను పొడి జుట్టు లేదా ఆయిల్ జుట్టు మీద కూడా అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసేటప్పుడు జుట్టును చిన్న చిన్న పాయలుగా విడదీసి కుదుళ్ళ నుండి చివర్ల వరకు అప్లై చేసుకోవాలి. 40 నిమిషాల నుండి గంటపాటు ఆరనివ్వాలి. తర్వాత ఏదైనా షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా చేయడం వలన జుట్టు సిల్కీగా, మృదువుగా తయారవుతుంది. పార్లర్ కి వెళ్లి కెరోటిన్ ట్రీట్మెంట్ తీసుకున్న సరే అంత మంచి ఫలితం రాదు. పార్లర్ కి వెళ్లి అంత ఖర్చు పెట్టే బదులు ఇంట్లోనే పది రూపాయలతో ఇలా చేశారంటే మంచి రిజల్ట్ పొందుతారు. జుట్టు చాలా స్మూత్ గా తయారవుతుంది.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది