Dization : జీర్ణ వ్యవస్థలో వచ్చే ఇబ్బందులతో సతమతమవుతున్నారా… ఇవి పాటించండి…!!
Dization : మనిషి ఎంతో ఆరోగ్యంగా ఉండాలి అంటే తిన్నది సరిగ్గా జీర్ణం అవ్వాలి. ఈ విషయ ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అయితే మన శరీరంలో జీర్ణవ్యవస్థకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో దీనిని బట్టే చెప్పొచ్చు. అలాంటి కీలకమైన జీర్ణవ్యవస్థలో ఇబ్బందులు తలెత్తితే. అప్పుడు ఆరోగ్యంపై ఎంతో తీవ్ర ప్రభావం పడుతుంది. అందుకే అధిక జీర్ణ సంబంధిత సమస్యలు దరిచేరకుండా చాలా జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అయితే జీర్ణ వ్యవస్థలో సమస్యలు ఏర్పడితే కేవలం […]
ప్రధానాంశాలు:
Dization : జీర్ణ వ్యవస్థలో వచ్చే ఇబ్బందులతో సతమతమవుతున్నారా... ఇవి పాటించండి...!!
Dization : మనిషి ఎంతో ఆరోగ్యంగా ఉండాలి అంటే తిన్నది సరిగ్గా జీర్ణం అవ్వాలి. ఈ విషయ ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అయితే మన శరీరంలో జీర్ణవ్యవస్థకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో దీనిని బట్టే చెప్పొచ్చు. అలాంటి కీలకమైన జీర్ణవ్యవస్థలో ఇబ్బందులు తలెత్తితే. అప్పుడు ఆరోగ్యంపై ఎంతో తీవ్ర ప్రభావం పడుతుంది. అందుకే అధిక జీర్ణ సంబంధిత సమస్యలు దరిచేరకుండా చాలా జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అయితే జీర్ణ వ్యవస్థలో సమస్యలు ఏర్పడితే కేవలం కడుపునొప్పి మరియు గ్యాస్ లాంటి ఇబ్బందులు మాత్రమే వస్తాయని మనం అనుకుంటాం. కానీ ఇది మరెన్నో ఇతర సమస్యలకు కూడా దారితీస్తుంది అని నిపుణులు అంటున్నారు. అయితే జీర్ణ వ్యవస్థలో తలెత్తే సమస్యల వలన కనిపించే లక్షణాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం…
– జీర్ణ సమస్యలు ఎదురైన వారిలో బరువులో కూడా హెచ్చు తగ్గులు కనిపిస్తాయి. ముఖ్యంగా చెప్పాలంటే పేగులో ఇతర రకాల బ్యాక్టీరియా చేరటం వలన సమస్య అనేది వస్తుంది. అయితే కొవ్వులు అధికంగా ఉండే ఆహారాలతో ఊబకాయానికి కారణం అయ్యే బ్యాక్టీరియా పేగుల్లో పెరిగిపోతుంది. ఇది కడుపులో సమస్యలకు కూడా దారి తీస్తుంది…
– జీర్ణ సంబంధిత సమస్యలలో ఇరిటబుల్ బోవేల్ సిండ్రోమ్ కూడా ఒకటి అని చెప్పొచ్చు. అయితే ఇది చాలా ప్రధానంగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే కడుపు ఉబ్బరం మరియు గ్యాస్, విరోచనాలు, మలబద్ధకం, కడుపునొప్పి ఇవన్నీ కూడా దీని యొక్క లక్షణాలు అని చెబుతారు. అయితే ఇలాంటి లక్షణాలు కనుక మీకు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించండి…
– ఇక జీర్ణ వ్యవస్థలో ఇబ్బందులు చర్మ సమస్యలకు కూడా దారితీస్తుంది అని మీకు తెలుసా. అవును ఇది నిజం. ఇది పులిపిర్లు మరియు దురదలు, సోరియాసిస్ లాంటివి కూడా ఈ కోవకి చెందినవి. అయితే పేగుల్లో నుండి లీక్ అయ్యే ప్రోటీన్లను రోగనిరోధక శక్తి ప్రమాదకరమైనవిగా భావించి వాటిపై దాడి మొదలు పెడుతుంది…
-జీర్ణ వ్యవస్థలో మొదలయ్యే ముఖ్య సమస్యలల్లో ఒకటి అలసట. అయితే ప్రతిరోజు నీరసంగా ఉండే వారిలో సగం మందికి జీర్ణ వ్యవస్థ సమస్యలు ఉంటాయి అని వైద్యులే అంటున్నారు…
జీర్ణ సమస్యల కారణం చేత సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అని కొన్ని పరిశోధనలో కూడా తేలింది. ముఖ్యంగా చెప్పాలంటే ఒత్తిడి మరియు డిప్రెషన్, ఆందోళన లాంటి సమస్యలు ఎదురవుతాయి అని అంటున్నారు నిపుణులు…
ఇవి పాటించండి : జీర్ణ సమస్యలు దూరం అవ్వాలి అంటే జీవన శైలిలో కొన్ని మార్పులు చేసుకోవాలి అంటున్నారు నిపుణులు. అయితే మీరు తీసుకునే ఆహారంలో తప్పనిసరిగా ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. అలాగే యోగ మరియు మెడిటేషన్ లాంటివి కూడా చేయాలని అంటున్నారు. ఇకపోతే ఆహారాన్ని బాగా నమిలి తీసుకోవాలి అని అంటున్నారు. మీరు గనక ఇలాంటివి పాటిస్తే జీర్ణ వ్యవస్థలో వచ్చే ఇబ్బందులు దూరం అవుతాయి అని అంటున్నారు నిపుణులు…