Health Benefits : నల్లేరు మొక్క గురించి చాలా మందికి తెలియదు. కానీ ఈ మొక్క వల్ల కలిగే ఉపయోగాల గురించి తెలిస్తే మాత్రం కచ్చితంగా మొక్క గురించి తెలుసుకుంటారు. వీలయితే మీ పెరట్లో కూడా పెంచుకుంటారు. అయితే నల్లేరు మొక్క శాస్త్రీయ నామం సిస్సస్ క్వాడ్రాంగులారిస్. ఈ మొక్క చూడటానికి నాలుగు పలకలుగా ఉండి అక్కడక్కడా చిన్న ఆకులు కల్గి ఉంటుంది. ఈ మొక్కను హేమోరాయిడ్స్, గౌట్, ఉబ్బసం, అలెర్జీలతో సహా అనేక రకాల రోగాలకు చికిత్స చేసేందుకు వాడుతారు. పురాతన కాలం నుంచి నల్లేరు మొక్కను ఆయుర్వేద వైద్యంలో ఉపయోగించేవారు. అయితే ఈ మొక్కలో ఉన్న వాటి వల్ల ఎముకలు గట్టిగా, బలంగా తయారవుతాయట. కీళ్లు, మోకాళ్ల నొప్పులను కూడా తగ్గిస్తాయని ఇటీవల చేసిన ఓ పరిశోధనలో వెల్లడి అయింది.
నల్లేరుకు వెల్డ్ ద్రాక్ష, మెండి క్రీపర్, డెవిల్స్ వెన్నుముక వంటి పేర్లు కూడా ఉన్నాయి. ద్రాక్ష కుటుంబానికి చెందిన ఈ నల్లేరు ఆసియా, ఆఫ్రికా, అరేబియా ద్వీపకల్పంలోని కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా దొరుకుతుంది. అయితే ఈ మొక్కను నొప్పికి చికిత్స చేసేందుకు ఎక్కువగా వాడుతుంటారు. అంతే కాదండోయ్ రుతుస్రావం నియంత్రించడానికి, ఎముక పగుళ్లను సవరించడానికి కూడా ఈ మొక్కను ఉపయోగిస్తారు. నల్లేరు మొక్కలో విటామిన్ సి,కెరోటినాయిడ్స్, టానిన్లు, ఫినాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయట. మూలికా వైద్యంలో నల్లేరు మొక్కు ఆకులు, కాండం, మూలాలు, వేర్లను ఉపయోగిస్తారు. నల్లేరు మొక్క పౌడర్, క్యాప్సూల్స్ లేదా సిరప్ రూపంలో కూడా దొరుకుతుంది.
హేమోరాయిడ్స్, అధిక బరువు, చర్మ అలర్జీలు, ఉబ్బసం, ఎముక గాయం, గౌట్ డయాబెటిస్, అధిక కొలెస్ట్రాల్… వంటి వాటిని తగ్గించేందుకు సహాయ పడుతుంది. 570 మందితో ఓ అధ్యయనం చేయగా ఈ విషయాలు వెల్లడి అయ్యాయి. నల్లేరు మొక్క ఎముక క్షీణతను తగ్గించడానికి, పగుళ్లను నయం చేయడానికి, బోలు ఎముకల వ్యాధి వంటి వాటిని నివారించేందుకు సాయపడుతుందని ఆ అధ్యయనంలో తేలింది. అలాగే కీళ్లు నొప్పులు తగ్గించడంలోనూ, ఆర్థరైటిస్ లక్షణాల నుంచి ఉపశమనం కల్పించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుందట. గుండె జబ్బులు, స్ట్రోక్ మరియు డయాబెటిస్ వంటి ప్రమాదాలను కల్గించే మెటబాలిక్ సిండ్రోమ్ ను నల్లేరు నాశనం చేస్తుందట. అధిక బొడ్డు కొవ్వు, అధిక రక్తపోటు, రక్తంలో చక్కెర, కొలెస్ట్రాల్ వంటి వాటిని అదుపు చేయడంలో నల్లేరు మొక్క కీలక పాత్ర పోషిస్తుందట.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.