Home » Health » Super Foods For Strong Bones
Health

Strong Bones : మీ ఎముక‌ల బ‌లానికి ఈ పొడుల‌ను పాలలో కలిపి తాగండి.. నొప్పులు మాయం

Authored By
Ramalingaiah Tandu
The Telugu News | Published on: May 10, 2025, 10:00 am
Advertisement

Strong Bones : మన శరీరానికి బలమైన ఎముకలు ఎంతో అవసరం. ఈ రోజుల్లో వ‌య‌స్సుతో ప‌నిలేకుండా చిన్నా పెద్దా అంద‌రూ మోకాళ్లు, న‌డుం నొప్పుల‌తో బాధ‌ప‌డుతున్నారు. దీనికి కారణం సరైన పోషకాలు లేకపోవడమే అంటున్నారు వైద్య నిపుణులు. ఈ పరిస్థితిని సహజ పద్ధతిలో చక్కబెట్టడం సాధ్యమే అంటున్నారు. మ‌న తాగే పాలలో కొన్ని పొడులను కలిపి తీసుకుంటే శరీరానికి కావాల్సిన పోషణ లభించి ఎముకలు స్ట్రాంగ్‌గా త‌యారు అవుతాయి. ఇలా చేయడం వల్ల నొప్పులు కూడా మాయ‌మైపోతాయి.

Advertisement

Strong Bones : మీ ఎముక‌ల బ‌లానికి ఈ పొడుల‌ను పాలలో కలిపి తాగండి.. నొప్పులు మాయం

బాదం : బాదంలో కాల్షియం చాలా ఎక్కువగా ఉంటుంది. పాలలో చిన్న స్పూన్ బాదం పొడి కలిపి తాగితే ఎముకలు దృఢంగా తయారవుతాయి. ఇది తరచూ తాగడం వల్ల మోకాళ్ల సమస్యలు తగ్గుతాయి.

Advertisement

ఇలాచి : ఇలాచిలో సహజ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. పాలలో కొద్దిగా ఇలాచి పొడి కలిపి తాగితే శరీరంలోని హానికరమైన పదార్థాలు బయటికి వెళ్లిపోతాయి. దీనివల్ల శక్తి పెరిగి చురుకుదనం వస్తుంది.

అశ్వగంధ : అశ్వ‌గంధ శక్తినిచ్చే ఆయుర్వేద మూలిక. పాలతో కలిపి తాగితే ఒత్తిడి తగ్గి శరీరానికి ప్రశాంతత కలుగుతుంది. దీనివల్ల ఎముకల ఆరోగ్యం మెరుగవుతుంది. ఇది రాత్రి పడుకోబోయే ముందు తీసుకుంటే మరింత ప్రయోజనకరంగా ఉంటుంది.

Advertisement

పసుపు : ప‌సుపు శరీరంలో ఉన్న వాపులను తగ్గించగలిగే గుణం కలిగి ఉంటుంది. పాలలో పసుపు కలిపి తాగడం వల్ల నొప్పులు తగ్గుతాయి.

డ్రై అంజీర్ : ఎండిన అంజీరులో ఐరన్‌తో పాటు కాల్షియం ఎక్కువగా లభిస్తుంది. పాలలో ఈ పొడి కలిపి తాగడం వల్ల ఎముకల బలంతో పాటు రక్తహీనత నివారించడంలో కూడా స‌హాయ ప‌డుతుంది.

నువ్వులు : నువ్వుల్లో కాల్షియం అధికంగా ఉంటుంది. పాలలో నువ్వుల పొడి కలిపి తాగడం వల్ల ఎముకల దృఢత్వం పెరుగుతుంది.

ఖర్జూరా : ఖ‌ర్జూరాల్లో ఐరన్, ఖనిజాల పరంగా సమృద్ధిగా ఉండటంతో పాలలో కలిపి తాగినప్పుడు శరీరానికి శక్తి లభిస్తుంది. ఎముకలు బలపడతాయి.

Advertisement

దాల్చిన చెక్క : దాల్చిన చెక్కలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. పాలలో ఈ పొడి కలిపి తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

అలాగే రాగులు, బార్లీ, శనగలు, సోయాబీన్ వంటి ధాన్యాల మిశ్రమాన్ని పొడి రూపంలో తయారు చేసి పాలలో కలిపి తాగితే శక్తి పెరుగుతుంది. ఈ పద్ధతి ద్వారా ఎముకలకు కావాల్సిన పోషకాలు అందుతాయి. బెల్లం సహజంగా ఐరన్ అందించే మంచి మార్గం. పాలలో బెల్లం పొడి కలిపి తాగడం వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ పెరుగుతుంది. ఇది ఎముకల ఆరోగ్యానికి మంచిది.

Ramalingaiah Tandu

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి