Home » Health » If Hemoglobin Is Low In The Body These Symptoms Appear
Health

Hemoglobin : శరీరంలో హిమోగ్లోబిన్ తక్కువగా ఉంటే… ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి… నిరలక్ష్యం చేశారో…తస్మాత్ జాగ్రత్త…?

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Published on: June 23, 2025, 11:00 am
Advertisement

Hemoglobin : శరీరానికి సరైన హిమోగ్లోబిన్ లేకపోతే ఆరోగ్యంగా ఉండలేరు. శరీరానికి గుండె ఎంత ముఖ్యమో శరీరంలో ప్రవహించే రక్తం కూడా అంతే ముఖ్యం. గుండె సరిగ్గా పని చేయాలన్న రక్తం కావలసినంత సరిపడా ఉండాలి. అప్పుడే ఆరోగ్యంగా ఉండగలం. శరీరంలో హిమోగ్లోబిన్ లోపం ఉందని ఎలా తెలుసుకోవాలి. దీనికి ఎటువంటి సంకేతాలు మనకి కనబడతాయి. శరీరంలో దీనిలోపం ఏర్పడితే ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి. దీని గురించి నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం..

Advertisement

Hemoglobin : శరీరంలో హిమోగ్లోబిన్ తక్కువగా ఉంటే… ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి… నిరలక్ష్యం చేశారో…తస్మాత్ జాగ్రత్త…?

శరీరంలో హిమోగ్లోబిన్ లోపం ఉన్నట్లయితే మీకు మొదట కనబడే సంకేతం అలసిపోయినట్లుగా ఉంటుంది. రాత్రంతా పడుకున్నా, ఎంత విశ్రాంతి తీసుకున్న,ఉదయాన్నే మరునాడు చాలా నీరసంగా అనిపిస్తుంది. ఇలాంటి, లక్షణం కనిపిస్తే మీ శరీరంలో రక్తహీనత సమస్య ఉందని అర్థం. అయితే, ఈ రక్తహీనత సమస్య ఎక్కువగా పురుషుల్లో కంటే కూడా మహిళల్లోనే ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకనగా మహిళలకు ఋతుక్రమ స్రావం జరుగుతుంది.కాబట్టి, నిజానికి రక్తహీనత అనే సమస్య శరీరంలో ఇనుము శాతం తక్కువగా ఉండడం చేత హిమోగ్లోబిన్స్ కాయలు తగ్గిపోతాయి. ఇలా హిమోగ్లోబిన్ శాతం తగ్గిపోతే రక్తహీనత లోపం ఏర్పడుతుంది దీనిని “ఎనిమియా “అని కూడా అంటారు.

Advertisement

శరీరంలో ఎర్ర రక్త కణాలలో ఉండే ఒక ముఖ్యమైన ప్రోటీన్. దీని ప్రధాన పని ఊపిరితిత్తుల నుంచి ఆక్సిజన్ ని గ్రహించి దానిని శరీరంలోని ప్రతి భాగానికి కణానిని రవాణా చేస్తుంది.మన శరీరంలో కణాలు సరిగ్గా పని చేయాలంటే ఆక్సిజన్ చాలా అవసరం. శరీరంలో తగినంత హిమోగ్లోబిలు లేనప్పుడు, కణాలకు తగినంత ఆక్సిజన్ ఉండదు. దీనివల్ల కణాలు సరిగ్గా పని చేయలేవు శరీరంలో హిమోగ్లోబిన్ తక్కువ అయితే, కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. ఆ సంకేతానికి సకాలంలో గుర్తిస్తే, ప్రాణాంతక పరిస్థితుల నుంచి తప్పించుకోవచ్చు. శరీరంలో హిమోగ్లోవింగ్ తగ్గితే కనిపించే లక్షణాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం…

Hemoglobin  అలసట, బలహీనత

హిమోగ్లోబిన్ లోపిస్తే, కణాలకు తగినంత ఆక్సిజన్ సరిగ్గా సరఫరా అవ్వదు. ఆక్సిజన్ లేకపోవడం చేత కణాలు శక్తిని ఉత్పత్తి చేయలేవు.దీనివల్ల మీరు త్వరగా అలసిపోయినట్లు ఉంటుంది. సాధారణంగా చేసే పనులు కూడా ఎక్కువ శ్రమతో చేయాల్సి వస్తుంది. ఉదాహరణకు మీరు మెట్లు ఎక్కి నడవడం వంటివి కూడా అలసటను కలిగిస్తాయి. కొద్దిపాటి శారీరక శ్రమ తర్వాత కూడా శరీరం శక్తిని కోల్పోయినట్లుగా బలహీనంగా అనిపించవచ్చు. రోజువారి పనులు చేయాలన్న మీరు చాలా నిసత్తుగా ఉంటారు. ఈ లక్షణాలు తరచుగా కనిపిస్తే వెంటనే డాక్టర్ని సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవాలి.

Advertisement

శ్వాస ఆడకపోవడం :  శరీరానికి కావాల్సిన ఆక్సిజన్ సరిగ్గా అందకపోతే శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. శ్వాస ఆడక పోవడం వంటివి ఎదురవుతాయి ముఖ్యంగా, మెట్లు ఎక్కేటప్పుడు లేదా కొంచెం శారీరక పని చేసినా కూడా శరీరానికి ఆక్సిజన్ సరఫరా సరిగ్గా అందదు. ఊపిరితిత్తులు ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. దీంతో ఈ లక్షణం కనిపిస్తుంది.

చర్మం పసుపు రంగులోకి మారడం : హిమోగ్లోబిన్ లోపం ఏర్పడితే చర్మం,గోళ్లు,కళ్ళ లోపలి భాగం పసుపు రంగులోకి మారడం ప్రారంభిస్తాయి. నిజానికి, రక్తం ఎక్కువగా ఉంటే ఎరుపు రంగును ఇస్తుంది.కానీ,దాని లోపం వల్ల చర్మం,గోళ్లు పసుపు రంగులోకి మారతాయి. మీకు ఇలాంటి లక్షణం ఉన్నట్లయితే, దానిని నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్ని సంప్రదించి పరీక్షలు చేయించుకోండి.

తల తిరగడం లేదా తలనొప్పి : మెదడుకు తగినంత ఆక్సిజన్ అందకపోతే,మొదట తల తిరుగుతుంది.ఇంకా, తలనొప్పి కూడా వస్తుంది.ఇలాంటి సమస్యలు తలెత్తుతాయి. తలనొప్పి వస్తే లేదా తల తిరిగినట్లు అనిపిస్తే ఇది లోపానికి సంకేతం కావచ్చు.

హృదయ స్పందన పెరగడం : ఎలాంటి శారీరక శ్రమ చెయ్యకుండానే మీ గుండె వేగంగా కొట్టుకున్నట్లయితే అది మీరు గమనించాల్సి ఉంటుంది. ఇది రక్తహీనతకు కారణం కావచ్చు. కణాలకు తక్కువ ఆక్సిజన్ అందినప్పుడు,ఆక్సిజన్ వీలైనంతగా త్వరగా చేరవేయడానికి గుండె ఎంత కష్టపడి వేగంగా పంపు చేయడం ప్రారంభిస్తుంది. దీనివల్ల హృదయ స్పందన రేటు పెరుగుతుంది. అదే సమయంలో ఊపిరితులు కూడా మరింత ఆక్సిజన్ గ్రహించడానికి వేగంగా పనిచేయాల్సి వస్తుంది. దీని ఫలితంగా మీ గుండె దడ శ్వాస ఆడకపోవడం,అంటూ లక్షణాలు కనిపించవచ్చు.

Advertisement

చేతులు, కాళ్లు చల్లబడడం : శరీరంలో రక్త ప్రసరణ సరిగా లేకపోతే, మొదట చేతులు, కాళ్లు చల్లగా మారుతాయి.చేతులు,కాళ్లు మీరు జలదరింపులు అనుభూతిని గురిచేస్తుంది.మీ చేతులు, కాళ్లు ఎల్లప్పుడూ చల్లగా ఉంటే,ఇది కూడా హిమోగ్లోబిన్ సమస్యకు సంకేతం కావచ్చు.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి