turmeric : పసుపుని ఎక్కువగా వినియోగిస్తూ ఉంటాము. వివిధ రకాల వంటకాలలో, చర్మానికి సంబంధించిన సౌందర్య టిప్స్ లో పసుపుని ఎక్కువగా వినియోగిస్తూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాం.పసుపు,మనకి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పసుపులో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియాల్ వంటి లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. పసుపు అందాన్ని పెంచడంలోనూ మరి ఆరోగ్యాన్ని కాపాడుటలోనూ కూడా ఎంతో బాగా సహాయపడుతుంది. అయితే, ఆరోగ్యానికి మంచి చేసే ఈ పసుపు ఎక్కువగా తీసుకుంటే నష్టాలు కూడా వాటిల్లే ప్రమాదం ఉంది. ఎక్కువగా పసుపును తీసుకుంటే ఆరోగ్యానికి ఎలా హాని కలిగిస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం…
ఆరోగ్యకరమైన నిపుణులు అభిప్రాయాలు ప్రకారం.. మీరు పసుపుని అధిక పరిమాణంలో తీసుకుంటే.. అది కడుపులో నొప్పి, వికారం,వాంతులు, అతిసారం అంటే జీర్ణ సమస్యలు వస్తాయి. కర్క్యుమిన్ జీర్ణవ్యవస్థను ప్రేరేపిస్తుంది. దీనివల్ల ఈ సమస్యలు వస్తాయి. ఇప్పటికే రక్తాన్ని పల్చగా చేయాలని మందులు వాడేవారు పసుపుని పరిమిత పరిమాణంలో తీసుకోవాలి. పసుపే కదా అని అతిగా తినడం చాలా సమస్యలను తెచ్చిపెడుతుంది. ఏదైనా మనం సర్జరీకి ముందు పసుపును తీసుకోవడం ఆపేయాలి. ఇది రక్తస్రావాన్ని ప్రమాదాన్ని పెంచుతుంది. పసుపుని ఎక్కువ మోతాదులో తీసుకుంటే కిడ్నీలు స్టోన్ సమస్యలు వస్తాయి. పసుపులో హక్సలైట్స్ ఉంటాయి. ఇది మూత్రపిండాలలో రాళ్లు ఏర్పరుస్తాయి. కాబట్టి మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు పసుపును ఎక్కువగా తీసుకోకూడదు. ఇది కాకుండా మీకు తలనొప్పి సమస్య కూడా రావచ్చు.
పసుపుని మితంగా తీసుకుంటే శరీరంలో ఐరన్ శోషణన తగ్గుతుంది. ఐరన్ తగ్గటం వల్ల రక్తహీనత ప్రమాదం ఉంది. కొంతమందికి పసుపు వల్ల అలర్జీ ప్రతి చర్యలు కూడా కలుగుతాయి. చర్మం పై దద్దుర్లు దురద శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. పసుపు ఎక్కువగా తీసుకోవడం వెంటనే ఆపేయాలి, తినే ఆహారంలో మితంగా వాడాలి.
ఇంకా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే గర్భిణీ స్త్రీలు కూడా పసుపుని ఎక్కువగా తినకూడదు. ఎందుకంటే ఇది గర్భాశయ కండరాలను ఉత్తేజపరుస్తుంది. అలాగే కొన్ని రకాల మందులతో పసుపును ప్రతిస్పందించే అవకాశం ఉంటుంది. పసుపుని ఎక్కువగా తీసుకుంటే తలనొప్పి మైకం చర్మం పసుపు రంగులోకి మారటం వంటి సమస్యలు కూడా వస్తాయి. తెలిసింది కదా పసుపుని మితంగా వాడాలి,అమితంగా వాడితే ఏదైనా శరీరానికి హానికరమే.
Creta Electric Car : హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (HMIL) తన మొట్టమొదటి మాస్-మార్కెట్ ఎలక్ట్రిక్ SUV -…
Free Sewing Machine : తెలంగాణ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ (TGMFC) కింద క్రైస్తవ మైనారిటీ మహిళలు ఉచిత కుట్టు…
IT Raides : టాలీవుడ్ లో ఐటీ అధికారుల రైడ్స్ గురించి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ ఆఫీస్, ఇళ్ల్లతో…
Ravi Teja : పుష్ప 2 తో Pushpa 2 పాన్ ఇండియా Pan India బ్లాక్ బస్టర్ అందుకున్న…
Uttam Kumar Reddy : రైతుల సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి…
Chandrababu Naidu : AP CM Chandrababu Naidu ఏపీ సీఎం చంద్రబాబు 74 ఏళ్ల వయస్సులో నవ యువకుడిలా…
Uttam Kumar Reddy : తెలంగాణ Telangana నీటి పారుదల మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్…
Virender Sehwag Divorceఈ మధ్య కాలంలో సెలబ్రిటీల విడాకులకి సంబంధించి సోషల్ మీడియాలో అనేక వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.…
This website uses cookies.