Headache : ప్రస్తుత కాలంలో మన ఉరుకుల పరుగుల జీవితంలో తలనొప్పి అనేది చాలా సాధారణ సమస్యగా మారింది అని చెప్పొచ్చు. అయితే ఈ తలనొప్పి సమస్య అనేది ఏ వయసులో వారికి అయినా రావచ్చు. అలాగే ఈ తలనొప్పి అనేది చిన్న పెద్ద తేడా లేకుండా అందరికీ వస్తుంది. దీంతో మన రోజువారి కార్యకలాపాలపై ఎంతో ప్రభావం పడుతుంది. అయితే వీటికి ఒత్తిడి మరియు ఆందోళన, అలసట, ఎక్కువ పని లేక ఏదైనా చెడు అలవాటు లాంటి ఎన్నో కారణాలు కూడా ఉండవచ్చు. ఈ తలనొప్పి అనేది కొన్ని కొన్ని సందర్భాల్లో భరించలేనంతగా వస్తుంది. ఈ లాంటి టైంలో చాలామంది పెయిన్ కిల్లర్ టాబ్లెట్లను ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఇలా చిటికి మాటికి వచ్చే తలనొప్పికి నొప్పిని తగ్గించడానికి తీసుకునే మందులు ఆరోగ్యం పై పేను ప్రభావం చూపుతున్నాయి. అలాగే ఈ పెయిన్ కిల్లర్ టాబ్లెట్లను వేసుకోవడం వలన సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అని వైద్యులు అంటున్నారు. అయితే ఈ లాంటి టైం లో తలనొప్పి వచ్చినప్పుడు కొన్ని ముఖ్యమైన ఇంటి నివారణ చిట్కాలను ప్రయత్నిస్తే, ఈ సమస్యను ఈజీగా దూరం చేసుకోవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అయితే ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు చూద్దాం…
హైడ్రేటెడ్ గా ఉండండి : ఈ తల నొప్పికి సాధారణ కారణం శరీరంలో నీరు అనేది లేకపోవడం. అందుకే మీరు ప్రతి రోజు 8 నుండి 10 గ్లాసుల నీటిని తాగడం వలన డిహైడ్రేషన్ ప్రమాదం తగ్గుతుంది. ఇక తలనొప్పి కూడా తగ్గిపోతుంది…
యోగ, ధ్యానం : ధ్యానం చేయటం వలన మానసిక ఆరోగ్యానికి చాలా మంచిది అని అంటారు. ఈ ధ్యానం అనేది సాధారణ రోజులలో కూడా చేస్తే మంచిది. అయితే వీటిని రోజు ఆచరించడం వలన ఒత్తిడి అనేది తగ్గి తలనొప్పి దూరం అవుతుంది…
నట్స్ తినండి : ఈ నట్స్ కూడా మానసిక ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే వాల్ నట్స్ మరియు బాదం పప్పులు, జీడిపప్పులు లాంటి వాటిని తీసుకోవడం వలన తలనొప్పి అనేది తగ్గిపోతుంది. ఎందుకు అంటే వాటిలో మేగ్నిషియం అనేది ఎక్కువ మొత్తంలో ఉంటుంది. దీనివలన తలనొప్పి అనేది దూరమవుతుంది…
అల్లం టీ : అల్లం టీ ని తాగడం వలన కూడా తలనొప్పి తగ్గిపోతుంది. అయితే ఈ అల్లం లో యాంటీ ఇన్ ప్లమెంటరీ గుణాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇవి తలనొప్పిని తగ్గిస్తాయి. సాధారణ రోజులలో కూడా అల్లం టీ చాలామందికి మానసిక నొప్పి నివారిణిగా పనిచేస్తుంది.
విశ్రాంతి : భరించలేని నొప్పి వచ్చినప్పుడు విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం. ఇది మనసును ప్రశాంతంగా ఉంచడంలో ఎంతో హెల్ప్ చేస్తుంది. అలాగే మీరు ప్రతి విషయాన్ని ఆలోచించకుండా వదిలేసి నిద్ర పోవడానికి ప్రయత్నించండి.
Carrot Juice : చలికాలం రానే వచ్చేసింది. ఈ కాలంలో పండ్లు మరియు కూరగాయలు ఎక్కువగా దొరుకుతాయి. అలాగే మార్కెట్లో ఎటు…
Karthika Masam : కార్తీక మాసంలో ఉసిరి దీపానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. అయితే ఈ కార్తీక మాసం లో చాలామంది…
GAIL Recruitment : గెయిల్ ఇండియా లిమిటెడ్ సీనియర్ ఇంజనీర్ మరియు ఇతర పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత…
Jupiter : వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరొక రాశికి సంచారం చేస్తూ…
AUS vs IND : ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (BGT) 2024-25 భారత్ మరియు ఆస్ట్రేలియా మధ్య…
BSNL : బీఎస్ఎన్ఎల్ నేషనల్ Wi-Fi రోమింగ్ సర్వీస్‌ను ప్రారంభించింది. BSNL యొక్క నేషనల్ వై-ఫై రోమింగ్ సర్వీస్ ఇప్పుడు…
నటీనటులు : వరుణ్ తేజ్ Varun Tej , మీనాక్షి చౌదరి Meenakshi Chaudhary, నోరా ఫతేహి Nora Fatehi…
Ycp : ఏపీలో కూటమి పార్టీ అధికారంలోకి రావడం మనం చూశాం. మూడు పార్టీలు కలిసి పోటీ చేయడంతో మంచి…
This website uses cookies.