Breakfast : ఉదయం అల్పాహారంలో వీటిని అసలు తినకూడదు... ఎందుకో తెలుసుకోండి...?
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం. ఇది రోజు మొత్తం శరీరం ఎనర్జిటిక్ గా ఉండేందుకు హెల్ప్ చేస్తుంది. అయితే ఎవరైనా ఉదయాన్నే అల్పాహారం తీసుకోకపోతే లేక హడావిడిగా అనారోగ్యకరమైన ఆహారాన్ని తీసుకున్నప్పుడు అలసట మరియు చిరాకు లాంటి సమస్యలు వస్తాయి. అలాగే ఉదయాన్నే తీసుకునే అల్పాహారం ఆరోగ్యంగా ఉంటే ఆ రోజంతా శరీరంలో శక్తి అనేది ఉంటుంది. అయితే కొన్ని రకాల ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు కూడా ఉన్నాయి. అయితే వాటిని మాత్రం అల్పాహారంగా అసలు తినకూడదు. వాటిలో ఎక్కువ కేలరీలు అనేవి ఉంటాయి. కాబట్టి వాటిని ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ అనేవి పెరిగి బరువు పెరుగుతారు. అందుకే మనం తీసుకునే అల్పాహారంలో బెల్లం మరియు కొవ్వు, ప్రోటీన్లు ఉన్న ఆహారాలను తీసుకోవాలి. అయితే న్యూట్రిషన్ దీప్సీఖా జైన్ తన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. దీనికోసం ఆమె అల్పాహారంలో తినకూడని ఆహార పదార్థాల గురించి తెలియజేశారు. ఆ ఆహార పదార్థాలు అనేవి ఎంతో ఆరోగ్యకరమైనప్పటికీ కూడా వాటిని తినడం వలన ఆరోగ్యానికి హాని కలుగుతుంది అని అన్నారు. అయితే అల్పాహారంలో తీసుకోకూడని ఆహార పదార్థాలు ఏమిటో చూద్దాం…
పండ్ల రసాలు మరియు స్మూతీలో ఫైబర్ కంటెంట్ చాలా తక్కువగా ఉంటుంది. దీనిని అల్పాహారంగా ఖాళీ కడుపుతో తీసుకుంటే షుగర్ లెవెల్స్ అనేవి బాగా పెరుగుతాయి. వీటితో పాటుగా తక్కువ ఫైబర్ కారణం చేత తక్కువ టైంలో మళ్లీ ఆకలి వేస్తున్న ఫీలింగ్ కూడా వస్తుంది…
టీ లేక కాఫీ : ఉదయాన్నే అల్పాహారంతో పాటుగా టీ లేక కాఫీలు కూడా అసలు తీసుకోకూడదు. వీటిని తీసుకోవడం వలన ఆహారంలో ఉండే పోషకాలను శరీరం సరిగ్గా గ్రహించలేకపోతుంది. అలాగే అల్పాహారంతో పాటుగా టీ లేక కాఫీలు తాగడం వలన శరీరంలో ఐరన్, కాల్షియం, జింక్ లాంటి పోషకాల లోపం కూడా ఏర్పడే ఛాన్స్ ఉంది…
యోగార్ట్ : యోగార్ట్ అనేది ఎంతో రుచికరంగా ఉంటుంది. అయితే దీనిలో మాత్రం షుగర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితులలో దానిని అల్పాహారంగా తీసుకోవడం వలన ఎక్కువ కేలరీలు చేరతాయి. అంతేకాక కొంత టైం తర్వాత మళ్లీ ఆకలి వేస్తున్నా అనుభూతి కలుగుతుంది.
Breakfast : ఉదయం అల్పాహారంలో వీటిని అసలు తినకూడదు… ఎందుకో తెలుసుకోండి…?
అరటిపండు : వీటిలో ఆరోగ్యకరమైన ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయి. అయితే వీటిని కూడా ఉదయాన్నే ఖాళీ కడుపుతో అస్సలు తినకూడదు. ఎందుకు అంటే ఖాళీ కడుపుతో అరటి పండును తీసుకోవడం వలన మెగ్నీషియం మరియు పొటాషియం స్థాయిలు ఒక్కసారిగా పెరిగిపోతాయి. అప్పుడు గుండె వేగం లో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. కాబట్టి ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకునే ఆహార పదార్థాల్లో ఆరోగ్యానికి హాని కలిగించే ఎన్నో రకాల ఆరోగ్యకరమైన ఆహారాలు కూడా ఉన్నాయి. అందుకే అల్పాహారంలో ఎప్పుడు ప్రోటీన్ మరియు ఫైబర్ తో పాటు ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. ఎందుకు అంటే అల్పాహారంగా ఎక్కువ ఫైబర్ ఉన్న ఆహారాలను తీసుకుంటే ఆకలిని తగ్గిస్తుంది. అలాగే బరువు తగ్గడానికి కూడా హెల్ప్ చేస్తుంది…
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.