kiwi Fruit : ఈ పండు తినటానికి చాలా రుచిగా, పుల్లగా ఉంటుంది. ఈ పండు పేరు కివి ఫ్రూట్. టీవీ ఫ్రూట్ గురించి మనందరికీ తెలుసు. దీనివల్ల ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే కివి ఫ్రూటు పోషకాలకు గని అని చెప్పవచ్చు. ఈ కివి పండులో విటమిన్ ఇ, విటమిన్ సి, విటమిన్ కె, ఫైబర్, పోలేట్, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు వంటి పోషక విలువలు పుష్కలంగా ఉన్నాయి. కివి పండు తింటే శరీరంలో రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. తే కాదు చర్మాన్ని సంరక్షించుటకు ఆరోగ్యంగా ఉంచుటకు కూడా ఎంతో సహకరిస్తుంది. గుండె జబ్బులు ప్రమాదాన్ని కూడా అరికట్టుతుంది. బరువు తగ్గాలి అనుకునే వారికి ఇది మంచి ఔషధం. ఈ అద్భుతమైన కివి పండుని మీ రోజు వారి ఆహారంలో చేర్చుకుంటే… ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చు అని తెలుసుకొందాం…
ఈ కివి పండులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఫైబర్ ఉండడం వల్ల మలబద్ధకాన్ని కూడా నివారించవచ్చు. తద్వారా జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. ఇవి పండులో ఆక్టి నీడిన్ ఎంజాయ్ ఉంటుంది. ఇది ప్రోటీన్ లను విచ్చిన్నం చేయడంలో ఉపయోగపడుతుంది. జీర్ణ క్రియను సులభతరం చేస్తుంది. ఈ కివి పండులో సెరోటినిన్ అనే న్యూరో ట్రాన్స్ మీటర్, నిద్రను ప్రోత్సహించడంలో ఉపయోగపడుతుంది. అధ్యయనాల ప్రకారం, కివి పండు తినడం వల్ల నిద్ర నాణ్యత, నిద్ర వ్యవధి మెరుగుపడుతుంది.
ఈ కివి పండులో విటమిన్ సి,యాంటీ ఆక్సిడెంట్లు ఆస్తమా లక్షణాలు తగ్గించడంలో సహాయపడతాయి. కొన్ని అధ్యయనాల ప్రకారం కివి పండు తినడం వల్ల శ్వాసలోపం, దగ్గు తగ్గుతుంది. ఇవి పండులో యాంటీ ఆక్సిడెంట్లు, పైటోకెమికల్స్ ఉంటాయి. ఇవి క్యాన్సర్ కణాలు పెరుగుదలను నిరోధించడంలో కూడా సహాయపడుతుంది. పరిశోధనల ప్రకారం, పండు తినడం వల్ల కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అని నిరూపించబడింది.
ఈ కివి పండులో క్యాలరీలు తక్కువగా ఉంటాయి ఫైబర్ అధికంగా ఉంటుంది. నా బరువు తగ్గడానికి ఒక మంచి ఔషధం. తగ్గాలి అనే వారికి గొప్ప ఆహారం. ఫైబర్ ఉండడంవల్ల ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంటుంది. ఇది అతిగా తినడాన్ని తగ్గిస్తుంది. కివి పండులో గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. రక్తంలో చక్కర స్థాయిలను త్వరగా పెంచవు. షుగర్ ఉన్నవారికి చక్కెరలో రక్తం స్థాయిలను నియంత్రించుటకు ఇది ఒక మంచి పండు. పేషెంట్ వాళ్లు ఈ కివి పండును నిరభ్యంతరంగా తినవచ్చు.
కివి పండ్ల లో కంటి ఆరోగ్యానికి ముఖ్యమైన లుటీన్, జియాక్సంతిన్ ఏ ఆంటీ ఆక్సిడెంట్ లో పుష్కలంగా ఉంటాయి. వయసుకు సంబంధించిన మచ్చల క్షీణత (AMD), కంటి శుక్లo వంటి కంటి సమస్యల ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా ఉపయోగపడుతుంది. ఇవి పండుల విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. కొల్లాజన్ ఉత్పత్తికి విటమిన్ సి చాలా అవసరం. చర్మాన్ని యవ్వనంగా, ఆరోగ్యంగా ఉంచడంలో ఉపయోగపడుతుంది.
Sreshti Varma : కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ Johnny Master శ్రేష్టి Sreshti Varma విషయం తెలిసిందే. తనని వాడుకున్నాడని…
Vijayasai Reddy : పార్లమెంటు బడ్జెట్ సమావేశాలకు కొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉండగా, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్సిపి)…
PM Kisan : రైతులకు కేంద్రం శుభవార్త. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద, అర్హత…
AIYF : రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల వయోపరిమితిని పెంచే ప్రతిపాదనకు ప్రయత్నాలు చేస్తున్నదని, ఈ ప్రతిపాదనను విరమించుకోవాలని అఖిల భారత…
Ysrcp : విజయ సాయి రెడ్డి రాజకీయాల నుంచి వైదొలగాలని తీసుకున్న నిర్ణయంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నాయకుడు,…
RBI : నేటి ప్రపంచంలో వివిధ ప్రభుత్వ సౌకర్యాలు, రాయితీలు మరియు ఆర్థిక సేవలను పొందేందుకు బ్యాంకు ఖాతా కలిగి…
Clove Powder : మనం తరచూ పాలని తాగుతూ ఉంటాం. తలలో పోషక విలువలు చాలా ఎక్కువగానే ఉంటాయి. అవి,…
Winter Health : కొంతమందికి సీజన్లు మారినప్పుడు , కాలానుగుణంగా వచ్చే శరీరంలోని మార్పులు తమ శరీరంలోని ఇమ్యూనిటీ బలహీనపడుతుంది.…
This website uses cookies.