Health Benefits : బొగ్గు గనుల్లో పనిచేసే వారికి అనేక అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. ఈ మైనింగ్ వర్క్స్ అనేది రెండు రకాలుగా ఉంటాయి. ఓపెన్ కాస్ట్ మైన్స్, అండర్ గ్రౌండ్ మైన్స్. ఈ అండర్ గ్రౌండ్ మైనింగ్ చేసే వాళ్ళకి ఎక్కువగా అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. గుహలాగ ఉండే గాలి ఆడని ప్రదేశంలో ఎక్కువసేపు పనిచేయాల్సి వస్తుంది. దీనివల్ల వాళ్లకి ఆక్సిజన్ అనేది సరిగ్గా ఉండదు. బ్రెయిన్ డెఫిషియన్సీ కూడా వస్తుంది. ఎందుకంటే కార్బన్ డయాక్సైడ్ ఎక్కువగా పీల్చుకోవడం వలన డస్ట్ కూడా ఊపిరితిత్తులలోకి ఎక్కువగా వెళ్ళిపోతుంది. ఇలాంటి వారికి లంగ్స్ ఎఫెక్ట్ అవడం, సిఓపిడి సమస్యలు, నిమోనియా రావడం వంటి సమస్యలు, దగ్గు రావడం ఎక్కువగా వస్తూ ఉంటాయి.
అండర్ గ్రౌండ్ లో మైనింగ్ పనిచేసే వాళ్లు ఎక్కువగా బరువు పనులు చేస్తూ ఉంటారు. అందువలన వారికి నడుంనొప్పి, కాళ్ల నొప్పులు ఎక్కువగా వస్తుంటాయి. అలాగే ఎక్కువ గంటలు నిలబడి పని చేయడం వలన కూడా ఇలా అవుతుంది. మైన్స్ లో వర్క్ చేసే వాళ్ళు ఇవి తింటే ఎక్కువ గంటలు యాక్టివ్ గా ఉండి పని చేయగలుగుతారు. అందుకనే వీళ్ళకి రోజు ఒక కొబ్బరి చెక్క, నానబెట్టిన వేరుశనగ గుళ్ళు 10, 15 ఖర్చురాలు తినాలి. వీటితోపాటు రెండు జామకాయలు, ఒకటి రెండు అరటి పండ్లు తినాలి. ఇలా చేస్తే దీర్ఘ రోగాలు రాకుండా ఇది సపోర్ట్ చేస్తుంది. మైన్స్ లో వర్క్ చేసేటప్పుడు వాటర్ ఎక్కువ త్రాగాలి. ఒక్కసారే మరిన్ని తాగకుండా కొద్దికొద్దిగా తాగుతూ ఉండాలి. ఇలా తాగితే బాడీ డీహైడ్రేషన్ కి గురికాకుండా ఉంటుంది.
మైన్స్ లో పని చేసేటప్పుడు దుమ్ము ధూళి ఎక్కువగా ఉండడం వలన అదంతా లోపలికి వెళ్లకుండా ముక్కు లోని వెంట్రుకలు అడ్డుకుంటాయి. ఈ ఫిల్టర్స్ గా పనిచేస్తాయి. ముక్కులో ప్రతిరోజు వాటర్ పోసి శుభ్రం చేయాలి. ఇలా చేస్తే డస్ట్ అంత బయటకు వెళ్ళిపోతుంది. ఇంటికి వచ్చిన తర్వాత గోరువెచ్చని నీళ్లలో కొంచెం పసుపు వేసి జలనేతి చేసేస్తే ముక్కు రంధ్రాలో ఉన్న డస్ట్ మొత్తం వచ్చేస్తుంది. ప్రాణాయామం చేస్తే లంగ్స్ అంతా శుభ్రం అవుతాయి. ఇలా చేయడం వలన ఆరోగ్యం మంచిగా ఉంటుంది. ముఖ్యంగా మైన్స్ లో వర్క్ చేసేవాళ్లు గోళ్ళను అస్సలు పెంచకూడదు. ఎందుకంటే బొగ్గు అంతా గోళ్లల్లోకి వెళ్లి అలానే ఉండిపోయి ఆహారం ద్వారా లోపలికి వెళ్ళిపోతుంది. దీనివల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. కావున బొగ్గు పనులు చేసేటప్పుడు చేతికి గ్లౌజెస్ వేసుకోవాలి. మైన్స్ లో వర్క్ చేసేవాళ్లు కనీసం ఏడు గంటలైనా తప్పనిసరిగా నిద్రపోవాలి.
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
This website uses cookies.