
Health Benefits How to Get Rid of Sweat in Summer Reduces Bad Odor
Health Benefits : కొంతమంది ఎన్ని సార్లు స్నానం చేసినా చెమట కంపు కొడుతుంది కారణం శరీరంలో మలినాలు, టాక్సిన్స్ పేరుకుపోవడమే. అలాగే చెడు బ్యాక్టీరియా కూడా పెరిగితే చెమట దుర్వాసన వస్తుంది. దీంతో అనవసరమైన పౌడర్లు, బాడీ స్ప్రేలు అప్లయ్ చేస్తుంటాం. దీంతో తాత్కాలిక ఉపషమనం లభిస్తుంది తప్పితే పెద్దగా ప్రయోజనం ఉండదు. పైగా చెమట దుర్వాసనను నిర్లక్ష్యం చేస్తే దీర్ఘ కాలిక వ్యాధులకు దారితీస్తుంది. అయితే ప్రధానంగా శరీరం నుండి దుర్వాసన రావడానికి ఆహారపు అలవాట్లేనని వైద్య నిపుణులు చెబుతున్నారు.
అధికమొత్తంలో మసాలాలతో కూడిన ఆహార పదార్ధాలు తీసుకోవడం వలన శరీరంలో సల్ఫర్ ఉత్పత్తి అయి చర్మ రంద్రాల ద్వారా బయటకు పంపబడుతుంది. దీంతో దుర్వాసన వస్తుంది. అలాగే ఆల్కహాల్ ఎక్కువగా తీసుకునేవారిలో కూడా చెమట ఎక్కువగా రావడం కారణంగా కంపు కొడుతుంది.అలాగే జంక్ ఫుడ్ రెగ్యూలర్ గా తినడం వల్ల శరీరంలో కొవ్వు శాతం పెరిగి అధిక మొత్తంలో చెమట వస్తుంది. తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉండే ఆహార పదార్ధాలు తీసుకోవడం వలన రక్తంలో కీటోన్స్ ఉత్పత్తి అవుతాయి. ఇవి కూడా శరీర దుర్వాసనకు కారణమవుతాయి.
Health Benefits How to Get Rid of Sweat in Summer Reduces Bad Odor
అలాగే పాల పదర్థాములకు సంబంధించినవి ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల శరీరంలో విడుదలయ్యే హైడ్రోజన్ సల్ఫైడ్, మిథైల్ మోర్కాప్టన్ వలన చెమట కూడా ఎక్కువ మొత్తంలో వచ్చి దుర్వాసనకు కారణమవుతుంది. కాగా సిగరెట్ పొగ స్వేద గంథ్రులతో కలిసి భరించలేని వాసన వచ్చేలా చేస్తుంది.అయితే వ్యక్తిగత పరిశుభ్రత, ఆహారంలో మార్పులు చేసుకోవడం వల్ల ఈ సమస్యను తగ్గించుకోవచ్చు. శరీరంలో ఉన్న మలినాలను బయటకు పంపితే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. అందుకే ఎక్కువగా మోతాదులో వాటర్ తాగుతుండాలి. జంక్ ఫుడ్, మసాలాలు అధికంగా తీసుకోకుండా తాజా కూరగాయలు, ఫ్రూట్స్ తీసుకోవాలి. రోజుకు రెండు సార్లు స్నానం చేయడం వల్ల చెమట వల్లే వచ్చే దుర్వాసనను అరికట్టవచ్చు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.