Home » Health » Make This Drink With Ingredients Available In The Kitchen And Drink It 2
Health

Belly Fat Melts Away : వంటింట్లో ల‌భించే వీటితో ఈ డ్రింక్ త‌యారుచేసి తాగండి.. బెల్లీ ఫ్యాట్ కరిగిపోతుంది

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: June 1, 2025, 3:00 pm
Advertisement

Belly Fat Melts Away : మ‌న వంటింట్లో ల‌భించే సుగంధ ద్ర‌వ్యాల‌తో ఆరోగ్యక‌ర‌మైన డ్రింక్ త‌యారు చేసుకోవ‌చ్చ‌ని తెలుసా? ఈ ప్రత్యేకమైన డ్రింక్ కోసం అవసరమయ్యే పదార్థాలు మన ఇంట్లో సులభంగా దొరికేవే. జీలకర్ర, వాము, సోంపు, నిమ్మరసం, గోరువెచ్చటి నీరు. ఇవన్నీ కలిసి తీసుకుంటే శరీరంలో గ్యాస్, అజీర్ణం సమస్యలు తగ్గుతాయి. అంతేకాకుండా చెడు కొలెస్ట్రాల్ ను స‌మ‌ర్థ‌వంతంగా తగ్గించడంలో సహాయపడతాయి.

Advertisement

Belly Fat Melts Away : వంటింట్లో ల‌భించే వీటితో ఈ డ్రింక్ త‌యారుచేసి తాగండి.. బెల్లీ ఫ్యాట్ కరిగిపోతుంది

జీలకర్ర, వాము, సోంపు వంటి పదార్థాలు జీర్ణక్రియను మెరుగుపరచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఇవి శరీరంలో యాసిడ్ స్థాయిని సరిచేయడమే కాకుండా.. ఆహారం తేలికగా జీర్ణం అయ్యేలా చేస్తాయి. దీని వల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు తగ్గుతాయి. ఉదయం నిద్ర లేవగానే ఖాళీ కడుపుతో ఈ గోరువెచ్చటి నీటిని తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వు నెమ్మదిగా కరిగిపోతుంది. ముఖ్యంగా కడుపు భాగం చుట్టూ పేరుకుపోయిన మొండి కొవ్వును కరిగించడంలో ఇది ఎంతో సహాయ పడుతుంది.

Advertisement

వీటితో త‌యారు చేసిన గోరువెచ్చటి నీటిలో ఉండే సహజ పదార్థాలు శరీరాన్ని డిటాక్స్ చేయడంలో కూడా సహాయ పడతాయి. అవి కాలేయాన్ని శుభ్రపరచడంలో తోడ్పడతాయి. దీని వల్ల శరీరంలోని విష పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రోజూ దీనిని తాగడం వల్ల శరీరం తేలికగా, చురుకుగా అనిపిస్తుంది.

ఈ డ్రింక్‌ను ఎలా త‌యారు చేసుకోవాలి

రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు నీటిలో ఒక్కో టీ స్పూన్ జీలకర్ర, వాము, సోంపు వేసి నానబెట్టాలి. ఉదయాన్నే ఆ నీటిని స‌న్న‌ని మంట‌పై కొద్దిగా వేడి చేసి అందులో అర నిమ్మకాయ రసం కలిపి ఖాళీ కడుపుతో తాగాలి. ఇదే విధంగా ప్రతిరోజూ తాగితే మంచి ఫలితాలను పొందవచ్చు.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి