Health Tips : పేపర్ కప్పుల్లో టీ తాగుతున్నారా..? ఈ హెచ్చరిక మీకోసమే!

Authored By mallesh | The Telugu News | Published on: January 10, 2022, 7:00 am

Health Tips : కొందరికీ టీ అంటే ప్రాణం. తినకుండా ఉండమంటే ఉంటారు కానీ టీ తాగకుండా ఉండలేరు. గంటగంటకూ చాయ్ తాగుతుంటారు. అది వారికి వ్యసనం లాగా మారుతుంది. ఇంట్లో టీ తాగేందుకు సాధారణంగా స్టీల్ గ్లాసులు, పింగాణీ పాత్రలు వాడుతుంటారు. కానీ, బయట మాత్రం పేపర్ కప్పులు లేదా గాజు గ్లాసుల్లో చాయ్ ఇస్తుంటారు. టీ స్టాల్స్, కేఫేలో చాలా మంది గాజు గ్లాసుల్లో తాగేందుకు ఇష్టపడరు. కారణంగా వేరే వ్యక్తులు తాగిన గ్లాసుల్లో మనం ఎలా తాగాలి? వాటిని సరిగా కడిగారో లేదో అన్న అనుమానం వారికి ఉంటుంది. అందుకే పేపర్ కప్స్‌కు ప్రాధాన్యం ఇస్తుంటారు.

మనందరికీ తెలియని విషయం ఎంటంటే పేపర్ కప్స్‌లో చాయ్ తాగినా ఆరోగ్యానికి హానికరం అని నిపుణులు చెబుతున్నారు.మొన్నటివరకు టీస్టాల్స్‌లో ప్లాస్టిక్, డిస్పోజబుల్ కప్పులను వినియోగించేవారు. పర్యావరణానికి హానికరం అని ప్రభుత్వాల హెచ్చరికతో అందరూ పేపర్ కప్పులను వినియోగించడం ప్రారంభించారు. ప్రస్తుతం ఎక్కడా చూసినా ప్లాస్టిక్ బదులు పేపర్ కప్పులే దర్శనమిస్తున్నాయి. అయితే, పేపర్ కప్పుల్లో టీ, ఇతర వేడి ద్రావణాలు తీసుకున్నప్పుడు ఎన్నో అనారోగ్య సమస్యలు ఎదురవుతాయని ఖరగ్‌పూర్‌ ఐఐటీ పరిశోధకుల అధ్యయనంలో తేలింది.

health warning to paper tea cup consumers 

health warning to paper tea cup consumers

Health Tips : పేపర్ కప్పులో తాగితే ఏమవుతుంది..?

డిస్పోజబుల్‌ కప్పులో 3సార్లు 100 మి.లీ. చొప్పున వేడి టీ తాగడం వలన 75 వేల అతి సూక్ష్మ హానికర ప్లాస్టిక్‌ కణాలు శరీరంలోకి వెళ్తాయని, 80 నుంచి 90 డిగ్రీల సెంటిగ్రేడ్‌ వేడి కలిగిన 100 మి.లీ. ద్రవ పదార్థం ద్వారా 25 వేల మైక్రాన్ల ప్లాస్టిక్‌ కణాలు బాడీలోకి చేరతాయన్నారు.క్రోమియం, కాడ్మియం వంటి హానికారక లోహాలు రక్తంలో కలసిపోతాయని ఫలితంగా అవి క్యాన్సర్ కణాల ఉత్పత్తికి కారకం కావొచ్చని ఖరగ్ పూర్ ఐఐటీ పరిశోధకులు తేల్చారు. అందుకే ఇకపై పేపర్ కప్పుల్లో కంటే పింగాణీ లేదా గాజు గ్లాసుల్లో టీ తాగడం మంచిదని వారు స్పష్టం చేశారు.

mallesh

No bio available for this author.

  1. "Grand Electronics Sale : టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ల కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. రూ.20 వేలపైగా భారీ డిస్కౌంట్లు..!"

  2. "Ysrcp Plan : పోరులో వైసీపీ అసలైన బలం అదేనా? గ్రౌండ్ లెవెల్ కేడర్‌పై జగన్ భారీ నమ్మకం..!"

  3. "Messi vs Ronaldo : మెస్సీయా.. రొనాల్డోనా? ఫుట్‌బాల్ ఆల్‌టైమ్ ‘గోట్’ ఎవరో తేల్చేసిన ఆ లెక్కలు..!"

  4. "Jailer 2 : తలైవా రజినీకాంత్.. ‘జైలర్ 2’ ప్రమోషన్లతో బాక్సాఫీస్ వద్ద రచ్చ లేపనున్నారా..?"

  5. "Ys Jagan : స్థానిక ఎన్నికల్లో గెలుపే టార్గెట్.. అభ్యర్థుల ఎంపికపై రీజనల్ ఇన్‌ఛార్జ్‌లతో వైఎస్ జగన్ మైండ్ గేమ్!"

  6. "Pawan kalyan : అరెస్ట్‌పై పవన్ కల్యాణ్ కామెంట్స్.. తమ్ముళ్ల ఆగ్రహంతో కూటమిలో సరికొత్త దుమారం?"

  7. "Nandamuri Tejaswini : మేయర్ రేసులో నందమూరి బాలకృష్ణ కుమార్తె? తెరపైకి తేజస్విని పేరుతో పొలిటికల్ హీట్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp