
Health Benefits of vakkaya fruits In Telugu
Health Benefits : వాక్కాయను క్రేన్ బెర్రీస్ అని కూడా పిలుస్తారు. ఇది ఎక్కువగా అడవులలో పెరుగుతుంది. వానాకాలంలో కొన్ని రోజులు మాత్రమే కాయలు కాస్తుంది. వాక్కాయలతో పప్పు, పచ్చడి, పులిహోర వంటి వాటిని చేస్తారు. ఇది వగరుగా, పుల్లగా ఉంటుంది. అందుకే దీన్ని చింతకాయకు తక్కువ ఉసిరికాయకు ఎక్కువ అని మన పెద్దలు అంటూ ఉంటారు. ఈ చెట్టు పువ్వులు తెల్లగా నక్షత్రాకారంలో మంచి సువాసనతో గుత్తులు గుత్తులుగా పూస్తాయి. కాయలు కూడా అంగుళం పొడవులో అండాకారంలో గుత్తులుగా కాస్తాయి. కాయలు మొదట ఆకు పచ్చగా ఉండి ఆ తర్వాత గులాబీ రంగులోకి వస్తాయి.
వాక్కాయలో పెర్టిన్ ఎక్కువగా ఉండడం వలన జామ్, జెల్లిలు వంటి వాటిని తయారు చేస్తారు. వాక్కాయలో ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఈ పండులో విటమిన్ ఏ, సి, ఫైబర్, క్యాల్షియం, ఫాస్ఫరస్, ఆస్కార్బిక్ ఆమ్లం ఎక్కువగా ఉంటాయి. ఆస్కార్బిక్ ఆమ్లం కడుపునొప్పి, మలబద్ధకం వంటి సమస్యలను తగ్గిస్తాయి. అంతేకాకుండా జ్వరం, డయేరియా, శరీర సమస్యలను కూడా తగ్గించడంలో బాగా పనిచేస్తాయి. వాక్కాయలలో యాంటీ మైక్రో బయల్ లక్షణాలు ఉండటం వలన ఒత్తిడి, ఆందోళన వంటి వాటిని దూరం చేసి మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది.
Health Benefits of vakkaya fruits In Telugu
డయాబెటిస్ ఉన్నవారికి వాక్కాయ బాగా పనిచేస్తుంది. వాక్కాయ ఆకులతో కషాయాన్ని తయారు చేసుకుని రోజుకి రెండుసార్లు తీసుకుంటే జ్వరం తగ్గుతుంది. అలాగే గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. క్యాన్సర్ కణాల మీద పోరాటం చేస్తుంది. వాక్కాయ చెట్టులో పండు, ఆకులు, బెరడు ఔషధంగా పనిచేస్తాయి. ఈ పండును ఎక్కువగా ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు. నిద్రలేమి సమస్యలతో బాధపడే వారికి ఇది మంచి ఔషధంలా పనిచేస్తుంది. బాగా దాహంగా అనిపించినప్పుడు వాక్కాయను తింటే దప్పిక తీరుతుంది. గొంతు నొప్పిని తగ్గిస్తుంది. ఈ సీజన్లో విరివిగా దొరికే వాక్కాయలను పప్పు, పచ్చడి చేసుకొని తింటే ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
This website uses cookies.