Health Tips : వేరు శెనగలు తినడం వల్ల లభించే ప్రయోజాలు అన్నీ ఇన్నీ కావు. అందులో పోషకాలు మరే.. గింజల్లోనూ ఉండవు. రోజూ నానబెట్టిన వేరుశెనగ తినడం వలన అనేక ప్రయోజనాలు కలుగుతాయి. చికెన్, మటన్, చేపలు లాంటి నాన్ వెజ్ తినడం ఇష్టం లేని వాళ్లు వేరు శెనగలు తింటే… మాంసం తినడం వల్లే వచ్చే పోషకాలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. వేరుశెనగతో వచ్చే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.వేరు శెనగలను ఉడకబెట్టి అప్పటికప్పుడు తినడం కన్నా… రోజంతా నాన బెట్టి తింటే ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి. వేరు శెనగల్లో యాంటీ ఆక్సిడెంట్లు, రాగి, ఐరన్, పొటాషియం, సెలీనియం, జింక్ మరియు కాల్షియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి అవయవాలు, ఆరోగ్యకరమైన ఎముకలు, చర్మం మరియు జుట్టు యొక్క ఆరోగ్యకరమైన పని తీరుకు అవసరమైన ఖనిజాలు లభిస్తాయి.రోజూ 25.8 గ్రాముల ప్రోటీన్ కలిగి ఉన్న 100 గ్రాముల వేరు శెనగలను తింటే..
రోజువారీ శరీరానికి అవసరం అయ్యే ప్రోటీన్ అవసరాలలో సగం వరకు పొందవచ్చని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.నాన బెట్టిన వేరు శెనగ పైన ఉండే పొట్టు శరీరంలోని రక్త ప్రసరణను నియంత్రిస్తుంది. దాంతో పాటు వేరు శెనగ పొట్టు గుండెను రక్షిస్తుంది. నాన బెట్టిన వేరు శెనగ కండరాలు క్షీణతను నివారిస్తుంది. మరియు కండరాలను టోన్ చేయడానికి సాయ పడతాయి. నాన బెట్టిన వేరు శెనగలను ఉదయం పూట పరగడుపుతో తింటే మరికొన్ని ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి. వీటి వల్ల ఎసిడిటీ, గ్యాస్ సమస్యలు తగ్గుతాయి. ఇవి వెన్ను నొప్పి మరియు కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం కలిగిస్తాయి. చలి కాలంలో, కీళ్లలో దృఢత్వం రావాలన్నా… మరియు నొప్పి పోవాలన్నా… వేరు శెనగలకు కొంచెం బెల్లం కలిపి తింటే మంచి ప్రయోజనం చేకూరుతుంది.నాన బెట్టిన వేరు శెనగలు జ్ఞాపక శక్తిని పెంచుతాయి. కంటి చూపును బలంగా ఉంచడంలో వేరు శెనగ ఎంతో ఉపయోగపడుతుంది.
వేరు శెనగలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, జింక్, కాల్షియం మరియు ఐరన్ క్యాన్సర్ కణాలతో పోరాడటానికి మరియు వాటి పెరుగుదలను నిరోధిస్తాయి. పల్లీలలో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. నాన బెట్టిన పల్లీలను క్రమం తప్పకుండా తీసుకుంటే చర్మానికి మెరుపు వస్తుంది. అయితే.. నాన బెట్టిన పల్లీలను ఎప్పుడు పడితే అప్పుడు తినకూడదని వైద్యులు చెబుతారు. నాన బెట్టిన వేరు శెనగలతో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. కానీ వాటిని పరిమితంగానే తినాలని సూచిస్తారు డాక్టర్లు. నాన బెట్టిన పల్లీలను తినేందుకు ఉదయం సమయమే అత్యుత్తమమని చెబుతారు. రాత్రి పూట వేరుశెనగను తినకూడదని సలహా ఇస్తారు. ఎందుకంటే నానబెట్టిన వేరు శెనగల్లో ప్రోటీన్‌లో ఎక్కువగా ఉంటాయి. ఇది రాత్రి పూట తీసుకుంటే… జీర్ణ వ్యవస్థపై భారం పడుతుంది. రోజులో ఒక గుప్పెడు పల్లీలు తీసుకుంటే మంచిది. భోజనాల మధ్య ఆకలి వేస్తున్నప్పుడు నాన బెట్టిన పల్లీలు తినడం ప్రయోజనకరం.
TTD : టీటీడీలో ఉద్యోగాల కోసం కొంత మంది కళ్లల్లో ఒత్తులు వేసుకొని మరీ ఎదురు చూస్తూ ఉంటారు. అయితే…
Elon Musk : టెస్లా అధినేత, బిలియనీర్ ఎలాన్ మస్క్ భారతదేశం ఓట్ల-లెక్కింపు ప్రక్రియ యొక్క సామర్థ్యాన్ని ప్రశంసించారు. ఆదివారం…
Prashanth Varma : అ! సినిమాతో డైరెక్టర్ గా కెరీర్ మొదలు పెట్టిన ప్రశాంత్ వర్మ ఒక్కో సినిమాకు తన…
Heels Cracked : చలికాలం వచ్చిందంటే చాలు చర్మ సమస్యలు అనేవి వెంటాడుతాయి. అలాగే చర్మం పగిలిపోవడం మరియు పొడిబారడం,చర్మం నిర్జీవంగా…
Hero Splendor Plus : హీరో స్ప్లెండర్ ప్లస్ బైక్ సొంతం చేసుకోవాలనే వారికి షో రూం హర కంటే…
Acidity : ప్రస్తుత కాలంలో చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ఎక్కువ సంఖ్యలో ప్రజలు కడుపుకు సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు.…
Nagarjuna : ప్రతి శనివారం నాగార్జున బిగ్ బాస్ Bigg Boss Telugu 8 వేదికపైకి వచ్చి తెగ సందడి…
Ranapala Leaves : రణపాల మొక్క అనేది శాస్త్రీయ మొక్క. దీని ఆకులు కాస్త మందంగానే ఉంటాయి. ఈ ఆకులు తింటే…
This website uses cookies.