Health Problems : కాఫీ అంటే తెలియని వారు ఉండరు. ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో దొరికే పానియం. చిన్నపిల్లల నుంచి పెద్ద వాళ్ల దాక అందరు కాఫీని ఇష్టపడుతారు. ఉదయం, సాయంత్రం తప్పనిసరిగా కాఫీని తాగుతారు. కాఫీ తాగడం ఒక రోజువారి అలవాటుగా మారిపోయింది. ఎక్కడ ఉన్నా దాని వాసనను పసిగట్టే అంతలా కాఫీకి అలవాటు పడిపోయారు. అయితే చాలామంది ఏ సమయంలోనైనా కాఫీని తాగుతారు. ఇలా తాగడం వలన అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. కొందరు భోజనం ముగించాక కాఫీని తాగుతారు. మరికొందరు కాఫీ తాగుతు వివిధ రకాల ఆహార పదార్ధాలను తింటుంటారు. ఇలా తాగడం ఆరోగ్యానికి అనేక చెడు ప్రయోజనాలు కలుగుతాయి. అస్సలు మంచిది కాదు. అవి ఏంటో ఇప్పుడు తెలుపుకుందాం.. కాఫీని ఎక్కువ సార్లు తాగితే దానిలో ఉండే కెఫిన్ వలన కొందరికి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. కనుక కాఫీని ఎక్కువగా సేవించవద్దు. అది మీ ఆరోగ్యానికి మంచిది కాదు. అలాగే కాఫీ తాగే ముందు కొన్ని ఆహార పదార్ధాలను తీసుకోకుండా ఉండడమే మంచిది.
ముఖ్యంగా బఠానీలు, చిక్కుళ్లు, సోయాసాస్ లాంటివి కాఫీ తాగే ముందు అస్సలు తినకూడదు. ఎందుకంటే వీటిలో ఐరన్ శాతం ఎక్కువగా ఉంటుంది. కనుక వీటిని తిన్నాక కాఫీ త్రాగరాదు. మనకు ఐరన్ రెండు రూపాల్లో లభిస్తుంది. ఒకటి హిమ్, మరొకటి నాన్ హీమ్. హీమ్ ఐరన్ జంతువుల నుంచి లభిస్తుంది. ఈ ఐరన్ ని మన శరీరం త్వరగా గ్రహించుకుంటుంది. నాన్ వెజ్ తిన్నాక కాఫీని తాగితే మన శరీరం ఐరన్ ను గ్రహించదు. అలాగే నాన్ హీమ్ మొక్కల నుంచి లభిస్తుంది. అయితే వెజ్ తినే వారు ఈ ఐరన్ ని గ్రహించడం చాలా కష్టం. దీనివలన మొక్కల ఆధారిత బఠానీలు, గింజలు, చిక్కుళ్లులాంటివి తిన్నాక కాఫీ తాగితే జీర్ణ సంబంధిత వ్యాధులు ఎక్కువగా వస్తాయి. కనుక కాఫీ తాగే ముందు ఈ ఆహార పదార్ధాలను తినకుండా ఉండడమే మంచిది. అలాగే కొంతమంది పాలు త్రాగాక కాఫిని త్రాగుతారు. అంటే కాల్షియం తీసుకున్నాక కెఫిన్ ను తీసుకుంటారు.
ఇలా తీసుకోవడం వలన మన శరీరం కాల్షియంను గ్రహించలేదు. దీనితో కాల్షియం ఎక్కువగా మీ బాడీలోకి కాకుండా మూత్రం ద్వారా బయటికి వస్తుంది. కనుక కాఫీని పాలు త్రాగాక తాగకూడదు. అలాగే కొందరు కాఫీ తాగుతు ఆయిల్ ఫుడ్స్ ను తింటుంటారు. ఇలా తాగడం వలన ఆయిల్ ఫుడ్ లో ఉండే కొలస్ట్రాల్, కాఫీలోని కెఫిన్ కలిసి పోయి చెడు కొలస్ట్రాల్ గా మారిపోతుంది. దీనివలన మీ శరీరంలో కొవ్వు పెరుగుతుంది. ఎక్కువగా గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఎక్కువగా కాఫీ తాగితే మీ బాడీ జింక్ ను గ్రహించే సామర్థ్యం కోల్పోతుంది. జింక్ ఎక్కువగా బీన్స్,నట్స్, రెడ్ మీట్ వంటి వాటిల్లో ఉంటుంది. కనుక ఈ ఆహార పదార్ధాలను తిన్నాక కాఫీని త్రాగకూడదు. అలాగే కాఫీని రోజుకి రెండు, మూడు సార్ల కంటే ఎక్కువగా తాగకూడదు. దీనివలన నిద్రలేమి, యసిడిటి మొదలగు సమస్యలు వస్తాయి. కనుక కాఫీని ఎక్కువగా తాగితే మీ ఆరోగ్యానికి హానికరం.
Ysrcp : ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం చెందడంతో ఇంకా సంక్షోభం కొనసాగుతూనే ఉంది. అధికారంలో…
Elon Musk : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన తర్వాత ఎవరు లాభపడ్డారో తెలియదు కాని…
Stock Market : ఇటీవల స్టాక్ మార్కెట్లు అప్స్ అండ్ డౌన్ అవుతూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే…
Rythu Bharosa : తెలంగా రైతులకు ప్రభుత్వ తీపి కబురు. రైతు భరోసా ఇంకెప్పుడూ అంటూ ఎదురు చూస్తున్న రైతుల…
Telangana Caste Census : తెలంగాణలో కుల ఆధారిత సర్వే ప్రారంభమైంది. తెలంగాణలో Telangana కాంగ్రెస్ Congress నేతృత్వంలోని ప్రభుత్వం…
E Cycle : ఈ రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దీంతో చాలా మంది ఎలక్ట్రిక్ వెహికిల్స్పైన…
AP Govt : అనధికారిక కమ్యూనికేషన్ మరియు అధికారిక పదవిని దుర్వినియోగం చేసినందుకు లెజిస్లేచర్ సెక్రటేరియట్ జాయింట్ సెక్రటరీ ఎం…
Curd : ప్రతి అమ్మాయి కూడా తను ఎంతో అందంగా కనిపించాలని కోరుకుంటుంది. దీని కోసం ఎన్నో రకాల ప్రయత్నాలు కూడా…
This website uses cookies.