Hair Tips :చాలామందిలో జుట్టు రాలడం, చుండ్రు, తెల్ల జుట్టు లాంటి సమస్యలను మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఈ సమస్యకు కారణం వాతావరణం కాలుష్యం పోషక ఆహార లోపం లాంటి వాటి వలన జుట్టు రాలే సమస్య రోజురోజుకి ఎక్కువుతూ ఉంటుంది. జుట్టు రాలడం కొందరులో ఒక రకం. ఇంకొందరులో ఇంకొక రకం ఇలా రకరకాలుగా ఉంటుంది. చాలామందికి బాల్ హెడ్ కొందరికి సైడ్ జుట్టు లేకపోవడం, కొందరికి జుట్టు పల్చగా ఉండడం కొందరికి వయసు తరహా లేకుండానే తెల్ల జుట్టు రావడం ఇన్ఫెక్షన్స్ లాంటి వాటితో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ సమస్యలను తగ్గించుకోవడం కోసం ఎన్నో రకాల కెమికల్స్ ఉన్న ప్రొడక్ట్స్ ను వాడుతూ ఉంటారు. అయితే వీటిని వాడడం వలన వాటిలో ఉండే కెమికల్స్ ఎన్నో రకాల సైడ్ ఎఫెక్ట్స్ ను కలగజేస్తూ ఉంటాయి. అయితే అలాంటి వారికి ఎటువంటి
సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇంట్లో ఉండే వాటితోనే ఈ టిప్ ని పాటించినట్లయితే మీ జుట్టు ఆగకుండా పెరుగుతుంది. దానికోసం ఒక మీడియం సైజు ఉల్లిపాయను తీసుకొని దాని పైన పొట్టు తీసేసి శుభ్రంగా కడిగి దాన్ని మెత్తగా తురుముకోవాలి. లేదంటే మిక్సీ లో కూడా వేసి మెత్తని పేస్టులా పట్టుకోవచ్చు. దాని తర్వాత మూడించల అల్లం ముక్కలను తీసుకుని శుభ్రంగా కడిగి దానిని కూడా తురుముకోవాలి. లేదా దానిని కూడా మెత్తని పేస్టులా మిక్సీ జార్ లో వేసి చేసుకోవచ్చు. ఇక ఈ రెండిటిని ఒక క్లాత్ సహాయంతో వడకట్టుకోవాలి. తర్వాత దీనిలో ఒక చెంచా బ్లాక్ క్యాస్ట్రాయిల్ తీసుకోవాలి. బ్లాక్ కాస్ట్ ఆయిల్ లేదంటే మామూలు ఆముదం ఒక చెంచా తీసుకోవాలి. లేదంటే విటమిన్ ఈ క్యాప్సిల్స్ లేదా ఒక చెంచా బాదం నూనె అయినా సరే కలుపుకోవచ్చు..
వీటన్నిటినీ బాగా మిక్స్ చేసుకుని జుట్టు మొత్తానికి కుదుళ్ళ నుంచి చివర్ల వరకు అప్లై చేయవలసిన అవసరం ఉండదు.. కేవలం మాడుకి మాత్రమే అప్లై చేస్తే సరిపోతుంది. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఒక 60 నిమిషాల పాటు అలా వదిలేయాలి. తర్వాత ఏదైనా గాడ్త తక్కువ షాంపుతో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా చేయడం వలన అల్లం లోని అలాగే ఉల్లిపాయలు ఉండే యాంటీ ఆక్సిడెంట్ చుండ్రు, దురద, ఇన్ఫెక్షన్స్ లాంటి ఇబ్బందులను తగ్గిస్తుంది. వీటిలో ఉండే మెగ్నీషియం, సల్ఫర్, కాపర్, ఐరన్, మాంగనీస్ లాంటి ఖనిజాలు జుట్టు రాలడాన్ని ఆపి జుట్టు పొడవుగా, ఒత్తుగా పెరిగేలా చేస్తుంది. అలాగే తెల్ల జుట్టు ని నల్లగా మారుస్తుంది. అదేవిధంగా బాల్ హెడ్ జుట్టు పల్చగా ఉండి ఇబ్బంది పడుతున్న వారికి ఇది బాగా సహాయపడుతుంది..
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.