Dates : ఖర్జూరాలను రోజు ఎందుకు తినాలి...? వీటిని తీసుకోవడం వల్ల కలిగే 5 ప్రయోజనాలు ఏంటి...??
Dates : ఖర్జూరాలలో ఎన్నో రకాల పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అందుకే నిత్యం ఖర్జూరాలను తీసుకోవాలి అని వైద్యులు ఎప్పుడు చెబుతూ ఉంటారు. అయితే ఈ ఖర్జూరాలు అనేవి ఆరోగ్యాన్ని కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ ఖర్జూరంలో ఐరన్, కాల్షియం, మినరల్స్, అమినో యాసిడ్స్,ఫాస్పరస్, విటమిన్లు సమృద్ధిగా దొరుకుతాయి. ఈ ఖర్జూరాలను తీసుకోవటం వలన మన శరీరానికి ఎంతో ఆరోగ్యకరమైన కేలరీలు అనేవి లభిస్తాయి. నిజం చెప్పాలంటే ఆరోగ్యకరమైన ఆహారంలో తీపి పదార్థాలు అసలు ఉండవు. కానీ ఈ ఖర్జూరం మాత్రం సహజమైన చక్కెర కలిగి ఉంటుంది. ఇది మన ఆరోగ్యానికి మేలు చేసే పండు అని కూడా చెప్పొచ్చు. అంతేకాక శరీరానికి ఎంతో అవసరమయ్యే ఎన్నో రకాల పోషకాలు కూడా దీనిలో ఉన్నాయి. అయితే వీటిని ఉదయాన్నే ఆహారంలో తీసుకోవడం లేక పాలల్లో కలిపి తీసుకోవడం వలన శరీరానికి లభించే పోషకాలు డబల్ అవుతాయి అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అయితే రోజు ఖర్జూరాలను ఎందుకు తినాలి.? వీటిని తినడం వలన కలిగే 5 ప్రయోజనాలు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం…
ఈ ఖర్జూరంలో ఉన్నటువంటి లవణాలు మరియు పోషకాలు ఎముకలను దృఢంగా ఉంచటంలో కూడా హెల్ప్ చేస్తాయి. దీనిలో ఉండే కాల్షియం, సెలీనియం, మాంగనీస్, కాపర్ ఎముకల ఆరోగ్యాన్ని ఎంతో బలంగా చేస్తాయి. అనగా ఖర్జూరాలు తీసుకుంటే శరీరం అనేది ఎంతో దృఢంగా తయారవుతుందన్నమాట. రోగనిరోధక శక్తిని పెంచుతాయి :- ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా ఎంతో హెల్ప్ చేస్తాయి. వీటిలో గ్లూకోస్ మరియు ఫ్రక్టోజ్ పుష్కలంగా ఉంటాయి. కాబట్టి వీటిని తీసుకోవడం వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే మారుతున్నటువంటి వాతావరణం లో వచ్చే ఇన్ఫెక్షన్ ప్రమాదాల నుండి కూడా ఈజీగా బయటపడవచ్చు…
చర్మానికి మేలు చేస్తాయి :-ఖర్జూరం అనేది చర్మానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఖర్జూరాలను డైలీ తినడం వలన ఫేస్ గ్లో తో పాటు చర్మం ఎంతో కాంతివంతంగా మేరుస్తుంది. సహజంగా మెరిసే చర్మాని పొందాలి అని అనుకునేవారు ఖర్జూరాలను నిత్యం ఖచ్చితంగా తీసుకోవాలి. బరువు పెరగటంలో హెల్ప్ చేస్తుంది :- మీరు గనక తక్కువ బరువు కలిగి ఉంటే ఈ ఖర్జూరాలు బరువు పెరిగేందుకు కూడా హెల్ప్ చేస్తాయి. వీటిలో ఉండే సహజ చక్కెర మరియు విటమిన్లు బరువును పెంచడంలో సహాయపడతాయి. మీరు చాలా సన్నగా ఉన్నట్లయితే ఖర్జూరాలను రోజు నాలుగు తీసుకోవటం మొదలు పెట్టండి. కొంతకాలంలోనే మీరు బరువు పెరుగుతారు.
Dates : ఖర్జూరాలను రోజు ఎందుకు తినాలి…? వీటిని తీసుకోవడం వల్ల కలిగే 5 ప్రయోజనాలు ఏంటి…??
తక్షణ శక్తి ఇచ్చే పండు :- ఖర్జూరాలలో తగిన మొత్తంలో ఫ్రక్టోజ్,సుక్రోజ్, గ్లూకోజ్ లు ఉంటాయి. వీటిని తినడం వలన వెంటనే శక్తి అనేది లభిస్తుంది. అలాగే నీరసం మరియు మలబద్ధకం లాంటి సమస్యలు కూడా తొలగిపోతాయి…
Dil Raju : ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించన తమ్ముడు జూలై 4న విడుదల కానుంది. ఈ మూవీ…
Jio Recharge : జియో వినియోగదారుల కోసం అద్భుతమైన ఐడియల్ రీఛార్జ్ ప్లాన్ల ను ప్రకటించింది. ప్రస్తుతం, చాలా మంది…
Komatireddy Venkat Reddy : హరీష్ రావు ఎవరో తెలియదంటూ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…
Chandrababu : తెలుగు రాష్ట్రాల్లో నది నీటి ప్రాజెక్టులపై తాజాగా జరుగుతున్న చర్చలో బనకచర్ల ప్రాజెక్ట్ కీలకంగా మారింది. తెలంగాణ…
Prices : కేంద్ర ప్రభుత్వం గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్టీ) స్లాబ్లలో పెద్ద ఎత్తున మార్పులు చేయాలని యోచిస్తోంది.…
Fish Venkat : తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన హాస్య విలన్ పాత్రలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఫిష్…
Ys Jagan : అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తూ చిత్తుగా ఓటమి చవిచూసిన జగన్..ఇప్పుడు పూర్తిస్థాయిలో ప్రజల్లోకి వెళ్లాలని డిసైడ్ అయ్యాడు. ఐదేళ్లలో…
Former MLCs : తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి నిత్యం సొంత పార్టీ నేతలను ఏదొక సమస్య ఎదురవుతూనే ఉంటుంది. ముఖ్యంగా…
This website uses cookies.