Dates : ఖర్జూరాలను రోజు ఎందుకు తినాలి…? వీటిని తీసుకోవడం వల్ల కలిగే 5 ప్రయోజనాలు ఏంటి…?? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Dates : ఖర్జూరాలను రోజు ఎందుకు తినాలి…? వీటిని తీసుకోవడం వల్ల కలిగే 5 ప్రయోజనాలు ఏంటి…??

Dates : ఖర్జూరాలలో ఎన్నో రకాల పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అందుకే నిత్యం ఖర్జూరాలను తీసుకోవాలి అని వైద్యులు ఎప్పుడు చెబుతూ ఉంటారు. అయితే ఈ ఖర్జూరాలు అనేవి ఆరోగ్యాన్ని కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ ఖర్జూరంలో ఐరన్, కాల్షియం, మినరల్స్, అమినో యాసిడ్స్,ఫాస్పరస్, విటమిన్లు సమృద్ధిగా దొరుకుతాయి. ఈ ఖర్జూరాలను తీసుకోవటం వలన మన శరీరానికి ఎంతో ఆరోగ్యకరమైన కేలరీలు అనేవి లభిస్తాయి. నిజం చెప్పాలంటే ఆరోగ్యకరమైన ఆహారంలో తీపి పదార్థాలు అసలు ఉండవు. […]

 Authored By ramu | The Telugu News | Updated on :10 September 2024,12:00 pm

Dates : ఖర్జూరాలలో ఎన్నో రకాల పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అందుకే నిత్యం ఖర్జూరాలను తీసుకోవాలి అని వైద్యులు ఎప్పుడు చెబుతూ ఉంటారు. అయితే ఈ ఖర్జూరాలు అనేవి ఆరోగ్యాన్ని కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ ఖర్జూరంలో ఐరన్, కాల్షియం, మినరల్స్, అమినో యాసిడ్స్,ఫాస్పరస్, విటమిన్లు సమృద్ధిగా దొరుకుతాయి. ఈ ఖర్జూరాలను తీసుకోవటం వలన మన శరీరానికి ఎంతో ఆరోగ్యకరమైన కేలరీలు అనేవి లభిస్తాయి. నిజం చెప్పాలంటే ఆరోగ్యకరమైన ఆహారంలో తీపి పదార్థాలు అసలు ఉండవు. కానీ ఈ ఖర్జూరం మాత్రం సహజమైన చక్కెర కలిగి ఉంటుంది. ఇది మన ఆరోగ్యానికి మేలు చేసే పండు అని కూడా చెప్పొచ్చు. అంతేకాక శరీరానికి ఎంతో అవసరమయ్యే ఎన్నో రకాల పోషకాలు కూడా దీనిలో ఉన్నాయి. అయితే వీటిని ఉదయాన్నే ఆహారంలో తీసుకోవడం లేక పాలల్లో కలిపి తీసుకోవడం వలన శరీరానికి లభించే పోషకాలు డబల్ అవుతాయి అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అయితే రోజు ఖర్జూరాలను ఎందుకు తినాలి.? వీటిని తినడం వలన కలిగే 5 ప్రయోజనాలు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం…

Dates ఎముకలను బలంగా చేయడంలో ప్రభావంతంగా పని చేస్తాయి

ఈ ఖర్జూరంలో ఉన్నటువంటి లవణాలు మరియు పోషకాలు ఎముకలను దృఢంగా ఉంచటంలో కూడా హెల్ప్ చేస్తాయి. దీనిలో ఉండే కాల్షియం, సెలీనియం, మాంగనీస్, కాపర్ ఎముకల ఆరోగ్యాన్ని ఎంతో బలంగా చేస్తాయి. అనగా ఖర్జూరాలు తీసుకుంటే శరీరం అనేది ఎంతో దృఢంగా తయారవుతుందన్నమాట.  రోగనిరోధక శక్తిని పెంచుతాయి :- ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా ఎంతో హెల్ప్ చేస్తాయి. వీటిలో గ్లూకోస్ మరియు ఫ్రక్టోజ్ పుష్కలంగా ఉంటాయి. కాబట్టి వీటిని తీసుకోవడం వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే మారుతున్నటువంటి వాతావరణం లో వచ్చే ఇన్ఫెక్షన్ ప్రమాదాల నుండి కూడా ఈజీగా బయటపడవచ్చు…

చర్మానికి మేలు చేస్తాయి :-ఖర్జూరం అనేది చర్మానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఖర్జూరాలను డైలీ తినడం వలన ఫేస్ గ్లో తో పాటు చర్మం ఎంతో కాంతివంతంగా మేరుస్తుంది. సహజంగా మెరిసే చర్మాని పొందాలి అని అనుకునేవారు ఖర్జూరాలను నిత్యం ఖచ్చితంగా తీసుకోవాలి. బరువు పెరగటంలో హెల్ప్ చేస్తుంది :- మీరు గనక తక్కువ బరువు కలిగి ఉంటే ఈ ఖర్జూరాలు బరువు పెరిగేందుకు కూడా హెల్ప్ చేస్తాయి. వీటిలో ఉండే సహజ చక్కెర మరియు విటమిన్లు బరువును పెంచడంలో సహాయపడతాయి. మీరు చాలా సన్నగా ఉన్నట్లయితే ఖర్జూరాలను రోజు నాలుగు తీసుకోవటం మొదలు పెట్టండి. కొంతకాలంలోనే మీరు బరువు పెరుగుతారు.

Dates ఖర్జూరాలను రోజు ఎందుకు తినాలి వీటిని తీసుకోవడం వల్ల కలిగే 5 ప్రయోజనాలు ఏంటి

Dates : ఖర్జూరాలను రోజు ఎందుకు తినాలి…? వీటిని తీసుకోవడం వల్ల కలిగే 5 ప్రయోజనాలు ఏంటి…??

తక్షణ శక్తి ఇచ్చే పండు :- ఖర్జూరాలలో తగిన మొత్తంలో ఫ్రక్టోజ్,సుక్రోజ్, గ్లూకోజ్ లు ఉంటాయి. వీటిని తినడం వలన వెంటనే శక్తి అనేది లభిస్తుంది. అలాగే నీరసం మరియు మలబద్ధకం లాంటి సమస్యలు కూడా తొలగిపోతాయి…

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది