Summer Eye Care : ఎండాకాలంలో మీ కళ్ళు జర భద్రం... లేదంటే సమస్యలు తప్పవు... కళ్ళు పోతాయి సుమా...?
Summer Eye Care : ఎండాకాలం అయిపోతున్న ఎండలు తగ్గడం లేదు. అధిక వేడితో,ఉబ్బరింపుతో,ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు, అందరూ కూడా హిట్ స్ట్రోక్ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎండాకాలంలో అధిక వేడి శరీరంతో పాటు కళ్ళపై కూడా ప్రభావం చూపుతుంది అంటున్నారు నిపుణులు. కాబట్టి, ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. మీరు ఈ వేడి ఎండలో బయటికి,మీ కళ్ళకు కాస్త అసౌకర్యం కలుగుతుంది. ఎండ ప్రభావంతో మీ కళ్ళు ఎర్రబారడం జరుగుతుంది. ఎండాకాలంలో కళ్ళపై తగు జాగ్రత్తలు పాటించకుంటే త్రీవ్ర నష్టం వాటిల్లుతుందంటున్నారు నిపుణులు. ఫలితంగా, అంధత్వం, క్యాన్సర్ ప్రమాదం వంటివి వచ్చే అవకాశం కూడా ఉందట. కాబట్టి, ఈ పరిస్థితిలో మీ కళ్ళను ఎలా కాపాడుకోవాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, నిపుణులు ఏం తెలియజేస్తున్నారు తెలుసుకుందాం…
Summer Eye Care : ఎండాకాలంలో మీ కళ్ళు జర భద్రం… లేదంటే సమస్యలు తప్పవు… కళ్ళు పోతాయి సుమా…?
ఎండలో బయటికి వెళ్లినప్పుడు సన్ గ్లాసెస్ పెట్టుకోవడం మంచిది. వేసవిలో సన్ గ్లాసెస్ ని ఫ్యాషన్ కోసం కంటే కూడా ఆరోగ్యం కోసం ధరించడం తప్పనిసరి. ఎండలో ఉన్నప్పుడు సన్ గ్లాసెస్ ఇంకా టోపీ, వాటర్ బాటిల్ లాంటివి వెంట ఉంచుకుంటే మంచిదన్నారు నిపుణులు. సన్ గ్లాసెస్ UVA -UVB రెండు రకాల కిరణాల నుండి మీ కళ్ళను రక్షిస్తాయి. ఎవరైనా సరే కాంటాక్ట్ లెన్స్ లను ఉపయోగిస్తుంటే,దీని గురించి కూడా క్లుప్తంగా తెలుసుకోండి…మీ చేతులు కడుక్కొని కాంటాక్ట్ లెన్స్లను ధరించండి, ఇది సంక్రమణ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మీరు కాంటాక్ట్ లెన్స్లను ధరించినా, సన్ గ్లాసెస్ ని ఉపయోగించవచ్చు.
వాతావరణం లోనికి బయటికి వెళ్లినప్పుడు హైడ్రేషన్ గా ఉండడం కూడా చాలా ముఖ్యం. డిహైడ్రేషన్ సమస్య వచ్చినప్పుడు కళ్ళు పొడిగా మారుతాయి. ఇంకా కళ్ళమంట, చికాకు,కళ్ళు ఎర్రగా మారడం లాంటి సమస్యలు కూడా తలెత్తుతాయి. కావునా, ఈ వేసవిలో ఆరోగ్యంగా ఉండాలంటే కనీసం 3 లీటర్ల నీటిని తాగాలి. పిల్లలకు కంటి ఆరోగ్యం పట్ల, జాగ్రత్తలను చెప్పడం మంచిది.సన్ గ్లాసెస్ ని ఉపయోగించాలని వైద్యులు సూచిస్తున్నారు. బయటికి ఎండలో వెళ్లేటప్పుడు తప్పనిసరిగా సన్ గ్లాసెస్ ని,తలపై టోపీని తరించాలి అంటున్నారు నిపుణులు.
Biryani |బిర్యానీ అంటే నాన్ వెజ్ ప్రియులకి కన్నుల పండుగే. కానీ, తాజాగా హైదరాబాద్ ముషీరాబాద్‌లో ఓ రెస్టారెంట్‌లో చోటుచేసుకున్న…
Pawan Kalyan | అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫొటోను ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ…
UPI |భారతదేశంలో డిజిటల్ చెల్లింపులకు రూపురేఖలు మార్చిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI) రికార్డులు తిరగరాసింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్…
Trisha | దుబాయ్ వేదికగా ఇటీవల నిర్వహించిన సైమా అవార్డుల వేడుకలో పాల్గొన్న సౌత్ క్వీన్ త్రిష మరోసారి ఫ్యాషన్, సినిమా…
Walking | ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజూ నడక తప్పనిసరి అని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా రోజుకు 10 వేల అడుగులు నడవడం…
Cholesterol | శరీరంలో LDL (చెడు కొలెస్ట్రాల్) స్థాయులు పెరగడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తుంటారు. ఇది గుండె సంబంధిత వ్యాధులకు ప్రధాన…
I Phone 17 | టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ తన లేటెస్ట్ ఐఫోన్ మోడల్ ఐఫోన్ 17ను తాజాగా…
Dizziness causes symptoms | చాలా మందికి ఆకస్మాత్తుగా తలతిరిగిన అనుభవం వస్తుంది. లేచి నిలబడినప్పుడు, నడుస్తున్నప్పుడు లేదా తల తిప్పిన…
This website uses cookies.