Blood Platelet : వర్షాకాలం అంటేనే ఎన్నో రకాల వ్యాధులకు నిలయం అని చెప్పొచ్చు. ఈ కాలంలో దోమలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. దీంతో డెంగ్యూ సమస్యలు తలెత్తుతాయి. అయితే ఈ డెంగ్యూ అనేది సోకినప్పుడు రోగి రక్తంలోని ప్లేట్ లైట్ ల సంఖ్య అనేది చాలా వరకు తగ్గుతుంది. ఈ ప్లేట్ లైట్స్ అనేవి 50 వేల కన్నా తక్కువగా ఉన్నట్లయితే ఆరోగి ప్రాణాలకే ప్రమాదం. కానీ ఈ ప్లేట్ లెట్స్ అనేవి చాలా తక్కువగా ఉంటే డెంగ్యూ మాత్రమే కాక ఇంకొక వ్యాధి కూడా వస్తుంది. ఈ వ్యాధిని ఇమ్యూన్ థ్రోంబోసైటోపెనియా పర్పూర అని అంటారు. అయితే ఈ బ్లడ్ డిజార్డర్ ప్లేట్ లైట్ ల సంఖ్యను ఎంతో వేగంగా తగ్గిస్తుంది. అయితే ఈ వ్యాధికి గల కారణాలు మాత్రం ఇప్పటివరకు పరిశోధకులు తెలుసుకోలేకపోయారు. అయితే మన శరీరంలోని రోగనిరోధక వ్యవస్థలో ఏదో ఒక లోపం వలన ఈ వ్యాధి అనేది వస్తుంది అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
అయితే ఈ వ్యాధి అనేది సోకితే మన శరీరం సొంత రోగ నిరోధక వ్యవస్థ ప్లేట్ లైట్ లను దెబ్బతీయటం మొదలు పెడుతుంది అని ముంబై లోని జస్లోక్ హాస్పటల్ అండ్ రీసెర్చ్ సీనియర్ వైద్యుడు తెలిపారు. దీని ఫలితంగా మన శరీరంలో ప్లేట్ లైట్ సంఖ్య పరిమాణం అనేది తగ్గటం మొదలవుతుంది. అయితే CBC, PS పరీక్షలతో ఈ వ్యాధిని నిర్ధారణ చేయవచ్చు. అయితే కొన్ని సమయాలలో డెంగ్యూ నుండి కోలుకున్న తర్వాత కూడా ఈ వ్యాధి అనేది శరీరంలో అభివృద్ధి చెందుతూనే ఉంటుంది.
ఏ పరీక్షల ద్వారా ఈ వ్యాధిని గుర్తించవచ్చు : ఒక వ్యక్తికి డెంగ్యూ అనేది లేకునా సరే రక్తంలో ప్లేట్ లైట్ సంఖ్య లక్ష కంటే తక్కువగా ఉన్నట్లయితే అది క్రమంగా తగ్గుతూ వచ్చినట్లయితే దానిని థ్రోంబో సైటోపెనియా కు సంకేతం కావచ్చు. ఈ వ్యాధి అనేది చాలా అరుదుగా వస్తుంటుంది. అయితే CBC రక్త పరీక్షలు చేయించటం ద్వారా ప్లేట్ లైట్ సంఖ్య లక్ష కంటే తక్కువగా ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించటం మరవద్దు. ఈ వ్యాధిని మందులతో తొందరగా తగ్గించవచ్చు.
-చర్మ కింద చిన్నపాటి మచ్చలు అనేవి వస్తాయి.
– చిగుళ్ళు మరియు నోరు, ముక్కు నుండి రక్తస్రావం వస్తుంది.
– శరీర అవయవాలలో నొప్పి లేదా వాపు కనిపిస్తుంది.
– మోకాలు లేక మోచెయ్యి మరియు కీళ్లకు గాయాలు.
– తొందరగా అలిసిపోయినట్లు అనిపించటం.
– పీరియడ్స్ టైం లో అధిక రక్తస్రావం అవడం.
ఎలా చికిత్స చెయ్యాలి : ఈ వ్యాధి అనేది రోగనిరోధక వ్యవస్థకు ఆటంకం కలిగించటం వలన వస్తుంది. దీనిని తగ్గించడానికి ప్రత్యేకమైన చికిత్స లేదు. కానీ ఈ వ్యాధిని ఈజీగా తగ్గించవచ్చు. మీ శరీరంలో ప్లేట్ లైట్ సంఖ్య తక్కువగా ఉన్న సంకేతాలు కనిపించినట్లయితే రక్త పరీక్షలు చేయించుకొని వైద్యులను సంప్రదించండి…
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్‌కి దగ్గర పడింది. టాప్ 5కి ఎవరు వెళతారు,…
Google Sundar Pichai : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ Donald Trump మరియు Google గూగుల్ సీఈఓ…
India : కొన్నేళ్లుగా భారత్- కెనడా దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా,…
Bank Account : ఒకప్పుడు ఒక వ్యక్తికి ఒక బ్యాంక్ ఖాతా మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఒక్కో వ్యక్తికి…
Periods : ప్రస్తుతం మన జీవనశైలి మరియు ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పుల కారణం చేత యువతను ఎన్నో రకాల…
Bobby : రచయితగా కెరియర్ స్టార్ట్ చేసిన బాబి తర్వాత ఆ అసిస్టెంట్ డైరెక్టర్‌గా మారాడు. పవర్ సినిమాకి బాబీ…
Sleep : మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం తీసుకునే ఆహారం అనేది ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం…
This website uses cookies.