Home » Entertainment » Balakrishna Making Fun With Pragya Jaiswal At Airport
Entertainment

Balakrishna : చలిగా ఉందంటూ ఎయిర్ పోర్ట్ లో హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ తో బాలకృష్ణ కామెడీ వీడియో వైరల్..!!

Authored By
Breaking News
The Telugu News | Updated on: March 9, 2023 3:06 pm
Advertisement

Balakrishna : నటసింహం నందమూరి బాలయ్య బాబు ఏదైనా మనసులో ఉంది అంటే మొహమాటం లేకుండా మాట్లాడేస్తారు. ఎక్కడ ఎవరు ఎలా. ఏ సందర్భం అనేది పట్టించుకోకుండా మనసులో ఉన్నది ఉన్నట్టుగానే మొహం మీద చెప్పే వ్యక్తిత్వం బాలయ్య సొంతం. ఈ క్రమంలో ఒక్కోసారి ఫ్యాన్స్ కి దెబ్బలు కూడా పడతాయి. మరోపక్క కామెడీ కూడా ఆ తరహాలోనే చేస్తూ ఉంటారు. ఈ రకంగానే ఇటీవల బాలకృష్ణ గన్నవరం విమానాశ్రయంలో తోటి హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ తో కామెడీ చేశారు.

Advertisement

Balakrishna Making Fun With Pragya Jaiswal At Airport

విషయంలోకి వెళ్తే గన్నవరం విమానాశ్రయం చేరుకున్న బాలకృష్ణని ఏలూరు మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ ఆహ్వానించడం జరిగింది. ఇదే సమయంలో బాలకృష్ణ తో పాటుగా ప్రగ్యా జైస్వాల్ కూడా రావటం జరిగింది. ఆ సమయంలో బాలకృష్ణ ని సాలువాతో సత్కరించారు. అయితే పక్కనే ఉన్న జైష్వాల్ కీ ఎవరు సాలువ కట్టకపోవడంతో చలిగా ఉందంటూ విమానాశ్రయంలో హిందీలో మాట్లాడుతూ ఆమెతో చమత్కరించారు. దీంతో బాలకృష్ణ

Advertisement

చేసిన కామెడీతో విమానాశ్రయ సిబ్బంది ఆహ్వానించడానికి వచ్చిన వాళ్లు పగలబడి నవ్వారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రస్తుతం బాలకృష్ణ దర్శకుడు అనిల్ రావిపూడితో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో జరగనుంది. 60 ఏళ్ల పెద్ద తరహా పాత్రలో బాలకృష్ణ కనిపించనున్నారు. అంతేకాదు తెలంగాణ యాసలో బాలకృష్ణ డైలాగులు ఈ సినిమాలో చెప్పనున్నారు. బాలకృష్ణ కూతురి పాత్రలో యంగ్ హీరోయిన్ శ్రీ లీల నటిస్తున్నట్లు సమాచారం.

Breaking News

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి