Joint Pains Treatment in Telugu in video
Joint Pains : మార్కెట్లో అనేక రకాల నూనెలు దొరుకుతాయి. వాటిల్లో కొన్ని నూనెలు మాత్రమే ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అటువంటి వాటిల్లో ఒకటే యూకలిప్టస్ ఆయిల్. ఈ నూనె వలన బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చాలామందికి తెలియదు. ఈ యూకలిప్టస్ ఆయిల్ ను నీలగిరి తైలం అని కూడా పిలుస్తారు. చలికాలంలో జలుబు విరుగుడుకు ఈ నీలగిరి తైలం మంచి ఔషధంగా పనిచేస్తుంది. మరిగించిన నీళ్లలో కొద్దిగా నీలగిరి తైలం వేసి ఆవిరి పడితే ఎంతటి జలుబు అయినా సరే నయం అవుతుంది. అలాగే దగ్గు, ముక్కుదిబ్బడ, ఫ్లూ జ్వరం ఇలాంటి శ్వాసకోశ సమస్యలు కూడా నయం అవుతాయి.
health benefits and Joint pains and joint pains in back pain uses of carom seeds
ఎటువంటి ఖర్చు లేకుండా ఈ నీలగిరి తైలంతో ఈజీగా జలుబు దగ్గు సమస్యల నుంచి బయటపడవచ్చు. శరీరంలో నొప్పులు ఉన్నచోట నీలగిరి తైలం రాసి ఆ భాగాల్లో వేడి నీటి కాపడం పెట్టాలి. దీంతో వెంటనే నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది. ఇలా చేయడం వలన కీళ్లు, కండరాల నొప్పులు త్వరగా తగ్గిపోతాయి. గోరువెచ్చని నీళ్లలో కొద్దిగా నీలగిరి తైలం వేసి బాగా కలిపి నోట్లో వేసుకొని పుక్కిలించాలి. రోజు ఇలా చేయడం వలన నోటి దుర్వాసన పోతుంది. దంతాలు, చిగుర్లు దృఢంగా మారుతాయి. నోట్లో ఉన్న బ్యాక్టీరియా చచ్చిపోతుంది. ఈ నూనెను నుదిటి మీద ఐదు నిమిషాలు మసాజ్ చేసుకుంటే తలనొప్పి వెంటనే తగ్గుతుంది.
Joint Pains Treatment in Telugu in video
వడదెబ్బ తగిలిన వారు తొందరగా కోలుకునేలా చేసే లక్షణాలు ఈ నూనెలో ఉంటాయి. అలాగే చర్మం పొడిబారినప్పుడు ఈ ఆయిల్ తో మసాజ్ చేసుకుంటే అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అయితే ఈ ఆయిల్ ని నేరుగా చర్మంపై అప్లై చేయకుండా ప్రతిరోజు వాడే కొబ్బరి నూనెలో కొంచెం మోతాదులో నీలగిరి తైలం తీసుకొని రెండింటిని బాగా కలిపి ఎక్కడైతే చర్మ సమస్యలు ఉన్నాయో అక్కడ రాస్తే మంచి ప్రయోజనం కలుగుతుంది. చర్మం నున్నగా తయారవుతుంది. ఈ ఆయిల్ ను డైరెక్ట్ గా నోట్లో అస్సలు వేసుకోకూడదు. రెండు లేదా 3ml వేసుకుంటే మగతా, మైకం వస్తుంది. అంతకంటే ఎక్కువ తీసుకుంటే నాడీ వ్యవస్థ దెబ్బతింటుంది. కాబట్టి దీనిని మితంగా వాడుకోవాలి.
Chandra Mohan సినీ పరిశ్రమలో సుమారు 900కి పైగా చిత్రాల్లో నటించిన ప్రముఖ నటుడు చంద్రమోహన్ తెలుగు ప్రేక్షకులకు ఎంతో…
Red Amaranath : ప్రతిసారి డాక్టర్స్ ఆకుకూరలను తింటే మంచిది అని చెబుతూ ఉంటారు. ఆకు కూరలు తింటే ఆరోగ్య…
BRS : గత పదకొండేళ్లుగా బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న ఓ మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు రాజకీయంగా…
Gas Stove : ఆధారంగా అప్పట్లో గ్యాస్ పొయ్యిలనేవి లేవు.కావున, ప్రమాదాలు కూడా తక్కువే. కానీ ఇప్పుడు గ్యాస్ స్టవ్లు…
Anganwadi Posts : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు త్వరలోనే శుభవార్త చెప్పనుంది. 4,687 అంగన్‌వాడీ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ…
Green Tea : సాధారణంగా ప్రతి ఒక్కరూ ఉదయం లేవగానే టీ తాగండి ఏ పని చేయరు. టీ తాగకుండా…
Gupt Navratri : ప్రతి సంవత్సరం కూడా అమ్మవారిని పూజించేందుకు, నాలుగు రకాల నవరాత్రులు వస్తాయి. నవరాత్రులు అనగానే గుర్తుకు…
Ram Mohan Naidu : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తీవ్ర…
This website uses cookies.