Anti Anxiety Morning : మీరు ఉదయాన్నే లేవగానే ఈ పనులు చేశారంటే... ఆ రోజంతా ఒత్తిడికి దూరమై రేసుగుర్రంలా పరిగెడతారు...?
Anti Anxiety Morning : నేటి కాలంలో ప్రతి ఒక్కరు కూడా తమ పనులపై బిజీ అయిపోతున్నారు. ప్రతిరోజు తమ దినచర్యలో ఒత్తిడికి లోనవుతున్నారు. ఎక్కువ పని ఒత్తిడి వలన మెదడుపై అధికంగా ప్రభావం చూపుతుంది. దీంతో మానసిక ఆందోళన, ప్రశాంతత కరువైపోతుంది. చిరాకు, అధిక కోపం, విసుగు, అలసట అన్ని పెరిగిపోతాయి. అయితే, ఈరోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఒత్తిడికి లోనవుతున్నారు. ఒత్తిళ్ళ నుంచి బయటపడాలంటే, ఈ ఒక్క పని చేశారంటే ఇకనుంచి మీకు ప్రశాంతత లభిస్తుంది, అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ప్రతిరోజు ఉదయం లేవగానే ఈ పద్ధతులను పాటిస్తే, మీకు అధిక ఒత్తిడి దూరం కావడంతో పాటు, రోజంతా ఉల్లాసంగానూ, ఉత్సాహంగాను,ఉరకలు వేస్తారు అని చెబుతున్నారు నిపుణులు. మరి నిపుణులు ఉదయాన్నే ఏ పనులు ఆచరిస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందని చెబుతున్నారో తెలుసుకుందాం….
Anti Anxiety Morning : మీరు ఉదయాన్నే లేవగానే ఈ పనులు చేశారంటే… ఆ రోజంతా ఒత్తిడికి దూరమై రేసుగుర్రంలా పరిగెడతారు…?
మొదట ప్రతి ఒక్కరు కూడా ఉదయం సూర్యోదయానికి ముందుగానే లేవడం అలవాటు చేసుకోవాలి. చేస్తే మీకు రోజులో ఎక్కువ సమయం ఉందని ఫీలింగ్ మీకు కలుగుతుంది. దీనివల్ల టైమ్స్ సేవ్ అయ్యి, ఒత్తిడి ఆందోళన దరిచేరవు. ప్రతిరోజు ఉదయం లేవగానే కృతజ్ఞతలు తెలుపుకోవడం చాలా మంచి అలవాటు. ఇంకా మరో రోజు ప్రారంభించేందుకు ధన్యవాదాలు చెప్పుకోండి. దీనివల్ల మీ మనసు ఉల్లాసంగాను మారుతుంది. ఉదయం లేవగానే మీ బెడ్డు సర్దుకోవడం మంచి అలవాటు. దీనివల్ల మీ మనసుకు కుదుటపడుతుంది.మంచి పని చేశామన్న భావన మీకు కలుగుతుంది.ఇంకా, ఒత్తిడికి చెక్ పెట్టొచ్చు అంటున్నారు నిపుణులు.
ముఖ్యంగా ధ్యానం చేయడం ద్వారా మనసు ప్రశాంతంగా మారుతుంది. ఒత్తిడి,ఆందోళన వంటి మానసిక సమస్యలు తగ్గుతాయి.ఒత్తిడి లేకుండా ఆ రోజంతా గడపవచ్చు. ప్రతిరోజు కాసేపన్న వ్యాయామం చేయడం మంచి అలవాటు. దీనివల్ల శరీరానికి రక్తప్రసరణ సరిగ్గా జరుగుతుంది.అధిక ఒత్తిడి దూరం అవుతుంది. ఆరోగ్యం పెరుగుతుంది. ఉదయం లేవగానే ఓ గ్లాస్ గోరువెచ్చని నీరు తాగితే ఆరోగ్యం చేకూరుతుంది. ఇది మంచి అలవాటు కూడా. వీలైతే నిమ్మరసం కలుపుకొని తాగితే ఇంకా మంచిది.రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.జీర్ణ క్రియ సరిగ్గా జరుగుతుంది.
తేలి కైనా హెల్తి బ్రేక్ ఫాస్ట్ తినడం అలవాటు చేసుకుంటే ఎంతో ఆరోగ్యం గా ఉంటారు. మంచి ఫుడ్ ని తీసుకున్న ఫీలింగ్ కలుగుతుంది. మనసుకు ఉత్తేజాన్ని అందిస్తుంది. సలాడ్స్, ఓట్స్,తాజా పండ్లు, కూరగాయలతో, బ్రేక్ఫాస్ట్ తింటే ఇంకా మంచిది.ఉదయం లేవగానే చాలామంది టీ, కాఫీలు తాగుతుంటారు. అయితే, ఇది ఒత్తిడిని పెంచే అవకాశం మరింత పెరవచ్చు. అందుకే, వీటికి బదులు గ్రీన్ టీ,పెప్పర్మెంట్ టీ,వంటి హెర్బల్ టీలు తాగితే మంచిది. ఇంకా ఆరోగ్యం పెరుగుతుంది. మీరు ఉదయం నిద్ర లేవగానే ఆరోజు ఏ పనులు చేయాలో ఓ బుక్కులో రాసి పెట్టుకోండి. దీనివల్ల పనులు సమయానికి పూర్తవుతాయి.ఒత్తిడి లేకుండా గడపవచ్చు.
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో ప్రతి గ్రహం ఒక ప్రత్యేక స్థానం కలిగి ఉంటుంది. వాటిలో సూర్యుడు అతి…
Coconut Oil : కొబ్బరి నూనె... మన వంటగదిలో అందుబాటులో ఉండే అత్యంత సాధారణమైన వస్తువు. కానీ దీని ఉపయోగాలు…
Gym : ఇప్పుడు ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగిన తరుణంలో వ్యాయామం ప్రతి ఒక్కరి జీవనశైలిలో భాగమవుతోంది. కానీ, వర్కౌట్ చేస్తూ…
Onions Black Spots : ఉల్లిపాయలపై కనిపించే నల్లటి మచ్చలు చాలామందిని ఆందోళనకు గురి చేస్తుంటాయి. అయితే ఈ మచ్చలు…
Smartphone : దేశీయ మొబైల్ తయారీ సంస్థ లావా తాజాగా మరో అద్భుతమైన స్మార్ట్ఫోన్ను మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే…
Tea BP : టీ అంటే చాలా మందికి ఎంతో ఇష్టం. రోజులో ఒక్క కప్పు టీ లేకుండా చాలామందికి…
Varalakshmi Vratham : వరలక్ష్మీ వ్రతం .. సౌభాగ్యదాయినీ లక్ష్మీదేవిని LAkshmi Devi పూజించే పవిత్రమైన రోజు. ఈ రోజు…
Pragya Jaiswal : అందాల ముద్దుగుమ్మ.. ప్రగ్యా జైస్వాల్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. కంచె సినిమాతో తెలుగు ఆడియన్స్…
This website uses cookies.