Health Tips : కొందరికీ టీ అంటే ప్రాణం. తినకుండా ఉండమంటే ఉంటారు కానీ టీ తాగకుండా ఉండలేరు. గంటగంటకూ చాయ్ తాగుతుంటారు. అది వారికి వ్యసనం లాగా మారుతుంది. ఇంట్లో టీ తాగేందుకు సాధారణంగా స్టీల్ గ్లాసులు, పింగాణీ పాత్రలు వాడుతుంటారు. కానీ, బయట మాత్రం పేపర్ కప్పులు లేదా గాజు గ్లాసుల్లో చాయ్ ఇస్తుంటారు. టీ స్టాల్స్, కేఫేలో చాలా మంది గాజు గ్లాసుల్లో తాగేందుకు ఇష్టపడరు. కారణంగా వేరే వ్యక్తులు తాగిన గ్లాసుల్లో మనం ఎలా తాగాలి? వాటిని సరిగా కడిగారో లేదో అన్న అనుమానం వారికి ఉంటుంది. అందుకే పేపర్ కప్స్‌కు ప్రాధాన్యం ఇస్తుంటారు.
మనందరికీ తెలియని విషయం ఎంటంటే పేపర్ కప్స్‌లో చాయ్ తాగినా ఆరోగ్యానికి హానికరం అని నిపుణులు చెబుతున్నారు.మొన్నటివరకు టీస్టాల్స్‌లో ప్లాస్టిక్, డిస్పోజబుల్ కప్పులను వినియోగించేవారు. పర్యావరణానికి హానికరం అని ప్రభుత్వాల హెచ్చరికతో అందరూ పేపర్ కప్పులను వినియోగించడం ప్రారంభించారు. ప్రస్తుతం ఎక్కడా చూసినా ప్లాస్టిక్ బదులు పేపర్ కప్పులే దర్శనమిస్తున్నాయి. అయితే, పేపర్ కప్పుల్లో టీ, ఇతర వేడి ద్రావణాలు తీసుకున్నప్పుడు ఎన్నో అనారోగ్య సమస్యలు ఎదురవుతాయని ఖరగ్‌పూర్ ఐఐటీ పరిశోధకుల అధ్యయనంలో తేలింది.
డిస్పోజబుల్ కప్పులో 3సార్లు 100 మి.లీ. చొప్పున వేడి టీ తాగడం వలన 75 వేల అతి సూక్ష్మ హానికర ప్లాస్టిక్ కణాలు శరీరంలోకి వెళ్తాయని, 80 నుంచి 90 డిగ్రీల సెంటిగ్రేడ్ వేడి కలిగిన 100 మి.లీ. ద్రవ పదార్థం ద్వారా 25 వేల మైక్రాన్ల ప్లాస్టిక్ కణాలు బాడీలోకి చేరతాయన్నారు.క్రోమియం, కాడ్మియం వంటి హానికారక లోహాలు రక్తంలో కలసిపోతాయని ఫలితంగా అవి క్యాన్సర్ కణాల ఉత్పత్తికి కారకం కావొచ్చని ఖరగ్ పూర్ ఐఐటీ పరిశోధకులు తేల్చారు. అందుకే ఇకపై పేపర్ కప్పుల్లో కంటే పింగాణీ లేదా గాజు గ్లాసుల్లో టీ తాగడం మంచిదని వారు స్పష్టం చేశారు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.