Hair Tips : ఆడవాళ్ళకి కురులు చాలా అందంగా కనిపిస్తాయి. అయితే ఈరోజుల్లో పొడవాటి జడలు ఎవరు వేసుకోవడం లేదు. పొడవాటి జుట్టు కూడా ఎవరు పెంచుకోవడం లేదు. కారణమేంటంటే దాన్ని మెయింటైన్ చేయడం చాలా కష్టం అనే అపోహ. కొంతమందికి ఇష్టం ఉన్న కానీ ఎలా పెంచుకోవాలో తెలియక ఏవేవో రాస్తూ మార్కెట్లో దొరికే ఆయిల్స్, షాంపూలు వాడుతూ ఉంటారు. అయినా పెద్దగా ఫలితం ఉండదు. దాంతో విసిగిపోయి ఉన్న జుట్టును పొట్టిగా కట్ చేసుకుని స్టైల్ గా మెయింటైన్ చేస్తూ ఉంటారు. అయితే పొడవాటి జుట్టు కావాలి అనుకుంటే రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే చక్కగా తయారు చేసుకోవచ్చు. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అనే సామెత
ఎందుకొచ్చిందో కానీ నిజంగానే ఉల్లిపాయ చాలా అద్భుతంగా మన ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. కాబట్టి మార్కెట్లో చాలా రకాల బ్రాండ్లు ఉల్లిపాయ చుట్టూనే తిరుగుతున్నాయి. ఉల్లిపాయ షాంపు, ఉల్లిపాయ ఆయిల్, ఉల్లిపాయ హెయిర్ ప్యాక్ అని ఇలా రకరకాలుగా ఉల్లిపాయ ను వాడుతున్నారు. ఈ రెమిడీ తయారు చేసుకోవడానికి ముందుగా రెండు పెద్ద ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక ప్లేట్ లో వేసుకొని ఒక మందపాటి గిన్నె పెట్టి ఒక లీటర్ వరకు నీటిని వేసుకొని ఈ నీటిలో ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా మరిగించాలి. నీరు కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాక అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని వడకట్టుకుని ఏదైనా గాజు సీసాలో వేసుకొని స్టోర్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ ఉల్లి రసాన్ని తలకు ఇలా అప్లై చేయాలి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు స్పూన్ల ఉల్లిపాయల రసం, రెండు స్పూన్ల కొబ్బరినూనె, చుండ్రు ఉంటే కనుక ఐదు చుక్కల టేట్రే ఆయిల్ కలుపుకోవాలి. చుండ్రు లేకపోతే ఉల్లిపాయ రసం, కొబ్బరి నూనె సరిపోతుంది. ఇప్పుడు వీటన్నింటిని బాగా కలపి జుట్టు కుదుళ్లకు బాగా పట్టించి ఆ తర్వాత తల వెంట్రుకలకు కూడా బాగా పట్టించి 30 నిమిషాల పాటు అలా వదిలేయాలి. 30 నిమిషాల తర్వాత మైల్డ్ షాంపుతో హెయిర్ ని వాష్ చేసుకోవాలి. ఇలా రెగ్యులర్గా చేస్తూ ఉంటే హెయిర్ బలంగా దృఢంగా ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
This website uses cookies.