Home » Health » Hair Tips Use This Leaves Oil To Recover Your Hair
Health

Hair Tips : ఈ ఆకుల రసాన్ని రాసారంటే… ఊడిన ప్రతి వెంట్రుక తిరిగి వస్తుంది…

Authored By
aruna
The Telugu News | Published on: August 19, 2022, 5:00 pm
Advertisement

Hair Tips : ప్రస్తుతం జుట్టు రాలే సమస్య ఆడవారిలోనే కాదు మగవారిలో కూడా ఇబ్బందిగా మారుతుంది. ఆడవారికి జుట్టు రాలిపోవడం వలన జుట్టు మధ్య మధ్యలో ఖాళీలు రావడం జరుగుతుంది. మగవారిలో బట్టతల రావడం జరుగుతుంది. జుట్టు రాలడం మూడు రకాలుగా ఉంటుంది. సిక్ కావడం, జుట్టు లైట్ గా రాలడం, జుట్టు ఎక్కువగా రాలడం ఈ మూడు స్టేజ్ లలో జుట్టు రాలడం సమస్య ఉన్నట్లయితే ఈ చిట్కాను ఫాలో అయితే మంచి ఫలితం ఉంటుంది. చాలా చిట్కాలు ట్రై చేసి, ఆయిల్ కూడా ట్రై చేసిన ప్రయోజనం లేదు అనుకున్నవారు ఒకసారి ఇది ట్రై చేసి చూడండి. ఊడిన ప్రతి వెంట్రుక తిరిగి వస్తుంది.

Advertisement

ముందుగా దీనికోసం ఒక చిన్న ఉల్లిపాయను తీసుకొని దాన్ని పొట్టు తీసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయ జుట్టు రాలడం తగ్గించడంలో బాగా సహాయపడుతుంది. అలాగే జుట్టు నల్లగా అవ్వడానికి తెల్ల వెంట్రుకలు రాకుండా ఉండడానికి ఉల్లిపాయ బాగా సహాయపడుతుంది. అలాగే వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి పెట్టుకోవాలి. ఇది కొత్త జుట్టు పెరగడానికి సహాయపడుతుంది. తర్వాత ఒక గుప్పెడు మందార ఆకులను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఈ ఆకులు జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. కొత్తగా పొడవుగా పెరగడానికి మరియు జుట్టు సున్నితంగా ఉండడానికి ఈ ఆకులు బాగా సహాయపడతాయి. వీటన్నింటిని మిక్సీలో వేసుకొని ఒక అరకప్పు నీళ్లు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఈ పేస్టును ఒక గుడ్డలో వేసి జ్యూస్ లాగా వడకట్టుకోవాలి.

Hair Tips Use This Leaves Oil To Recover Your Hair

Advertisement

ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని జుట్టు కుదుర్ల నుంచి చివర్ల దాకా అప్లై చేసుకోవాలి. జుట్టు సిక్ అయిన వాళ్ళు, తక్కువ జుట్టు రాలుతున్నవారు, ఎక్కువ జుట్టు రాలుతున్న వారు కూడా ఈ చిట్కాను ట్రై చేయవచ్చు. వారానికి ఒకటి రెండు సార్లు ఉపయోగించడం వలన జుట్టు రాలడం తగ్గి ఊడిన ప్రతి వెంట్రుక తిరిగి వస్తుంది. ఈ మిశ్రమాన్ని ఆయిల్ హెయిర్ లేదా ట్రై హెయిర్ మీద కూడా అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసిన తర్వాత ఒక గంట ఆరనివ్వాలి. తర్వాత షాంపుతో కానీ కుంకుడుకాయలతో కానీ తలస్నానం చేయాలి. ఇలా చేస్తే జుట్టు చాలా సున్నితంగా నల్లగా నిగనిగలాడుతూ ఉంటుంది.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి