Chinese Fast Food : రోజూ చైనీస్ ఫాస్ట్ ఫుడ్ తినేవాళ్లు ఒక్కసారి ఇది చదవండి.. ఆ తర్వాత ఇక మీ ఇష్టం

Authored By Jagadesh Gatla | The Telugu News | Updated on : 23 November 2025, 11:09 am

Chinese Fast Food : చైనీస్ ఫాస్ట్ ఫుడ్ అంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు చెప్పండి. నూడుల్స్, ఫ్రైడ్ రైస్, మంచూరియా లాంటి ఫుడ్ ను చూస్తే నోరూరకుండా ఉంటుందా? అందులోనూ ఇన్‌స్టాంట్ ఫుడ్ అది. బయట హోటళ్లలోనే కాదు.. ఇప్పుడు ఇంట్లో కూడా 2 నిమిషాల్లో ఈ ఫాస్ట్ ఫుడ్ ను చేసుకొని తింటున్నారు. చిటికెలో వంట పూర్తి కావాలి. వంట వండటానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. క్షణాల్లో వండొచ్చు.. టేస్ట్ కూడా ఉంటుంది. అందుకే చాలామంది ఫాస్ట్ ఫుడ్ కు బానిసలు అవుతున్నారు.

health issues with Chinese fast food

#image_title

కొంతమంది అయితే రోజూ అదే పనిగా చైనీస్ ఫాస్ట్ ఫుడ్ ను తింటుంటారు. అలా రోజూ చైనీస్ ఫాస్ట్ ఫుడ్ తినేవాళ్లు తమ ఆరోగ్యాన్ని తామే పాడు చేసుకుంటున్నారనే విషయం తెలియదు. ఎప్పుడో ఒకసారి అంటే ఓకే కానీ, తరుచూ ఫాస్ట్ ఫుడ్ తినే వాళ్లకు పలు ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Chinese Fast Food : డేంజర్ అజినోమోటో వల్లనే అనారోగ్యం

ఫాస్ట్ ఫుడ్ లో అజినోమోటో అనే పదార్థాన్ని కలుపుతారు. అదే టేస్ట్ కు కీలకం. అందుకే ఫాస్ట్ ఫుడ్ ను లొట్టలేసుకుంటూ తింటారు. అజినోమోటో అంటే మరేంటో కాదు.. మోనోసోడియం గ్లూటమేట్. దాంన్నే ఎంఎస్‌జీ అంటారు. మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే టేస్టింగ్ సాల్ట్ అని కూడా చెప్పొచ్చు. దీని వల్ల బాడీలోకి సోడియం ఎక్కువగా వస్తుంది. అది కిడ్నీలపై ఎఫెక్ట్ చూపిస్తుంది.

కిడ్నీ సమస్యలతో పాటు సోడియం వల్ల రక్త నాళాలు చెడిపోతాయి. దీంతో బీపీ పెరుగుతుంది. తద్వారా హైబీపీ వస్తుంది. దీంతో గుండె జబ్బులు వస్తాయి. అంతే కాదు.. డైజెషన్ సమస్యలు, డీహైడ్రేషన్, కీళ్ల నొప్పులు.. ఇలా పలు రకాల అనారోగ్య సమస్యలకు అజినోమోటో కారణం అవుతుంది. అందుకే వీలైనంత వరకు ఫాస్ట్ ఫుడ్ కు దూరంగా ఉంటే మంచిది.

Advertisement

Jagadesh Gatla

Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com

Tags :
    Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి