Blood Platelet : డెంగ్యూ లేకున్నా రక్తంలో ప్లేట్ లైట్ సంఖ్య తగ్గటానికి కారణం ఏమిటి…ఈ లక్షణాలు కనిపిస్తే… జాగ్రత్త…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Blood Platelet : డెంగ్యూ లేకున్నా రక్తంలో ప్లేట్ లైట్ సంఖ్య తగ్గటానికి కారణం ఏమిటి…ఈ లక్షణాలు కనిపిస్తే… జాగ్రత్త…!

Blood Platelet : వర్షాకాలం అంటేనే ఎన్నో రకాల వ్యాధులకు నిలయం అని చెప్పొచ్చు. ఈ కాలంలో దోమలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. దీంతో డెంగ్యూ సమస్యలు తలెత్తుతాయి. అయితే ఈ డెంగ్యూ అనేది సోకినప్పుడు రోగి రక్తంలోని ప్లేట్ లైట్ ల సంఖ్య అనేది చాలా వరకు తగ్గుతుంది. ఈ ప్లేట్ లైట్స్ అనేవి 50 వేల కన్నా తక్కువగా ఉన్నట్లయితే ఆరోగి ప్రాణాలకే ప్రమాదం. కానీ ఈ ప్లేట్ లెట్స్ అనేవి చాలా తక్కువగా […]

 Authored By ramu | The Telugu News | Updated on :4 August 2024,9:00 am

Blood Platelet : వర్షాకాలం అంటేనే ఎన్నో రకాల వ్యాధులకు నిలయం అని చెప్పొచ్చు. ఈ కాలంలో దోమలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. దీంతో డెంగ్యూ సమస్యలు తలెత్తుతాయి. అయితే ఈ డెంగ్యూ అనేది సోకినప్పుడు రోగి రక్తంలోని ప్లేట్ లైట్ ల సంఖ్య అనేది చాలా వరకు తగ్గుతుంది. ఈ ప్లేట్ లైట్స్ అనేవి 50 వేల కన్నా తక్కువగా ఉన్నట్లయితే ఆరోగి ప్రాణాలకే ప్రమాదం. కానీ ఈ ప్లేట్ లెట్స్ అనేవి చాలా తక్కువగా ఉంటే డెంగ్యూ మాత్రమే కాక ఇంకొక వ్యాధి కూడా వస్తుంది. ఈ వ్యాధిని ఇమ్యూన్ థ్రోంబోసైటోపెనియా పర్పూర అని అంటారు. అయితే ఈ బ్లడ్ డిజార్డర్ ప్లేట్ లైట్ ల సంఖ్యను ఎంతో వేగంగా తగ్గిస్తుంది. అయితే ఈ వ్యాధికి గల కారణాలు మాత్రం ఇప్పటివరకు పరిశోధకులు తెలుసుకోలేకపోయారు. అయితే మన శరీరంలోని రోగనిరోధక వ్యవస్థలో ఏదో ఒక లోపం వలన ఈ వ్యాధి అనేది వస్తుంది అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

అయితే ఈ వ్యాధి అనేది సోకితే మన శరీరం సొంత రోగ నిరోధక వ్యవస్థ ప్లేట్ లైట్ లను దెబ్బతీయటం మొదలు పెడుతుంది అని ముంబై లోని జస్లోక్ హాస్పటల్ అండ్ రీసెర్చ్ సీనియర్ వైద్యుడు తెలిపారు. దీని ఫలితంగా మన శరీరంలో ప్లేట్ లైట్ సంఖ్య పరిమాణం అనేది తగ్గటం మొదలవుతుంది. అయితే CBC, PS పరీక్షలతో ఈ వ్యాధిని నిర్ధారణ చేయవచ్చు. అయితే కొన్ని సమయాలలో డెంగ్యూ నుండి కోలుకున్న తర్వాత కూడా ఈ వ్యాధి అనేది శరీరంలో అభివృద్ధి చెందుతూనే ఉంటుంది.

ఏ పరీక్షల ద్వారా ఈ వ్యాధిని గుర్తించవచ్చు : ఒక వ్యక్తికి డెంగ్యూ అనేది లేకునా సరే రక్తంలో ప్లేట్ లైట్ సంఖ్య లక్ష కంటే తక్కువగా ఉన్నట్లయితే అది క్రమంగా తగ్గుతూ వచ్చినట్లయితే దానిని థ్రోంబో సైటోపెనియా కు సంకేతం కావచ్చు. ఈ వ్యాధి అనేది చాలా అరుదుగా వస్తుంటుంది. అయితే CBC రక్త పరీక్షలు చేయించటం ద్వారా ప్లేట్ లైట్ సంఖ్య లక్ష కంటే తక్కువగా ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించటం మరవద్దు. ఈ వ్యాధిని మందులతో తొందరగా తగ్గించవచ్చు.

Blood Platelet డెంగ్యూ లేకున్నా రక్తంలో ప్లేట్ లైట్ సంఖ్య తగ్గటానికి కారణం ఏమిటిఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త

Blood Platelet : డెంగ్యూ లేకున్నా రక్తంలో ప్లేట్ లైట్ సంఖ్య తగ్గటానికి కారణం ఏమిటి…ఈ లక్షణాలు కనిపిస్తే… జాగ్రత్త…!

Blood Platelet లక్షణాలు ఏమిటి

-చర్మ కింద చిన్నపాటి మచ్చలు అనేవి వస్తాయి.
– చిగుళ్ళు మరియు నోరు, ముక్కు నుండి రక్తస్రావం వస్తుంది.
– శరీర అవయవాలలో నొప్పి లేదా వాపు కనిపిస్తుంది.
– మోకాలు లేక మోచెయ్యి మరియు కీళ్లకు గాయాలు.
– తొందరగా అలిసిపోయినట్లు అనిపించటం.
– పీరియడ్స్ టైం లో అధిక రక్తస్రావం అవడం.

ఎలా చికిత్స చెయ్యాలి : ఈ వ్యాధి అనేది రోగనిరోధక వ్యవస్థకు ఆటంకం కలిగించటం వలన వస్తుంది. దీనిని తగ్గించడానికి ప్రత్యేకమైన చికిత్స లేదు. కానీ ఈ వ్యాధిని ఈజీగా తగ్గించవచ్చు. మీ శరీరంలో ప్లేట్ లైట్ సంఖ్య తక్కువగా ఉన్న సంకేతాలు కనిపించినట్లయితే రక్త పరీక్షలు చేయించుకొని వైద్యులను సంప్రదించండి…

Also read

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది