Home » Health » Health Benefits Of Cloves 2
Health

Cloves : లవంగాలతో ఈ సమస్యలన్నీటికి ఈజీగా చెక్ పెట్టొచ్చు… ఎలాగో తెలుసా…!!

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Published on: December 5, 2024, 10:00 am
Advertisement

Cloves : లవంగాలు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ లవంగాలు అనేవి మన శరీరానికి ఎన్నో పోషకాలను ఇస్తుంది. ఈ లవంగాలలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే మాత్రం అస్సలు వదిలిపెట్టరు అని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అయితే ఈ లవంగాలలో ఐరన్ మరియు కాల్షియం, ఫాస్ఫరస్, సోడియం, పొటాషియం, కార్బోహైడ్రేట్లు, హైడ్రాలిక్ యాసిడ్,విటమిన్ ఏ, మాంగనీస్ లాంటి ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. ఈ లవంగాల వాడకం అనేది మీ జీర్ణక్రియను ఎంతో మెరుగుపరుస్తుంది. అలాగే కీళ్ల నొప్పులు మరియు వికారం, గ్యాస్ట్రిక్, కడుపునొప్పి, దంత ఆరోగ్య సమస్యలను కూడా నయం చేస్తుంది. అయితే మీరు రోజుకు ఒక లవంగాన్ని నమిలి తీసుకోవడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు అని అంటున్నారు నిపుణులు. అలాగే ప్రతిరోజు రెండు లవంగాలను ఉదయాన్నే నమిలి తీసుకోవడం వలన జీర్ణక్రియ అనేది మెరుగవుతుంది అని అంటున్నారు. అలాగే ఎంతో తీవ్రమైన దగ్గుతో ఇబ్బంది పడుతున్న వారికి కూడా ఈ లవంగం అనేది చాలా చక్కగా పనిచేస్తుంది…

Advertisement

Cloves : లవంగాలతో ఈ సమస్యలన్నీటికి ఈజీగా చెక్ పెట్టొచ్చు… ఎలాగో తెలుసా…!!

ఈ లవంగాలకు దంత సమస్యలను తగ్గించే శక్తి కూడా ఉంది. అలాగే ఈ లవంగాలలో ఉండే యాంటీ జింజివిటిస్ మరియు యాంటీ ప్లేక్ లాంటి లక్షణాలు దంతాలను ఆరోగ్యంగా ఉంచడంలో హెల్ప్ చేస్తాయి. అలాగే ఈ లవంగాలు అనేవి నోటిలో ఉన్న సూక్ష్మజీవులను తగ్గించటంలో కూడా హెల్ప్ చేస్తుంది. అంతేకాక చిగుళ్లలో ఇన్ఫెక్షన్ మరియు మంట, నొప్పి నుండి కూడా ఉపశమనాన్ని కలిగిస్తుంది. అంతేకాక ఈ లవంగాలకు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించే శక్తి కూడా ఉన్నది. దీనికోసం లవంగాలతో టీ తయారు చేసుకొని తాగాలి…

Advertisement

లవంగాల టీ తయారి కోసం ఒక గ్లాసు నీటిలో 8 నుండి 10 లవంగాలు వేసుకొని బాగా మరిగించాలి. ఆ నీరు కొద్దిగా చల్లారిన తర్వాత ఫిల్టర్ చేసుకొని తాగాలి. ఇలా చేయటం వలన అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు అని అంటున్నారు. ఈ లవంగంతో చర్మ సమస్యలకు కూడా ఈజీగా చెక్ పెట్టచ్చు అని అంటున్నారు. దీనికోసం లవంగాలను మెత్తగా నూరి దానిని మొటిమల మీద రాస్తే అది వెంటనే తగ్గిపోతుంది. అలాగే మీకు వాంతి వస్తున్నట్టు అనిపించినప్పుడు కూడా ఈ లవంగం వాసన చూడండి. లేకుంటే లవంగాలు నోట్లో వేసుకుని చప్పరించిన సరిపోతుంది.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి