Red Spinach Leaves : ఆకుకూరలు మన ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. అందుకే రోజు ఏదో ఒక ఆకుకూరను తీసుకుంటే మన శరీరంకి అవసరమైన పోషకాలు కూడా అందుతాయి. అయితే మీకు తోటకూర గురించి తెలుసు. కానీ ఎర్ర తోటకూర గురించి ఎప్పుడైనా విన్నారా. ఈ ఎర్ర తోటకూరలో కూడా ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఈ ఆకు కూరను తినడం వలన ఒత్తిడి అనేది తగ్గుతుంది. వాస్తవానికి ఈ ఎర్ర తోటకూరలో విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ బి, కాల్షియం, బాస్వరం, పొటాషియం, మెగ్నీషియం, రాగి, మాంగనీస్, జింక్, ఐరన్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, మరియు ప్రోటీన్ లాంటి ఎన్నో పోషకాలు లభిస్తాయి.
ఈ ఎర్ర తోటకూరలో విటమిన్లు మరియు ఖనిజాలు, ఫైబర్ అనేవి పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని పోషించి మొత్తం ఆరోగ్యానికి కూడా ఎంతో హెల్ప్ చేస్తాయి. అయితే ఈ ఎర్ర తోటకూరలో ఉండే ఆంథోసైనిన్ అనే సమ్మేళనం శరీరాన్ని ఆక్సీకరణ నుండి కాపాడుతుంది. అలాగే దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాలను కూడా తగ్గిస్తుంది. ఈ ఎర్ర తోటకూరలో ఉండే అధిక పొటాషియం కంటెంట్ రక్తపోటును తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. అలాగే నైట్రేట్ కంటెంట్ ఆరోగ్యకరమైన రక్త ప్రవాహాన్ని కూడా రక్షిస్తుంది. అలాగే గుండె ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. అంతేకాక షుగర్ సమస్యతో బాధపడేవారు తమ రోజువారి ఆహారంలో ఈ ఎర్ర తోట కూరను చేర్చుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అయితే ఒక కప్పు ఎర్ర తోటకూర లో 250 mg కాల్షియం అనేది ఉంటుంది. అలాగే దీనిలో విటమిన్ సి కూడా సమృద్ధిగా ఉంటుంది. అందుకే దీనిని రోజు తీసుకుంటే ఎముకలు మరియు దంతాలు ఎంతో ఆరోగ్యంగా ఉంటాయి..
ఈ ఎర్ర తోటకూరలో ఉండే పొటాషియం శరీరంలోని సోడియం ప్రభావాలను కూడా నియంత్రిస్తుంది. ఇది అధిక రక్తపోటును అదుపులో ఉంచుతుంది. అలాగే హైబీపీ సమస్యతో బాధపడే వారు కూడా ఈ ఆకుకూరను డైట్ లో చేర్చుకుంటే బీపీ అనేది నార్మల్ గా ఉంటుంది అని వైద్య నిపుణులు అంటున్నారు. అందుకే ఈ ఎర్ర తోటకూరను వారంలో ఒకటి లేక రెండు సార్లు అయినా తినాలని అంటున్నారు నిపుణులు. ఇది శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా నియంత్రిస్తుంది. అలాగే గుండె ఆరోగ్యాన్ని కూడా ఎంతగానో మెరుగుపరుస్తుంది. అలాగే మధుమేహ వ్యాది గ్రస్తులు కూడా ఈ ఎర్ర తోటకూరను తీసుకుంటే రక్తంలోని చక్కెర స్థాయిలు కంట్రోల్లో ఉంటాయి. అంతేకాక దృష్టి సమస్యలను కూడా నియంత్రిస్తుంది. అలాగే కంటి యొక్క ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. దీనిలో కాల్షియం కూడా సమృద్ధిగా ఉంటుంది. కాబట్టి ఎముకల ఆరోగ్యం బాగుంటుంది…
Skin Care : ప్రస్తుత కాలంలో మార్కెట్లో చర్మ సంరక్షణ కోసం ఎన్నో రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉంటున్నాయి. అదే టైంలో…
Aadhar Update : ఆధార్ కార్ ను అప్డేట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఇంకా షరతులు ఉంటాయి. ఐతే…
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
This website uses cookies.