Home » Health » If You Want To Reduce Fat Around The Belly Add A Spoon Of This In Buttermilk
Health

Buttermilk : బొడ్డు చుట్టూ కొవ్వు తగ్గాలంటే.. మజ్జిగలో ఇది ఒక స్పూన్ కలపండి…!

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Published on: January 4, 2025, 10:00 am
Advertisement

Buttermilk : మానసిక స్థితిని సరి చేసుకోవడం కోసం ప్రతిరోజు గ్లాస్ మజ్జిగను తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇక మజ్జిగ గ్యాస్టిక్ సమస్యలను తొలగించడంతో పాటుగా శరీర బరువును తగ్గించడంలో సహాయపడుతుంది. ఇలా ప్రతిరోజు మజ్జిగను తీసుకుంటే శరీరానికి ఎంతో మంచిదని చెబుతున్నారు. ఈ క్రమంలోనే ప్రతిరోజు తీసుకునే మజ్జిగలో అల్లం రసాన్ని కలిపి తీసుకుంటే అనేక ప్రయోజనాలు కలుగుతాయట. మరి అది ఏమిటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

Advertisement

Buttermilk : బొడ్డు చుట్టూ కొవ్వు తగ్గాలంటే.. మజ్జిగలో ఇది ఒక స్పూన్ కలపండి…!

మజ్జిగలో అల్లం రసం కలిపి తాగడం వలన అతిసారం తగ్గుతుంది. అదేవిధంగా ఇందులో ఉండేటటువంటి లక్టోజ్, కార్బోహైడ్రేట్లు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఇక అల్లం జీర్ణ క్రియ లు మెరుగుపరిచి జీర్ణ క్రియను పెంచడంలో ఉపయోగపడుతుంది. అంతేకాదు ఇది బరువు తగ్గడానికి దోహదపడుతుంది.ఇలా ప్రతిరోజు గ్లాస్ మజ్జిగలో ఒక స్పూన్ అల్లం రసం కలిపి తీసుకోవడం వలన కొవ్వు కణాలు చిన్న ప్రక్రియను ప్రోత్సహిస్తాయి. అయితే అల్లం యాంటీ ఆక్సిడెంట్ లో సమృద్ధిగా ఉండడం వల్ల శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి రక్షిస్తుంది.

Advertisement

అదేవిధంగా మీ ఆహారంలో మజ్జిగ మరియు అల్లం రసాన్ని చేర్చుకునట్లైతే మీ రోగనిరోధక శక్తిని ఇది బలోపేతం చేస్తుంది. ముఖ్యంగా సీజనల్ వ్యాధుల నుంచి రక్షిస్తుంది. ఇక శరీరంలో వాపులు ఉన్నవారు ప్రతిరోజు మజ్జిగలో అల్లం రసాన్ని కలిపి తీసుకోవడం మంచిది. మధ్యాహ్నం ఒక గ్లాసు మజ్జిగలో అల్లం రసం కొత్తిమీర మరియు ఉప్పు కలిపి తీసుకుంటే ఆకలి పెరుగుతుంది. అంతే కాదు అజీర్తి సమస్యలు ఉంటే అవి తగ్గుముఖం పడతాయి. ఇలా మజ్జిగను తాగడం వలన లివర్ ఆరోగ్యం మెరుగుపడడం తో పాటుగా శరీరంలోని కొత్త రక్తం తయారవుతుంది. అలాగే రక్తహీనత సమస్య కూడా తగ్గుతుంది.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి