Vastu Tips : చాలామంది ఎంత సంపాదించినా డబ్బు నిలకడగా ఉండదు. ఎంత దాచుకున్నామని ప్రయత్నించిన ఏదో ఒక రూపంలో డబ్బు మాయమైపోతుంది. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే వాస్తు ప్రకారం గా ఇంట్లో కొన్ని దోషాలు ఉండడం వలన ఆర్థిక సమస్యలు అనేవి వస్తుంటాయి. అయితే జ్యోతిష్య శాస్త్ర ప్రకారం కొన్ని వస్తువులను ఇంట్లో ఉంచడం ద్వారా ఆర్థిక సమస్యలు అనేవి తొలగిపోతాయి. మనం ఇంటిని వివిధ రకాల వస్తువులతో అలంకరిస్తూ ఉంటాం. ఇలా ఇంట్లో ఉంచిన వస్తువులు మీ విధిని మార్చగలవు. కాబట్టి కొన్ని వస్తువులను ఇంట్లో ఉంచుకోవడం మంచిది. ముఖ్యంగా ఈ ఐదు వస్తువులను ఇంట్లో ఉంచుకోవడం ద్వారా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. అయితే ఆ ఐదు వస్తువులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
1) వాస్తు ప్రకారం గా ఇంటికి తూర్పు వైపున సింహం విగ్రహాన్ని ఉంచడం వలన ఇంటికి మంచి జరుగుతుంది. ఇంట్లో ఎప్పుడు కాంస్య సింహ విగ్రహాన్ని ఉంచుకోవాలి. అలాగే విగ్రహ ముఖం ఇంటి ప్రధానం ద్వారం వైపు ఉండాలి. ఇలా ఉంచడం వలన మీ ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. అలాగే డబ్బు కూడా నిలుస్తుంది.
2) ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉంటే లాఫింగ్ బుద్ధను డబ్బు ఉంచే ప్రదేశంలో పెట్టాలి. సాధారణంగా లాఫింగ్ బుద్ధను కిరాణా షాపులో, క్యాష్ కౌంటర్ల దగ్గర చూస్తుంటాం. కొన్ని ఆఫీసుల్లో టేబుల్ పైన చూస్తుంటాం. అయితే దీనిని ఇంట్లో ఉంచుకోవడం, ఆఫీసుల్లో ఉంచుకోవడం మంచిది. అయితే లాఫింగ్ బుద్ధును ఎవరైనా గిఫ్ట్ గా ఇస్తే తీసుకోవడం మంచిది అంటారు. అలాగే కొనకూడదని చాలామంది అంటుంటారు.
3) అలాగే దేవుడి గదిలో శంఖంను ఉంచడం వలన ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. పూజ చేసే సమయంలో శంఖాన్ని ఊదడం ద్వారా ఇంట్లో ఉండే ప్రతికూల శక్తి పారిపోతుంది. ఇంట్లోకి అనుకూల వాతావరణం ఏర్పడి ఇల్లు సిరిసంపదలతో కళకళలాడుతుంది. కనుక ఇంట్లో శంఖాన్ని ఉంచుకోవడం మంచిది.
4) వాస్తు ప్రకారం ఈశాన్యం మరియు నైరుతి దిశలు భూమి సూత్రానికి సంబంధించినవి. ఇంట్లో మట్టితో చేసిన వస్తువులను ఈ దిశలో ఉంచడం వలన ఇంట్లోని సమస్యలు తొలగిపోతాయి జ్యోతిష్య శాస్త్రంలో ఈ దిక్కులను శుభప్రదంగా భావిస్తారు. కనుక మట్టితో చేసిన వస్తువులను ఈ దిశలో ఉంచితే ఆర్థికంగా ఎంతగానో వృద్ధి చెందుతారు.
5) జ్యోతిష్య శాస్త్ర ప్రకారం కొబ్బరికాయలు లక్ష్మీదేవికి చిహ్నంగా భావిస్తారు. ఇది లేకుండా పూజా అసంపూర్ణంగా ఉంటుంది. ఆర్థిక సమస్యలు ఉన్నవారు కొబ్బరికాయను క్రమం తప్పకుండా లక్ష్మీదేవి పూజలో వాడడం వలన ఆ సమస్యలు తొలగిపోతాయి. దీనివలన ఇంట్లో సిరిసంపదలు, సుఖ సంతోషాలు కలుగుతాయి. కనుక ఈ 5 వస్తువులను ఇంట్లో ఉంచడం ద్వారా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి.
Waqf Amendment : పార్లమెంటులో శీతాకాల సమావేశాలు వాడి వేడిగా జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లో వక్ఫ్ ఆస్తులు, మతపరమైన విషయాల…
Allu Ayaan : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ Allu Arjun మరి కొద్ది రోజులలో పుష్ప2 అనే సినిమాతో…
Nagababu : ఆంద్రప్రదేశ్లో మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ రావడం మనం చూశాం. ఏపీతోపాటు ఒడిశా, వెస్ట్ బెంగాల్…
Pawan Kalyan : మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని బంగ్లాదేశ్లోని తాత్కాలిక ప్రభుత్వం హిందువులపై జరుపుతున్న అకృత్యాలను అరికట్టాలని కోరిన మత…
Rain Alert : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తిరుపతి జిల్లాలో నవంబర్ 26 నుంచి 28 వరకు భారీ…
Eknath Shinde : మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రిపై ఉత్కంఠ కొనసాగుతుంది. అయితే తనను ముఖ్యమంత్రిని చేయకుంటే ఏక్నాథ్ షిండే రాష్ట్ర…
Keerthy Suresh Relationship : మహానటి కీర్తి సురేష పెళ్లి గురించి కొన్నాళ్లుగా నెట్టింట అనేక వార్తలు వస్తున్న విషయం…
Smartphone : డిజిటల్ యుగంలో స్మార్ట్ఫోన్లు రోజువారీ జీవితంలో ఒక అనివార్య భాగంగా మారాయి. కమ్యూనికేషన్, వినోదం మరియు సమాచార…
This website uses cookies.